Tara Sri Creations ‘Amitabh Bachchan’ First Look, Trailer Released

తార శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సూర్య, రీతూ శ్రీ హీరోహీరోయిన్లుగా జె. మోహన్ కాంత్ దర్శకత్వంలో.. జె. చిన్నారి నిర్మించిన చిత్రం ‘అమితాబ్ బచ్చన్’. అక్కల శ్రీనివాస్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త సుదర్శన్ రెడ్డి, సతీష్ రెడ్డి, కందల శివకుమార్, మణి వంటివారు పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్‌ని సతీష్ రెడ్డి విడుదల చేయగా.. ట్రైలర్‌ని సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు జె. మోహన్ కాంత్ మాట్లాడుతూ.. 2004 లో ఇండష్ట్రీకు వచ్చాను. చక్కని కథను తయారు చేసుకొని తీసిన సినిమానే. ‘‘అమితా బచ్చన్”..ఈ పేరంటేనే ఓక సంచలనం. ఈ పేరొక ప్రభంజనం. అయితే ఇది ఆయన బయోపిక్ మాత్రం కాదు. ఓ మంచి ప్రేమకథ. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అమితాబచ్చన్ గారి ఇమేజ్ ను తక్కువ చేయకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఎందుకంటే మంచి కథతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే సహ నిర్మాతగా వ్యవహరించిన అక్కాల శ్రీనివాస్ గారు  ఫైనాన్షియల్ గా నాకు  ఫుల్ సపోర్ట్ ఇస్తూ పుషప్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చి మా టీమ్‌ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలను కుంటున్నాం.ఇటీవల బాలీవుడ్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి మా టీమ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ధైర్యంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు..త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా అమితాబచ్చన్ సినిమాను అందరూ ఆదరించాలని అన్నారు.

కందల శివకుమార్, కందల బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. చిత్తూరు లోని తలకొన మాది చిన్నప్పటి నుండి సినిమాలు చూసి పెరిగాము. అటువంటిది మోహన్  అంచెల అంచెలుగా ఎదుగుతూ ఈ రోజు సినిమా నిర్మాణ రంగం లోకి ఎంటరై న మోహన్ కు మా అందరి సపోర్ట్ తో పాటు ఇండస్ట్రీలోని అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ..”అమితాబచ్చన్” ట్రైలర్ టెక్నికల్ గా ఫైట్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మోహన్ నాకు 20 సంవత్సరాలుగా పరిచయం తనకు ఎంతో టెక్నికల్ నాలెడ్జ్ ఉంది.అమితాబచ్చన్ టైటిల్ పెట్టడంలోనే మోహన్ సక్సెస్ అయ్యాడు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

సహ నిర్మాత అక్కల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మోహన్ గారి హార్డ్ వర్క్ నచ్చి ఈ సినిమా తీశాము.నిర్మాతలకు తగ్గ దర్శకుడు మోహన్.నిర్మాతలకు మనీ వేస్టేజ్ కాకుండా చాలా చక్కగా తీస్తాడు..త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ కిరణ్ దాసరి మాట్లాడుతూ..ఈ సినిమా ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ చిత్రం కచ్చితంగా కనెక్ట్ ఆవుతుంది అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆశ్రీత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చాయి.ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు

హీరో సూర్య మాట్లాడుతూ.. పెద్ద హీరోలు చెయ్యాల్సిన స్క్రిప్ట్ లో నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి ఫైట్స్, సాంగ్స్ ఉన్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


హీరోయిన్ రీతూశ్రీ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు
సూర్య, రీతూ శ్రీ , చిల్లర వేణు, ఉన్ని కృష్ణ తదితరులు

సాంకేతిక నిపుణులు:
లిరిక్స్: రామ్‌కుమార్ ASK,
ఫైట్స్: స్టార్ మల్లీ-జీవన్ కుమార్
పబ్లిసిటీ డిజైనర్: ప్రభు. ఎమ్,
విఎఫ్ఎక్స్: RGB స్టూడియోస్,
సంగీతం: ఆశ్రీత్ అయ్యంగార్,
సినిమాటోగ్రఫీ: కిరణ్ దాసరి,
ఎడిటర్: మహేంద్రనాధ్. బి,
పీఆర్వో: బి. వీరబాబు,
సహనిర్మాత: ఆకుల శ్రీనివాస్ రాజు,
నిర్మాత: జె. చిన్నారి,
కథ-దర్శకత్వం: జమ్మల మడుగు మోహన్ కాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here