“Sridevi Soda Center” booming with female audience support

సుధీర్ బాబు,ఆనంది హీరో హీరోయిన్లుగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ప్రపంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 27 న విడుద‌లైన ఈ చిత్రం థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ  సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.సమాజంలో ఆడవాళ్లపై జరుతున్న సమస్యలను, స్త్రీల వైపు, స్త్రీల పట్ల ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న మహిళా సంఘ సేవకులకు ఆదివారం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ఈ కార్యక్రమంలో  హైకోర్టు అడ్వకేట్ శారదా దేవి, కొండవీటి సత్యవతి, tv9 దేవి, ఆర్.వాణి, అపర్ణ, హీరో సుదీర్ బాబు,చిత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, దర్శకుడు కరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.. అనంతరంఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన

హైకోర్టు అడ్వకేట్ శారదా దేవి మాట్లాడుతూ.. .సినిమా  ఏండింగ్ చూశాక కోలుకోడానికి కొంత సమయం పట్టింది నాకు సినిమాఅద్భుతంగా ఉంది.ఈ సినిమా చూసిన తరువాత తమ్ముడు సుధీర్ బాబుని నాచురల్ స్టార్ అని చెప్పవచ్చు . చాలా క్యాజువల్ గా మన మధ్యలో తిరిగే టటువంటి ఒక ఒక జంటని చూస్తే ఎలా ఉంటుందో అంత న్యాచురల్ గా ఆనంది ,సుధీర్ బాబు లు చాలా బాగా చేశారు. అలాగే కళ్యాణి గారి నటనకు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. తను ఇందులో  జీవించేశారు.ఈ భారతదేశంలో ఒక మహిళ  పురుష అహంకార మనువాదంలో  పెరిగి ఆ బావ సంచలనం తోటి పెరిగే భర్తతో  సంసారం చేసేటటు వంటి ఒక ఆడపిల్ల తల్లిగా కళ్యాణి వేదనను  వర్ణించలేం. దర్శకుడు కరుణ గారు ఇందులో చూపించినట్లు వాస్తవాలను  సమాజంలో ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికీ  ఇంకా అనేక గ్రామాల్లో వెలియ వాడలున్నాయి ,దళిత వాడలున్నాయి ,ఊరి చివరన పూరి గుడిసెలు ఉన్నాయి. ఇప్పటికీ కలుపుకో లేనటువంటి.. పరిష్కారం లేనటువంటి సమస్యలను సమస్యగానే చూస్తున్నాం. మనం చాలా మాట్లాడుతాము కులాలు ఎందుకు మతాలు ఎందుకు మానవత్వం గొప్ప అని చెబుతాం. కానీ మన వరకు వచ్చేసరికి మరో రీతిలో స్పందించడం జరుగుతుంది .శరీరం ఒకలా స్పందిస్తే మనసు మరొక లాగా స్పందిస్తుంది అని చాలా అంతర్భాగంగా ఒక మానసిక సంచలనాల ని ఏ విధంగా ఉంటాయి అనేది కరుణ కుమార్ గారు ఈ సినిమాలో చాలా అద్భుతంగా న్యాచురల్ గా చెప్పడం జరిగింది. మొహమాటం లేకుండా చెప్పాలంటే పురుషుడు అనేవాడికి కులం తక్కువ అనేది పెళ్లెప్పుడు గుర్తొస్తే పడుకోవడానికి మాత్రం కులం అవసరం లేదు. అది ఎంగిలాకు అయినా సరే.. ఏమిరా.. మీ.. అహంకారం ఎక్కడికి పోతున్నాము మనం. నిజంగా దిక్కరించాలంటే ఇలాంటి మనస్తత్వాలను ఏరి పారేయాలి.నీకు  భార్య గా వచ్చే అమ్మాయి నీ వంశాన్ని ఉద్ధరించడానికి అందరినీ వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చే టటువంటి అమోఘమైన మల్లె పువ్వు లాంటి మనస్తత్వం కలిగిన ఆడపిల్ల నీ దగ్గరకు వచ్చినపుడు నీకు ఏ కులమైతే ఏంటి ఏ మతమైతే ఏంటి అనేది ఆలోచన చేయాలి. ప్రేమించడానికి ఉంచుకోవడానికి ఆడది అవసరం పడుతుంది. కానీ పెళ్లి అనేసరికి రెండు కుటుంబాలు పరువులు మనం చూస్తూ ఉంటాం. పరువు అనే హానర్ ఫీలింగ్స్ చాలా వస్తున్నాయి కానీ పెద్దలుకుదిర్చిన పెళ్లిళ్లు కూడా విడాకులు కావాలని  చాలా కేసులు కోర్టుకు వస్తున్నాయి. కానీ అబ్బాయి అమ్మాయి మనస్తత్వాల్లో చాలా తేడా రావాలి. సమాజానికి అనుగుణంగా అబ్బాయి అమ్మాయి ఆర్థికంగా వాళ్లకు ఉన్నటువంటి సంస్కృతీ పరంగా భేద,భావాలు వచ్చాయనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. వారికి అటువంటి ఇండిపెండెంట్ ఆలోచన ఉన్నప్పుడు ఇండిపెండెంట్ గానే ఉండనివ్వాలి.కానీ మన అహంకారంతో వాటిని కట్టిపెట్టి చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ నిజంగా హ్యాపీ ఎండింగ్ ఉంటే అందరికీ నచ్చుతుంది. కానీ వాస్తవానికి వాస్తవాలను వాస్తవంగా చూపించడం జరిగింది కాబట్టి మనం బాధపడుతూ వెళ్లడం జరుగుతుంది. కానీ తప్పదు అంగీకరించాలి. సమాజంలో ఇటువంటివి చాలా జరుగు తున్నాయి ఇంకా చూస్తూనే ఉన్నాం.అయితే కొంచెం సేపు బాధ పడి తర్వాత వెంటనే మర్చిపోతాం ఎందుకు జరుగుతుంది అనేది వాస్తవంగా విశ్లేషించిన ప్పుడు మనిషి మనస్తత్త్వాన్ని కౌన్సిలింగ్ చేసి వాళ్లని మనతో పాటు మార్చగలిగిన అప్పుడే మాత్రమే మార్పు సాధ్య మవుతుంది. ఉదాహరణకు..ఇందులో హీరో నరేష్ ని చంపాలని వచ్చినప్పుడు నరేష్ తో హీరో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు అని చెప్తాడు.ఇది చాలా అవసరమై నటువంటి వాక్యం ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో పరువు హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు కరుణ .మాకు చాలాసార్లు  కోర్టుకు ఇటువంటి కేసులు వస్తే నేను ఆ కేసును చదివినప్పుడు ఒళ్ళు గగుర్పొడిచేది. ఇప్పుడు ఈ సినిమా చూసిన తరువాత ఇక్కడ అమ్మాయి ఉరి వేసే సన్నివేశాన్ని. కోర్టులో నేను చదివిన సన్నివేశాన్ని  క్రోడీకరించి చూసుకుంటే నాకు ఒక్కసారి నాకు మైండ్ బ్లాక్ అయ్యేలా అనిపించింది.వాస్తవంగా కూతురును పోగొట్టుకున్న కల్యాణి బాధ ,ఇటు నరేష్ పరువు పోతుందనే బాధ, కులం పెద్దకు అంత వయసు వచ్చినా కూడా అమ్మాయి తండ్రి ఎంతో ఇష్టపడి పెంచిన అమ్మాయిని కులం, పరువు పోతుందనే బాధతో  కూడా కులం కులం అనుకుంటూ ముక్కు పచ్చలారని అమ్మాయి అని ఉరి వేయడం జరుగుతుంది. ఈ సినిమాలోనే కాకుండా బయట వాస్తవాలు వాస్తవంగా ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. బయట మేము చూస్తున్నాం వింటున్నాం చదువుతున్నాను కాబట్టి ఇంకా అలా జరగకుండా ఈ సినిమా ద్వారా ఆపే ప్రయత్నం చేశారు చిత్ర టీం. ఇది ప్రతి ఇంటికి తెలియాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఇటువంటివి ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.సినిమాల ద్వారా ఇలాంటి సోషల్ అవేర్ నెస్ సినిమాలు చాలా రావాలి. ఏ వ్యవస్థ లోనైనా కూడా ఇంకా  కులము అనేది మాత్రం చాలా వేళ్లూనుకుని పోయింది దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కరుణ కుమార్ గారికి నేను అభినందిస్తున్నాను.ఈ సినిమాను చూసిన వారిలో ఇద్దరు ముగ్గురు కూడా వీళ్ళ ప్రయత్నం సక్సెస్ అయినట్టే అని భావిస్తున్నాను

కొండవీటి సత్యవతి గారు మాట్లాడుతూ. . నిజానికి నేను సినిమా చూసిన తర్వాత ఇంకా కోలుకోలేదు అదే ఫీలింగ్ లో ఉన్నాను ఈరోజు నా చుట్టూ జరుగుతున్న అనేక సంఘటనలను చూసాం చూస్తున్నాం కులం పేరుతో మతం పేరుతో జరుగుతున్న దారుణాల నీ కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నాం ఈ సినిమా మధ్యలో వచ్చిన మతాంతర వివాహం చాలా బాగుంది ఈ సినిమాలో తను చెప్పదలుచుకున్నది ఈ సినిమా ద్వారా చెప్పడం జరిగింది కులం కాదు మతం కాదు ప్రేమ అనే దగ్గరితనం చూపించడం జరిగింది. ఈరోజు నా పెళ్ళి రోజు నేను  నలభై సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నా ఇప్పటికీ ఇప్పటికీ మా బంధం బలంగా ఉంది. ప్రేమకు కులం మతం అనేది అడ్డు కాదు కులం అనే శిలాన్ని  సినిమా ద్వారా చావు దెబ్బ కొట్టాల్సిన అవసరం వచ్చింది. దర్శకుడుకరుణ ఇలాంటి సినిమాలు చాలా తీయాలి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

Tv9 దేవి గారు మాట్లాడుతూ .. ఇలాంటి ఇలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తూ తీసిన సుధీర్ గారికి నిర్మాతలకు దర్శకులకు ధన్యవాదాలు. ఈ సినిమాలో హీరోయిజం లేకుండా కథకు ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమాను తీశారు .వీరు మంచి కథలను సెలెక్ట్ చేసుకొని ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కి వచ్చారు. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి మెసేజ్ ఇచ్చారని అన్నారు.

ఆర్.వాణి మాట్లాడుతూ .. వినిమా నాకు చాలా నచ్చింది. ఇలాంటి కథను హీరో గారు ఒప్పుకోవడం చాలా గ్రేట్. ఇలాంటి కథలు తీయాలంటే చాలా గట్స్ ఉండాలి.అలాంటి గట్స్ తో దర్శక,నిర్మాతలు సినిమా చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. హీరో,హీరోయిన్స్ చాలా అద్భుతంగా ఉంది.ఫ్యామిలీ తో కలసి చూడవలసిన సినిమా ఇది .ఇంకా చూడవలసిన వారందరూ ఈ సినిమా కచ్చితంగా చూడాలని అన్నారు.

అపర్ణ మాట్లాడుతూ ..హ్యాపీ ఎండింగ్ ఇస్తే ఇలాంటి ఛేంజ్ ఉండేది కాదు.. మేమంతా ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. సమాజాన్ని మార్చే ఇలాంటి అనేక సినిమాలు రావాలని అన్నారు.

చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ..తెలుగు సినిమాలు స్త్రీ పాత్రలు తాలూకా ప్రాధాన్యం తగ్గుతుందనే విమర్శ ఎప్పటినుండో ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం చేస్తున్నా ప్రొడక్షన్ హౌస్ ని మీ లాంటి వాళ్లంతా చూసి ఇలాంటి సినిమాల్ని మీరంతా ఎంకరేజ్ చేసి పదిమందికి మౌత్ ఆప్ టాక్స్ తో బయటికి వెళితే ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం మాలాంటి దర్శకులకి అటువంటి ప్రొడక్షన్ హౌస్ లకు ధైర్యం వస్తుంది. అలాగే మన ఇండస్ట్రీలో మెయిల్ డామినేషన్ ఉంది అనే విమర్శ కూడా ఉంది కానీ సుధీర్ బాబు ఈ  శ్రీదేవి సోడా సెంటర్  అనే పేరుతో ఉన్న సినిమాను ఒప్పుకోవడమే ముందు అడుగు .అలాగే హీరోయిన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.కథే హీరో అని నమ్మి దానికి పూర్తి న్యాయం చేశారు.ఈ సినిమాను 70mm అధినేతలు తీయడం అభినందనీయం వారు మా కథను నమ్మి హీరో మరియు నిర్మాతలు ముందుకు వచ్చి ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు అందుకే ఈ సినిమా ఈ రోజు ఇంత ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి రచయిత అపర్ణ తోట రావలసింది కానీవారి మదర్ చనిపోవడంతో వారు రాలేకపోయారు ఇక్కడికి రావాల్సిన వారు చాలా మంది అక్కడికి వెళ్లడం జరిగింది. మహిళ లోకమంతా కూడా ఈ సినిమాను చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొని ఇంత మంచి చిత్రం తీసిన దర్సక,నిర్మాతలకు అభినందనలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here