హిమాంక్ రెడ్డి దువ్వూరు మాట్లాడుతూ ‘‘నెంబర్ వన్ యారి సమయంలో నేను, రాకేష్ కలిశాం. అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి స్టోరి ఉందని రాకేష్ చెప్పగానే విన్నాను. ఫణిదీప్ నెరేషన్ వినగానే కనెక్ట్ అయ్యాను. సింహ, కావ్యలకు థాంక్స్. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు.
డైరెక్టర్ ఫణిదీప్ మాట్లాడుతూ ‘‘సినిమా ఏంటనేది సింపుల్‌గా టీజర్లో చెప్పాం. ఇప్పుడు మా టీమ్ గురించి మాట్లాడుకోవాలి. నాతో సహా చాలా మంది ఈ సినిమాతో జర్నీని స్టార్ట్ చేశాం. రెండేళ్ల ముందే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించాం. సినిమా గురించి ఇంకా విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.
వెంకటేష్ మహ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో సింహ చిన్ననాటి పాత్రకు తండ్రి పాత్రలో నటించాం. నేను, ఫణిదీప్ ఒకేసారి జర్నీని స్టార్ట్ చేశాం. మా లైఫ్‌లో ఉన్న బైక్ కథే అని చెప్పాలి. మంచి అనుబంధం ఉంది. ఉస్తాద్ బైక్‌తో మా అందరికీ రిలేషన్ ఉంది. ఏదైనా వస్తువుతో మనకు రిలేషన్ ఉంటే దానికి లైఫ్ ఉంటుందనే చెప్పాలి. అలాంటిదే మా ఉస్తాద్ బైక్. అలాగే నిజ జీవితంలోనూ మంచి సినిమా ఎక్కడున్నా రానాగారు ఉస్తాద్ బైక్‌లా మారి ముందుకు తీసుకెళతున్నారు. నా ఫస్ట్ మూవీకి ఆయనతో ఎటాచ్మెంట్ వచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఫణి ఫస్ట్ ఫిల్మ్‌కి కూడా రానాగారు రావటం అనేది గొప్ప విషయం. నిర్మాతలు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.
కావ్యా కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఉస్తాద్ టీజర్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాం. కచ్చితంగా సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి. అందరికీ ఆల్ ది బెస్ట్’’అన్నారు.
ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నటీనటులు:
శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనుహాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ తదితరులు
సాంకేతిక వర్గం:
సాయి కొర్రపాటి ప్రొడక్షన్
బ్యానర్స్: వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
రచన, దర్శకత్వం: ఫణిదీప్
సినిమాటోగ్రఫీ: పవన్ కుమార్ పప్పుల
మ్యూజిక్: అకీవా.బి
ఎడిటర్: కార్తీక్ కట్స్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ ములె
సౌండ్ డిజైన్: అశ్విన్ రాజశేఖర్
కాస్ట్యూమ్స్: ప్రియాంక వీరబోయిన
వి.ఎఫ్.ఎక్స్ సూపర్వైజర్: సునీల్ రాజు చింత
లిరిక్స్: అనంత శ్రీరాం, రెహమాన్, లక్ష్మీ ప్రియాంక
లైన్ ప్రొడ్యూసర్స్: ప్రజనయ్ కొనిగరి, రాజేష్ గడ్డం
పి.ఆర్.ఒ: వంశీ కాకా