Suspense thriller “Brahma Varam”(P.S.Paridilo) Movie ready for release

బెల్లం కొండ స్రవంతి, సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్, రూపా లక్ష్మి, హర్షిని,గురు చరణ్, సూర్య, నటీ నటులుగా ఇమ్రాన్ శాస్రి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ చాలా మంది ఫ్రెండ్స్ కలసి డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం “బ్రహ్మవరం” పీఎస్ పరిధిలో.ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్బంగా

డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ తరుపున రిప్రజెంటేటివ్ ఉన్న హీరోయిన్ బెల్లం కొండ స్రవంతి మాట్లాడుతూ.. దర్శకుడు ఇమ్రాన్ శాస్రి కొత్త వాడైనా సమాజానికి పనికివచ్చే ఒక మంచి కంటెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాను దర్శకుడు అనుకున్న టైమ్ లో పూర్తి చేశాడు.అందరూ ఎంజాయ్ చేసేలా ఇందులో చక్కటి సస్పెన్స్ తో పాటు సినిమా మొత్తం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది.అలాగే ఇందులో ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఇంకా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి..ముజీర్ మాలిక్ గారు చేసిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీలో నటుడు జీవా చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు, సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్, రూపా లక్ష్మి, హర్షిని, సూర్య, ఇలా అందరూ చాలా బాగా నటించారు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు ఇమ్రాన్ శాస్రి మాట్లాడుతూ...మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ ను జోడించి తియ్యడం జరిగింది. హీరోయిన్ గా నటించిన బెల్లం కొండ స్రవంతి కి ఇది మొదటి సినిమా అయినా ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ నటిలా ఎమోషనల్ సీన్స్ లలో చాలా అద్భుతంగా నటించింది. అలాగే ఇందులో నటించిన వారందరూ చాలా బాగా నటించారు.సినిమాటో గ్రాఫర్ ముజీర్ మాలిక్ గారు మాకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. ఇలాంటి మంచి కథను మంచి బ్యానర్లో చేయడం చాలా హ్యాపీ గా ఉంది.మా మీద నమ్మకం పెట్టుకొని తీసిన డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ వారికి నా ధన్యవాదాలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ బిగ్ హిట్ చెయ్యాలని అన్నారు.

నటీ నటులు :
గురు , బెల్లంకొండ స్రవంతి హర్షిణి, శ్రీనివాస్ జీవా, ప్రేమ్ సాగర్, సమ్మెట గాంధీ, రూప లక్ష్మి, రుద్ర తిప్పే స్వామి, కాకినాడ ప్రసాద్, రామన్, డిడి శ్రీనివాస్, ప్రియా తదితరులు

సాంకేతిక నిపుణులు :

ప్రొడక్షన్: డ్రీమ్జ్ ఆన్ రీల్జ్
D.o.p: ముజీర్ మాలిక్
రచన మరియు దర్శకత్వం: ఇమ్రాన్ శాస్త్రి.
సంగీతం: సాకేత్ సాయిరామ్
ఎడిటింగ్: అవుల వెంకటేష్
సాహిత్యం: శ్రీనివాస్ మౌళి
కొరియోగ్రాఫర్: సుదర్శన్
విన్యాసాలు: దేవరాజ్
పి. ఆర్. ఓ : లక్ష్మీ నివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here