Suspense Crime Thriller “SHUKRA” Movie Review

Release date :-April 23,2021
Cinema rangam :- Rating 3/5
Movie Name :- “’SUKRA ”
Banner: Rujala Entertainment’s, Vaizag film factory
Cast: Aravind Krishna,, Sreejitha Ghosh, Vishal Raj, Sanjeev, Isha Shetty, Jaspreet, Pooja, Chandni, Kamalakar, Rudra etc.
Music: Asheerwad
Editor : Shiva Sharma
DOP : jagadeesh Bommisetti
P.R.O: – GSK Media
Producers: Ayyanna Nayudu nalla, Tej palli
Written and directed by – Suku Purva

రుజాల ఎంటర్ టైన్ మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ , విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్ ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర నటీనటులుగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో అరుదైన జానర్ గా చెప్పుకునే మైండ్ గేమ్ నేపథ్యంతో ఆద్యంతం ఆకట్టుకునే కథా కథనాలతో నూతన దర్శకుడు సుకు పూర్వజ్ తెరకెక్కించిన చిత్రం “శుక్ర” అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని కరోనా ప్యాండమిక్ స్విచ్ వేషన్ లో కూడా దైర్యంగా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన “శుక్ర” సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథేంటంటే
విలియమ్ అలియాస్ విల్లి (అరవింద్ కృష్ణ) ఒక బిజినెస్ మెన్. సొంత కంపెనీ నడుపుతుంటాడు. అతని అందమైన వైఫ్ రియా (శ్రీజిత ఘోష్). విల్లి బిజీ లైఫ్ వల్ల వైజాగ్ వచ్చాకే ఈ జంటకు ప్రైవసీ దొరుకుతుంది. భర్త తనతో ఎక్కు టైమ్ స్పెండ్ చేయాలని రియా కోరిక.అలాగే వైజాగ్ నగరంలో థగ్స్ అనే మాఫియా ముఠా వరుస నేరాలకు పాల్పడుతుంటుంది. డబ్బున్న కుటుంబాలను హతమార్చి లూటీలు చేస్తుంటారు. నగరం నేరమయంగా ఉన్నప్పుడు ఇక్కడికి భార్యతో కలిసి వస్తాడు విల్లి.తన బర్త్ డే రోజు ఆఫీస్ కు లీవ్ పెట్టి తన బర్త్ డేకు హౌస్ పార్టీ కావాలని కోరుతుంది రియా. అలా తన క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి విల్లీ రియా ఇంట్లో పార్టీ చేసుకుంటారు. ఈ పార్టీ జరిగిన రాత్రి అనూహ్యంగా రియా, మరో ఇద్దరి హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు చేసిందెవరు, హత్యలకు కారణం ఏంటి, తన భార్యను, స్నేహితులను చంపిన ఆ నేరస్తుడిని విల్లి ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ.

నటీనటుల ప్రతిభ
నటీనటుల పర్మార్మెన్స్ విషయానికొస్తే.. విల్లి క్యారెక్టర్ అంటే అరవింద్ కృష్ణ గుర్తొచ్చేలా నటించాడు. భార్యతో సరదాగా ఉన్న రొమాంటిక్ సీన్స్ లో మ్యాన్లీగా కనిపించాడు. ఒక బిజినెస్ మేన్ గా ప్రొఫెషనల్ బాడీ లాగ్వేజ్ చూపించాడు. విల్లి, రియా మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. తన బెటర్ హాఫ్ హత్యకు గురయినప్పుడు ఎమోషనల్ సీన్స్ లో అరవింద్ సహజంగా నటించి మెప్పించాడు. రియా క్యారెక్టర్ లో శ్రీజిత న బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చింది. డబుల్ గ్లామర్ డోస్ ఇచ్చి, ట్రెండీ హీరోయిన్ అనేలా చేసింది. మెయిన్ లీడ్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, పోలీస్ క్యారెక్టర్స్ చేసిన నటీనటులు అంతా తమ పాత్రల పరిధి మేరకు కన్విన్సింగ్ గా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితనం
దర్శకుడు సుకు పూర్వజ్ మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు మేకింగ్ లో తన ప్రత్యేకత చూపించారు. ప్రతి సీన్ డైరెక్టర్ సుకు పూర్వజ్ తన కథ మీదున్న పట్టును, క్రియేటివ్ స్క్రీన్ ప్రెజెన్స్ ను చూపిస్తుంది. దర్శకుడు కథను గందరగోళం లేకుండా కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా క్లైమాక్స్ వరకు లీడ్ చేశాడు. ఇంటర్వెల్ కు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. రెండు వేల రూపాయల వజ్రాల స్మగ్లింగ్ ఈ హత్యలకు కారణం అని తెలిసినప్పడు కథ మీద అంచనాలు మరింత పెరుగుతాయి. ప్రతి సీన్ కు ఎడిటింగ్ లో వేసిన డిస్క్రిప్షన్స్ కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి తన కెమెరా విశ్వరూపం చూపించాడు. ఇక క్లైమాక్స్ లో శుక్రకు రెండవ భాగం “శుక్ర 2” ఉంటుందని చెప్పేయడం మరో విశేషం. మొత్తంగా ఇన్నోవేటివ్ మూవీస్ చూడాలనుకునే వారికి ఇదొక బ్రిలియంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు.ప్రేక్షకులకు “శుక్ర” సినిమా ఈ వారం మంచి ఆప్షన్.

                                         Cinemarangam.com 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here