Suspense Thriller Entertainer ‘Rahasya’ Movie Review

Cinemarangam.com
సినిమా : “రహస్య”
రివ్యూ రేటింగ్ : 3 /5
బ్యానర్ :SSS ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : గౌతమి.S
దర్శకత్వం ::శివ శ్రీ మీగడ
నటీ నటులు: నివాస్ శిష్టు, సారా ఆచార్, బుగతా సత్యనారాయణ, గెద్ద  వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, సూరి బాబు, పాండు రంగారావు, ప్రదీప్, మోడల్ శ్రీను, రాజేశ్వరి, మధు, నల్ల శ్రీను, B.T. రావ్, T.V. రామన్, A.V. ప్రసాద్ తదితరులు
సంగీతం :  :చరణ్ అర్జున్
బ్యాగ్రౌండ్ స్కోర్ : సునీల్ కశ్యప్
కెమెరామెన్‌ : జీ సెల్వ కుమార్
ఎడిటర్‌ : ఎస్ బి ఉద్దవ్
పి.ఆర్.ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు


ప్రపంచంలోని ప్రతి దానికి ఒక రహస్యం ఉంటుంది. అలాగే మనం పుట్టుక నుంచి చనిపోయే వరకు మనకు మంచం ప్రధాన పాత్రపోసిస్తుంది. అయితే మనం వాడే మంచానికి మనిషికి ఉన్నటువంటి రహస్యమైన అభినవబావ సంబంధం ఏమిటీ అనే కథే ఈ “రహస్య”. SSS ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమి.S నిర్మించిన ఈ చిత్రంలో . నివాస్ శిష్టు, సారా ఆచార్ హీరో, హీరోయిన్ గా నటిస్తున్నారు.శివ శ్రీ మీగడ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు ,గ్లిమ్స్ కు, పాటలకు, టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9 న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన “రహస్య ” సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో థియేటర్ లో చూద్దాం పదండి

కథ
NIA ఆఫీసర్ విశ్వ (నివాస్ శిష్టు ), పోలీస్ ఆఫీసర్ వేదవతి (సారా ఆచార్) లు వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయితే ప్రిన్స్ లాడ్జ్ లో మంచంపై మర్డర్ అయిన టెర్రరిస్ట్ ఆల్ మక్సూద్ మర్డర్ కేస్ ను ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ రావడంతో. వీరిద్దరూ ఒకే మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తారు.ఈ క్రమంలో వీరిద్దరిలో ఉన్న ఇగోస్ వలన ఈ కేస్ విషయమై ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా సరైన ఆధారాలు దొరకవు. చివరికీ వీరిద్దరిలో ఉన్న ఇగోస్ ను పక్కనపెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు.ఇలా చేసే క్రమంలో ఈ మంచంపై పడుకున్న ప్రతి జంట హత్యకు గురవుతుంటారని తెలుసుకొని ఆ మంచం గురించి ఎంక్వయిరీ మెదలు పెడతారు.ఇలా ఎంక్వయిరీ చేసే టైమ్ లో వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు.ఇలా జరుగుతున్న క్రమంలో వీరిద్దరూ ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటారు. అసలు ఈ మంచంపై పడుకున్న జంటలే ఎందుకు హత్యకు గురవుతారు? ఇదంతా చేస్తున్నది, మనిషా, దయ్యమా, మరేదైనా అసలు ఈ మంచానికి మనిషికి గల రహస్య సంబంధం ఏమిటి? వీరికి తెలిసిన భయంకరమైన రహస్యమేంటి? ఆ రహస్యాన్ని విశ్వ, వేద లు ఎలా చేదించారా లేదా ? చివరికి వీరిద్దరూ ఒక్కటయ్యారా లేదా తెలుసుకోవాలనంటే “రహస్య” సినిమా చూడాల్సిందే


నటీ నటుల పని తీరు
విశ్వ తేజ (నివాస్ శిష్టు )యువ NIA ఆఫీసర్ పాత్రలో నేచురల్ గా నటించాడు.ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ క్యారెక్టర్ కు కావాల్సిన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. కథలో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో సహజమైన నటనతో పాటు పాత్రలో ఒదిగిపోయాడు. తనకిది మొదటి సినిమా అయినా సీనియర్ యాక్టర్ లా కథను తన బుజాలపై వేసుకొని సినిమాలో వన్ మ్యాన్ షో చూపించాడు. పోలీస్ ఆఫీసర్ గా నటించిన వేదవతి (సారా ఆచార్) చక్కటి పెర్ఫార్మెన్స్ తో పాటు రొమాంటిక్ లుక్స్ తో యూత్ ను ఆకట్టుకోవడమే కాకుండా తను చాలా చక్కటి నటనను కనబరచింది.. స్క్రీన్ పై విశ్వ తేజ , వేదవతి ల కెమిస్ట్రీ బాగా పండింది.డి జి. పి పాత్రలో నటుడు వేద భాస్కర్, అలాగే బుగతా సత్యనారాయణ, గెద్ద  వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, నల్ల శ్రీను, ఇలా ప్రతి ఒక్కరూ తమకిచ్చిన పాత్రల మేరకు చక్కగా నటించారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
ఒక మానవ జీవితానికి ముడిపడిన మనిషికి, మంచానికి ఉన్న రహస్య సంబంధం ఏమిటి ? అనే సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ.. చూస్తున్న ప్రతి మనిషిని థ్రిల్ కు గురి చేసేలా దర్శకుడు సస్పెన్స్ మిస్టరీని, కథను చాలా బాగా తీశాడు. చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులోని సాంగ్స్ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయి. సునీల్ కశ్యప్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. డ్యాన్స్ మాస్టర్ చంద్ర కిరణ్ కొరియోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఉద్దవ్ చాలా చక్కని ఎడిటింగ్ చేశాడు. డి.ఓ.పి సెల్వ కుమార్ ప్రతి ఫ్రెమ్ ను పెయింటింగ్ లా చాలా చక్కగా తీశారు. ఇలా సినిమా బెస్ట్ రావడానికి చాలా హానెస్ట్ గా అందరూ కలసి వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.ఇకపోతే చివరిగా ప్రొడ్యూసర్ ఎస్. గౌతమి గురించి చెప్పాలంటే.. మనం అనుకున్నదది తెర మీద కార్యరూపం దాల్చాలి అంటె ప్రొడ్యూసర్ ఉండాలి అలాంటిది ఇది తనకు మొదటి చిత్రమైనా చక్కటి కథను ఎంచుకుని ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకాంపై నిర్మించిన ఈ సినిమా బాగా రావాలని ప్రతి క్షణం తపనపడుతూ కథకు ప్రాధాన్యత నిచ్చారు.ఒక మంచం నుండి స్టార్ట్ అయిన మనం పుట్టుక చివరికి మన చావుతో ఒక మంచం పైనే ముగుస్తుంది.అనే కథ ను నమ్మిన నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. కులపిచ్చి ఎలా ఉంటుంది. దాని కోసం వారు ఎలాంటి దారుణానికి ఒడిగడతారు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇందులో అంతా కొత్తవారైనా డిఫరెంట్ కంటెంట్ తో కథా బలం ఉన్న సినిమా కాబట్టి చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. అలాగే సస్పెన్స్,థ్రిల్లర్ సినిమాల్ని, ఆదరించే ప్రేక్షకులకు కూడా “రహస్య” సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పగలను.

Cinemarangam.com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here