‘Telangana Devudu’ Movie Super: Home Minister Mahmoud Ali

వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో ఫ్రెండ్లీ స్టార్‌‌గా శ్రీకాంత్‌.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో వేశారు.

షో అనంతరం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘ఇవాళ తెలంగాణ దేవుడు సినిమా చూశాను. చాలా బాగుంది. సినిమాలు మంచి మంచి పాత్రలున్నాయ్.. అందరి నటనా నాకు బాగా నచ్చింది. తెలంగాణ ఉద్యమం గురించి చాలా బాగా చూపించారు. ఉద్యమం సమయంలో ఎవరెవరు ఎలా కష్టపడ్డారనే విషయాలను చాలా చక్కగా చూపించారు. ఉద్యమ సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. సినిమాను తెరకెక్కించిన, నిర్మించిన అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు’ అని తెలిపారు. కాగా.. 1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవితాన్ని చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మూల కథ, నిర్మాత: మహ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్
మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మహ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌
పీఆర్వో: బి.ఎస్‌. వీరబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here