Stalin Movie Releasing on 9th in Telangana

థియేటర్ల గుత్తాధి పత్యం వల్లే స్టాలిన్ ను తెలంగాణ లో విడుదల చేయలేకపోయాం.

9 నుండి తెలంగాణ థియేటర్ల లో విడుదల చేస్తున్నాం..

విడుదలైన అన్ని చోట్ల అద్భుత స్పందన

మంచి రివ్యూ రేటింగ్ లు… నిర్మాత నట్టి కుమార్. .

అంద్రెప్రదేశ్,తమిళనాడు తో పాటు ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ముందుగా ప్రకటించిన ప్రకారం స్టాలిన్’ (అందరివాడు)చిత్రాన్ని విడుదల చేసినప్పటికీ కేవలం తెలంగాణ రాష్ట్రం లో విడుదల చేయలేకపోయాము..ఇందుకు థియేటర్ల గుత్తాది పత్యమే కారణమని నట్టిస్ ఎంటర్టైన్మెంట్ అధినేత నట్టికుమార్ ఆరోపించారు.

జీవా, రియా సుమన్ జంటగా . ప్రముఖ తెలుగు హీరో నవదీప్ విలన్ గా రత్న శివ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని. ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిర్మాతలు నట్టి కరుణ ,నట్టి క్రాంతి లు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.కాగా ఈ చిత్రాన్ని శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పాత్రికేయులకు ప్రదర్శించారు.

అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం లో కొంతమంది చేతుల్లో థియేటర్ లు ఉండడం వలన చిన్న సినిమాల విడుదలకు థియేటర్ లు దొరకక సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. సినిమా కంటెంట్ చూసి థియేటర్లు ఇస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం.ఒక సినిమాకు ప్రేక్షకులే అసలైన న్యాయ నిర్ణేతలు.. ఆ విషయాన్ని గుత్తాది పత్యం వహిస్తున్న విషయం తెలుసుకోవాల్సిన విషయం ఎంతో ఉంది..ఈ చిత్రానికి విడుదలైన అన్ని చోట్లా అద్భుతమైన స్పందన తో పాటు,మంచి రివ్యూ రేటింగ్స్ కూడా వచ్చాయి.ఈ సినిమాను తెలంగాణ రాష్ట్రం లో ఆదివారం 9 వ తేదీ నుండి 50 నుండి 60 థియేటర్ లలో విడుదల చేయబోతున్నాము అని నట్టికుమార్ తెలిపారు.

చిత్ర నిర్మాతలు నట్టి కరుణ,నట్టి క్రాంతిలు మాట్లాడుతూ .. ఈ చిత్రానికి జీవా,నవదీప్ ల నటన,ఇమ్మాన్ సంగీతం,రత్న శివ దర్శకత్వం వాటి వన్నీ హైలైట్ గా కుదిరాయి అని ఆన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here