స్టార్ హీరో సూర్య మూవీ కొత్త చిత్రం “ఆకాశం నీ హద్దురా” ఫస్ట్ లుక్ విడుదల

2డి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య హీరోగా నిర్మాతగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 6వ చిత్రం “ఆకాశం నీ హద్దురా” ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ బాలమురలి హీరోయిన్ గా నటిస్తోంది. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఈమధ్య వరస ఫెయిల్యూర్లతో మార్కెట్ తగ్గిపోయింది. ముఖ్యంగా సూర్య లాస్ట్ సినిమాలు ‘NGK’.. ‘బందోబస్త్’ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో ఇప్పుడున్న పరిస్థితిలో మంచి హిట్ పడితే కానీ సూర్య పోగొట్టుకున్న మార్కెట్ మళ్ళీ తిరిగిరాదు. సూర్య ప్రస్తుతం ‘సూరారై పొట్రు’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. సినిమాకు తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ నిర్ణయించారు.

నటీనటులు
సూర్య, అపర్ణ బాలమురలి, కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న

సాంకేతిక నిపుణులు
నిర్మాత : సూర్య శివకుమార్
కో ప్రొడ్యూసర్ : రాజశేఖర్ కర్పూర పాండియన్
కథ, దర్శకురాలు : సుధా కొంగర ప్రసాద్
స్క్రీన్ ప్లే : షాలిని ఉషాదేవి & సుధా కొంగర
సినిమాటోగ్రఫీ : శ్రీనికిత్ బొమిరెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్
ఎడిటర్ : సతీష్ సూర్య
ఆర్ట్ డైరెక్టర్ : జాకీ
కాస్టమ్ డిజైనర్ : పూర్ణిమ
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ : సెంథిల్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here