Suspens thriller Karthiks ‘The Killar’ Movie Review

Cinemarangam.com..Rating 3.25 /5
Banner: Yadav Production House
Cinema : “Karthik” the killar
Cast: Karthik Sai, Dalisha, Neha Deshpande etc. Cinematography: Gaddam Edukondalu
Art : Subhas, Nani
Editing: Nani Kasara Gadda
Music: Siddarth Watkins
Written, Directed by:  Chinna
Producers: avula Raju Yadav, Sankineni  Vasudeva Raju

కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా  చిన్నా దర్శకత్వంలో శ్రీమతి లలిత సమర్పణలో  యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు నిర్మించిన చిత్రం కార్తీక్’  ది కిల్లర్. ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
ధ్రువ (కార్తిక్)హీరో  ప్రాస్ మ్యాక్స్  యాడ్ ఏజెన్సీ రన్ చేస్తూ నచ్చిన ప్రతి అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటాడు. ధ్రువ తల్లి ద్వారా పరిచయమైన అమ్మాయి దీక్ష(డాలీషా), పరిచయమైన కొద్దీ కాలంలోనే వీరిద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించు కుంటుంటారు. ఇంతలో దీక్ష కు వీసా రావడంతో అమెరికా  వెళుతుంది.అలా వెళ్లిన దీక్ష కొంతకాలానికి ఇండియాకు వస్తుంది. వచ్చిన తరువాత వీరిద్దరూ అరకు లోని ఒక గెస్ట్ హౌస్ కు వెళ్లగా అక్కడ దీక్ష మిస్ అవుతుంది.అరకు మొత్తం వెదికినా అమ్మాయి జాడ కనిపించదు. తీరా వెదికే క్రమంలో అరకు లో గత కొంత కాలంగా కొంత మంది అమ్మాయిలు మిస్ అవుతూ మిస్ అయిన వారంలోనే వారి తల కనపడకుండా డెడ్ బాడీస్ దొరుకుతున్నాయని తెలుస్తుంది.అయితే ఈ క్రమంలో అరకులో  అమ్మాయిలు  వరుసగా  హత్యకు గురవుతూ ఉంటారు. ఆ హత్యలు అతి దారుణంగా జరుగుతూ ఉండటంతో పోలీసులు రుద్రాని నేహా దేశ్‌పాండే (పోలీస్ ఆఫీసర్)ఇన్వెస్టిగేషన్  కోసం నియమిస్తారు.అయితే ఈ కేసును పోలీస్ లు సీరియస్ గా తీసుకుంటారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. అసలు ఈ హత్యలను చేస్తోంది ఎవరు ? ఎందుకు చేస్తున్నారు ?హత్యలకు కారణం ఏంటి ? వారు మోటివ్ ఏమిటి ? అమ్మాయిలను చంపుతున్న ఆ వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ లు కలసి ఎలా కనిపెట్టారు ? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు
నటీనటుల పర్మార్మెన్స్ విషయానికొస్తే..కార్తిక్ చాలా బాగా నటించాడు.  సరదాగా ఉన్నా కూడా రొమాంటిక్ సీన్స్ లో మ్యాన్లీగా కనిపించాడు. ధ్రువ,దీక్ష, మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. అమ్మాయిలు హత్యకు గురయిన వారి అడ్రెస్ లను కనిపెట్టే సీన్స్ లో ధ్రువ సహజంగా నటించి మెప్పించాడు. దీక్ష క్యారెక్టర్ లో డాలీసా, పోలీస్ ఆఫీసర్ గా నటించిన  నేహా దేశ్ పాండే  ఇద్దరూ కూడా బెస్ట్  పర్మార్మెన్స్ ఇచ్చారు. డబుల్ గ్లామర్ డోస్ ఇచ్చి, ట్రెండీ హీరోయిన్స్ అనేలా చేశారు. పోలీస్ క్యారెక్టర్స్ చేసిన మిగిలిన నటీనటులు అంతా తమ పాత్రల పరిధి మేరకు కన్విన్సింగ్ గా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు చిన్నా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు మేకింగ్ లో తన ప్రత్యేకత చూపించారు. ప్రతి సీన్ దర్శకుడు చిన్న తన కథ మీదున్న పట్టును, క్రియేటివ్ స్క్రీన్ ప్రెజెన్స్ ను చూపిస్తుంది. దర్శకుడు కథను గందరగోళం లేకుండా కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా క్లైమాక్స్ వరకు లీడ్ చేశాడు. ఇంటర్వెల్ కు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.  ఈ హత్యలకు కారణం ఎంటనేది తెలిసినప్పడు కథ మీద అంచనాలు మరింత పెరుగుతాయి. ప్రతి సీన్ కు ఎడిటింగ్ లో వేసిన డిస్క్రిప్షన్స్ కొత్తగా ఉన్నాయి.గడ్డం ఏడుకొండలు సినిమాటోగ్రాఫర్ తన కెమెరా విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో సిద్దార్థ్ వాకింగ్స్ సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. నిర్మాత .ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు లు ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు. ఇందులో నటించిన పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.ఇక క్లైమాక్స్ లో కిల్లర్ సినిమా రెండవ భాగం “కిల్లర్ 2” ఉంటుందని చెప్పేయడం మరో విశేషం. మొత్తంగా ఇన్నోవేటివ్ మూవీస్ చూడాలనుకునే వారికి ఇదొక బ్రిలియంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు.ప్రేక్షకులకు “కిల్లర్” సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

         Cinemarangam.com..Rating 3.25 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here