Superstar Rajinikanth thunders ‘I am a bad cop’about Darbar movie

చేతిలో గన్‌ ఉందని రజనీకాంత్‌కి గురి పెడితే?
బుల్లెట్‌ కంటే స్పీడుగా ఆయన చేతిలో కత్తి వేటుకు విలన్‌ రక్తం చిందుతుంది!
ఆయన కొట్టడం మొదలుపెడితే?
ఆ ఫైట్‌లోనూ ఓ స్టైల్‌ ఉంటుంది! ఓ గ్రేస్‌ ఉంటుంది! ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే మేనియా ఉంటుంది!
ఆయన డ్యాన్స్‌ చేస్తే?
థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేయాల్సిందే. చప్పట్ల
మోత మోగాల్సిందే! థియేటర్లలోనే కాదు… రజనీకాంత్‌ కొత్త సినిమా ట్రైలర్‌ యుట్యూమ్‌లో విడుదలైనా సందడి సందడిగా ఉంటుంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. సుభాస్కరన్‌ భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా, సునీల్‌శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా విడుదల కానుంది.

‘సార్‌! వాళ్ళకు చెప్పండి… పోలీసుల దగ్గరకు లెఫ్ట్‌లో రావొచ్చు. రైట్‌లో రావొచ్చు. స్ట్రైయిట్‌గా రావొద్దని’
‘ఆ చూపేంటి? ఒరిజినల్‌గానే విలన్‌ అమ్మా! ఇది ఎలా ఉంది?’
‘అయామ్‌ ఎ బ్యాడ్‌ కాప్‌’ అని రజనీకాంత్‌ చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.

రజనీకాంత్‌ని ఉద్దేశిస్తూ… ‘వాడు పోలీసాఫీసరా సార్‌? హంతకుడు!’ అని చెప్పే డైలాగ్‌ సినిమాలో యాక్షన్‌ సీన్లు ఏ రేంజ్‌లో ఉంటాయనేది, విలన్లను రజనీకాంత్‌ ఏ రేంజ్‌లో ఆట ఆడించారనేది చెప్పకనే చెప్పింది. ఈ ట్రైలర్‌ చాలా స్టయిలిష్‌గా ఉందని విడుదలైన కొన్ని సెకన్లలో సోషల్‌ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఓ:  సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి, బి.ఎ.రాజు, స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్, పాటలు: అనంత శ్రీరామ్, సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here