Swechha Movie Releasing on Feb 28th

ఆడపిల్ల పుడితే చాలు అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏంసాధించింది అనే కథాంశంతో
తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్‌ ను పోషించింది. అన్ని పనులనూ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న  ప్రేక్షకుల ముందుకు రానుంది.కెపీఎన్‌. చౌహన్‌ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్‌, లచ్చురాం ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆంగోత్‌ రాజునాయక్‌ దీన్ని నిర్మించారు.

నిర్మాత మాట్లాడుతూ.. తండా స్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర నేటి అమ్మాయికు ఎంతో ప్రేరణగా నిుస్తుంది. సెంటిమెంట్‌, వినోదం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందర్ని అరిస్తుందనే నమ్మకం వుంది. పాపికొండతో పాటు పు అందమైన లోకేషన్లలో చిత్రీకరణ చేశాం’ అని తెలిపారు. ‘ఒక మంచి పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా ఉందని’ భోలో షావలి తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడపిల్ల అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. ఆడప్లిను పురిటిలోనే చంపకుండా వారిని చదివించి, ప్రయోజకు చేస్తే ఏ రంగంలో వాళ్లు తీసిపోరనే అద్భుతమైన కథాంశమిది. మంగ్లీ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిుస్తుంది. హాస్య నటుడు చమ్మక్‌ చంద్ర ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడని తెలిపారు. ‘బంజారే బంజారే..’ పాటను సింగర్‌ మంగ్లీ అద్భుతంగా ఆపించినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here