T-Series & Dil Raju Productions’ ‘HIT – The First Case’ begins with a Mahurat Pooja

The much anticipated Hindi remake of HIT which stars Rajkummar Rao and Sanya Malhotra has begun the film’s journey with a mahurat pooja ceremony.
Present at this auspicious occasion were actor Rajkummar Rao, producers Dil Raju, Bhushan Kumar, Kuldeep Rathore, and director Dr. Sailesh Kolanu.
‘HIT – The First Case’ tells the story of a cop who is on the trail of a missing woman.
Produced by Bhushan Kumar, Dil Raju, Krishan Kumar, and Kuldeep Rathore, the film is directed by Dr. Sailesh Kolanu.
దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌, టీ సిరీస్ కల‌యిక‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ ‘హిట్ – ది ఫ‌స్ట్ కేస్‌’ 
తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన మిస్ట‌రీ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హిట్ – దిఫ‌స్ట్ కేస్‌’ సినిమా బాలీవుడ్ రీమేక్ ఆదివారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి  చేసుకుంది. తెలుగులో ‘హిట్‌’ సినిమాను డైరెక్ట్ చేసిన శైలేష్ కొల‌ను హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నారు.
 రాజ్‌కుమార్ రావ్‌, సాన్యా మ‌ల్హోత్రా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ కార్య‌క్రమంలో హీరో రాజ్ కుమార్ రావ్‌, నిర్మాతలు దిల్‌రాజు, భూష‌ణ్ కుమార్‌, కుల్దీప్ రాథోర్‌తో పాటు ద‌ర్శ‌కుడు డా.శైలేష్ కొల‌ను పాల్గొన్నారు.
న‌గరంలో క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిల‌ను వెతికే పోలీస్ టీమ్ హోమిసైడ్ ఇంట‌ర్వెన్‌ష‌న్ టీమ్‌లో ఆఫీస‌ర్ కేసును ఎలా సాల్వ్ చేశాడ‌నేదే ఈ సినిమా క‌థాంశం. మిస్ట‌రీ, స‌స్పెన్స్ అంశాల ఆక‌ట్టుకునే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ ఇది.  త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు.
న‌టీన‌టులు:
రాజ్ కుమార్ రావ్ , సాన్యా మ‌ల్హోత్ర త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  శైలేష్ కొల‌ను
నిర్మాణ సంస్థ‌లు:  టి సిరీస్‌, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాత‌లు:  దిల్‌రాజు, భూష‌ణ్ కుమార్‌, కుల్దీప్ రాథోర్‌
ద‌ర్శ‌క‌త్వం:  డా.శైలేష్ కొల‌ను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here