‘MASTER’ Movie Review

Release date :-January 13,2021
Cinemarangam.com:-Rating:3/5
Movie name:-”MASTER”..
Banner:-XB Film Creators.
Starring:-Vijay,Vijay Setupathi,Malavika Mohanan,Andrea Jeremiah,Arjun Das, Etc…
Music Director :-Anirud Ravi chandar.
Editor:-Philomin Raj.
Cinematography:-Satyan suryan.
Director :-Lokesh Kanakaraj.
Producer :-Xavier Britto.

తమిళ సూపర్ స్టార్ విజయ్‌కు ఉన్న క్రేజే వేరు. తమిళంలోనే కాకుండా విజయ్ తన సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.అతడి సినిమా అంటే అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తుంటారు.తాజాగా ఆయన నటించిన చిత్రం మాస్టర్‌. తమిళంలో ఈ చిత్రానికి పోటీ లేకున్నప్పటికి తెలుగులో మాత్రం సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న తెలుగు చిత్రాలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంపై భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాల్ని ‘మాస్టర్’ ఏమాత్రం అందుకున్నాడో చూద్దాం రండి..

కథ :

జేడీ (విజయ్)ఓ సైకాలజీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. ఆ కాలేజీ మేనేజ్మెంట్ అంతా జేడీకి వ్యతిరేకం.అయినా విద్యార్థుల్లో అతడికి మంచి పేరు ఉంటుంది. అయితే.. యాజమాన్యంలో కొందరు మాత్రం అతడికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. కాలేజీలో స్టూడెంట్ ఎలక్షన్లు జరిపించాలని జేడీ పట్టుబడతాడు. అందుకు కాలేజీ యాజమాన్యం కొన్ని షరతులతో అంగీకరిస్తుంది. ఎన్నికలు సజావుగా జరిగినా..? జేడీ కాలేజీ వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది..? జువైనల్ అబ్జర్వేషన్ హోంలో ఉపాధ్యాయుడిగా పని చేయాల్సి వస్తుంది. అక్కడ బాల నేరస్తుల్ని అడ్డుపెట్టుకుని భవాని(విజయ్ సేతుపతి) అరాచకాలు కొనసాగిస్తుంటాడు. మరీ భవాని ని జేడీ ఎలా ఎదుర్కొన్నాడు. జువైనల్ హోంను గాడిలో పెట్టాడా..? కాలేజీ నుంచి అతను ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది. మాళవిక మోహన్‌కు జేడీ ఉన్న సంబంధం వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

విజయ్ తన అభిమానుల్ని అలరించేలా నటించాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.లుక్స్.. పెర్ఫామెన్స్ స్టైలిష్ గా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు.. పాటల్లో విజయ్ అభిమానుల్ని అలరించడానికి ప్రయత్నించాడు. విజయ్ సేతుపతి కు పెర్ఫామెన్స్ పరంగా సినిమాలో అగ్ర తాంబూలం దక్కుతుంది.అతడి లుక్ పాత్రకు తగ్గట్లు చాలా సింపుల్ గా ఉంటూనే బలమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. హీరోయిన్ మాళవిక మోహన్ చాలా అందంగా కనిపించింది. ఉన్నంతలో ఫర్వాలేదు అని అనిపించింది. జువైనల్ హోంలో ఖైదీగా అర్జున్ దాస్ నటనకు కూడా మంచి మార్కులు పడతాయి.
హీరోయిన్ మాళవిక మోహన్  నటన పర్వాలేదు.ఇక మిగతా పాత్రల్లో నటించినవారంతా వారి వారి పరిధిల్లో బాగానే చేసారు

సాంకేతిక విభాగం :

ఈ చిత్రం ఆరంభం ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. రొటీన్‌గా హీరో పాత్ర ఇంట్రోతో సినిమాను మొదలుపెట్టకుండా.. విలన్ పాత్రను మంచి ఎలివేషన్ తో మొదలుపెట్టడం ఆకట్టుకుంటుంది. జువైనల్ హోంలోకి బాల నేరస్థుడిగా వచ్చిన విజయ్ సేతుపతి అక్కడి పరిస్థితుల నేపథ్యంలో కర్కశంగా తయారవడం, తర్వాత తనకు పైకి తెచ్చిన వాళ్లనే కబళించి పెద్ద గూండాగా ఎదగడం చాలా చక్కగా చూపించాడు. కాలేజీ సీన్లు కొంత వినోదాత్మకంగానే సాగినా కొత్తదనం ఏమీ కనిపించదు. కాలేజీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అనుకునేసరికి.. కథను మరోవైపుకి మళ్లించాడు దర్శకుడు. హీరో జువైనల్ హోంకు రావడం, అక్కడున్న గ్యాంగ్ అరాచకాలు, హీరోకు ఎదురయ్యే సవాళ్లు,  హీరోలో మార్పు తీసుకొచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది.చివర్లో హీరో, విలన్ మధ్య పతాక సన్నివేశాలు మాస్‌ను మెప్పిస్తాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంతటా విజువల్స్ ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ :

దర్శకుడు లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే..అతను తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఖైదీ’ సినిమాలో కథకు.. కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూనే హీరోయిజం ఎలివేట్ అయ్యేలా చూసుకున్న అతను.. ఈసారి మాత్రం కథ మీద అంత అంత శ్రద్ధ పెట్టకుండా ఎలివేషన్లకే పరిమితం అయ్యాడు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో కథ.. స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఫ్లాట్ గా అనిపిస్తాయి. విలన్ పాత్రను తీర్చిదిద్దే విషయంలో పెట్టిన శ్రద్ధ సినిమా అంతటా అతను చూపించి ఉంటే బాగుండేది.ఈ ఎపిసోడ్ ద్వితీయార్ధం మీద అంచనాలు పెంచుతుంది. కానీ ఆ తర్వాత రొటీన్ ఫార్మాట్లోకి వెళ్లిపోవడం నిరాశ కలిగిస్తుంది. కానీ.. అప్పటికే సినిమా మీద ఇంప్రెషన్ తగ్గిపోయిన సగటు ప్రేక్షకుడికి పతాక సన్నివేశం కూడా ఎలాంటి హైప్ ఇవ్వదు.నిర్మాణ విలువలు బాగున్నాయి…

                 Cinema Rangam.com  3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here