Suspense Crime Thriller ‘Puli Vachindi Meka Chachhindi’ Movie Review

Cinemarangam.com
రివ్యూ రేటింగ్ : 3/5
బ్యానర్ : ప్రస్థానం మార్క్స్
సినిమా : “పులి వచ్చింది మేక చచ్చింది”
నిర్మాత – భవానీ శంకర్ కొండోజు,
రచన – దర్శకత్వం –శేఖర్ యాదవ్
నటీనటులు : చిత్రం శ్రీను, జయలలిత ,యోగి, వర్ష, మను, ఆ శేఖర్ యాదవ్, చందు, సుజిత్, శంకర్ తదితరులు
సంగీతం – సుభాష్ ఇషాన్,
సినిమాటోగ్రఫీ – కిరణ్ కుమార్ దీకొండ,
ఎడిటర్ – శ్రీనివాస్ అన్నవరపు,
ఆర్ట్ – అడ్డాల పెద్దిరాజు,
ఆడియోగ్రఫీ – రంగరాజు,
సౌండ్ డిజైన్ – రఘునాథ్ కామిశెట్టి,
సౌండ్ ఎఫెక్ట్స్ – యతిరాజ్,
పి.ఆర్.ఓ : జి.యస్.కె మీడియా

థ్రిల్లర్ మూవీస్ ఎంచుకొని తీసిన కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తారు. . దర్శకుడు శేఖర్ యాదవ్  ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథను ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మూవీని  తెరకెక్కించాడు. ప్రపంచపు తొలి 360 డిగ్రీల స్క్రీన్ ప్లే  సినిమాగా తెరకెక్కిన చిత్రం ‘పులి వచ్చింది మేక చచ్చింది’ మూవీని  ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘పులి వచ్చింది మేక చచ్చింది’ సినిమా ఈ నెల 17న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని ఒకరోజు ముందే పాత్రికేయులకోసం ప్రీమియర్ షో ను ప్రదర్శించడం జరిగింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
రిటైర్డ్ ఐ.పి.యస్ పోలీస్ ఆఫీసర్ గోవి (మను) ,ఆస్ట్రేలియా లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాండా (ఆనంద్ భారతి) ఇద్దరు మంచి స్నేహితులు. వీరి మధ్య జరుగుతున్న స్టోరీ డిస్కర్షన్ ఆస్ట్రేలియాలో మొదలవుతుంది. అక్కడ నుండి ఇండియాలోని హైదరాబాద్ కు టర్న్ అవుతుంది. మాఫియా డాన్ పాండా (ఆనంద్ భారతి) ఇప్పటివరకు జరగని కొత్త కథని చూడాలి వినాలి,పుస్తక రూపంలో రాయాలి అని రిటైర్డ్ ఐ.పి యస్ పోలీస్ ఆఫీసర్ గోవి (మను) ని అడిగితే ఇప్పటివరకు తన లైఫ్ లో చూసిన ఒక భయంకరమైన ఎక్సపీరియెన్స్ ను చెప్పడం మొదలు పెడతాడు. హైదరాబాద్ లోని మారుమూల ప్రాంతంలో  జరిగిన ఇన్సిడెంట్ గురించి చెపుతూ..ఒకే కుటుంబ సభ్యులైన చిత్రం శ్రీను (రాబర్ట్), అరుణకుమారి (నిహారిక) దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి వారిలో పెద్ద కొడుకు వాసుదేవ్ (యోగి) ,కూతురు వైశాలి (వర్ష ),చిన్న కొడుకు గోవి(మను) వీరందరూ కలసి తమ కుటుంబంలోని ఒక వ్యక్తిని చంపాలనుకుంటారు ? వీరిలో ఎవరు ఎవరిని చంపాలనుకుంటారు ? చివరకు ఎవరు చనిపోయారు? వారిని చంపింది ఎవరు ? చనిపోయిన మేక ఎవరు?  ఓవరాల్ గా ఇందులో పులి ఎవరు ? ఆ పులి  కనిపెట్టాలి అంటే మరి ఈ సినిమా చూడవలసిందే..

నటీనటులు
చిత్రం శ్రీను (రాబర్ట్) , అరుణకుమారి (నిహారిక) వీరిద్దరూ బార్య భర్తలుగా  పాత్రలో నేచురల్ గా చాలా చక్కగా నటించాడు.చిత్రం శ్రీను కు ఈ సినిమాతో సెకెంట్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. వాసుదేవ్ (యోగి) , వైశాలి (వర్ష ) వికలాంగురాలిగా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది, .గోవి (మను) చిన్నప్పటి పాత్రలో మరియు రిటైడ్ పోలీస్ ఆఫీసర్ గా , గ్యాంగ్ స్టర్ పాండా (ఆనంద్ భారతి) లు కూడా తమ పాత్రల మేరకు  నటించారు. వీరిద్దరు పాత్రల నిడివి చిన్నదే అయినా వీరి నుండే కథ మొదలవుతుంది.

సాంకేతిక నిపుణులు
సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘పులి వచ్చింది మేక చచ్చింది’ సినిమాను దర్శకుడిగా తను చెప్పాలనుకున్న కథను ఎక్కడా దృష్టి మరలకుండా కథను కథగా ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా తెరకెక్కించారు.ఇది రెగ్యులర్ సినిమల్లా కాకుండా సినిమా మొదటి భాగం, రెండవ భాగం సమాంతరంగా కథ నడుస్తోంది.ఇర్రెగ్యులర్ గా శుభం కార్డ్ తో సినిమా మొదలై ఇర్రెగ్యులర్ గానే ఎండ్ అవుతుంది.ఎండ్ అయ్యే టైం లో 360 డిగ్రీస్ అనే దానికి  ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతుంది అనే విషయాన్ని కంక్లూజింగ్ ఇస్తుంది .సుభాష్ ఇషాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్లో ఉంది, సౌండ్ మిక్సింగ్ ఇచ్చిన రంగరాజు గారు పనితనం బాగుంది. కిరణ్ కుమార్ దీకొండ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి . శ్రీనివాస్ అన్నవరపు ఎడిటింగ్ పరవాలేదు. భవానీ శంకర్ కొండోజు గారు తీసిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.ఓవరాల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ బాగున్నా సినిమాలో  ల్యాగ్ ఎక్కువైంది. మంచి  కాన్సెప్ట్ తో తీసిన “‘పులి వచ్చింది మేక చచ్చింది’ ” సినిమా వంటి డీఫ్రెంట్ సినిమాలను ఇష్టపడే    ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి.చూసిన వారెవరైనా  ఇందులో ఉన్న పులిని కనిపెట్టి 10 లక్షలు చేజిక్కించుకొని వెళ్ళవచ్చు

Cinemarangam.com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here