Telangana IT Minister Shri KTR Appreciates Pressure Cooker team ‬

సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. ‘ప్రతి ఇంట్ల ఇదే లొల్లి’ అనేది ఉప శీర్షిక. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి (‘జార్జిరెడ్డి’ ఫేమ్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకులు.  ఫిబ్రవరి 21న సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ ఐటీ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి  కెటిఆర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ..

తెలంగాణ ఐటీ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి  కెటిఆర్ మాట్లాడుతూ – సుజయ్ నాకు 15 ఏళ్లుగా పరిచయం. స్టీరియో టైప్ కాకుండా ఒక రకమైన రాడికలిజం అతనిలో ఉండేది. అప్పట్లో అతనొక  బ్లాగ్ రాసేవాడు అది చదివి అతనికి మరింత దగ్గరయ్యాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బెంగుళూర్ లో ఉద్యోగం చేస్తున్న తనని నేనే ఇక్కడికి రమ్మన్నాను. ఇద్దరం కలిసి పనిచేశాం. దాంతో మా స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. అతని రచనలు, ఆలోచనలు వైవిధ్యంగా ఉంటాయి. సుజయ్, సుశీల్ వారి పిల్లల పేర్లు కూడా కవితాత్మకంగా ఉండేలా పెట్టారు. గతంలో తన ఫొటోగ్రాఫ్ తో , పెయింటింగ్స్ తో నన్ను ఆశ్చర్యపరిచిన సుజయ్..తాజాగా తన తమ్ముడితో కలిసి  సినిమా తీశాను అని చెప్పి నన్ను మరింత సర్ప్రైజ్ చేశాడు.
ఇక సినిమా విషయానికి వస్తే మంచి వినోదం తో పాటు సందేశం ఉన్న సినిమా. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది. పరిమిత వనరులతో సుజొయ్, సుశీల్ చక్కగా తెరకెక్కించారు. సాయి రొనక్ , ప్రీతి బాగా నటించారు. డాలర్ డ్రీమ్స్, అమెరికా కోసం పరిగెత్తడం, ఇక్కడున్న తల్లి తండ్రులు ఓ వైపు గర్వంగా ఉన్నా మరోవైపు పైకి చెప్పుకోలేక బాధ పడడం లాంటి అంశాలను సహజత్వానికి దగ్గరగా చూపించారు. సంగీతం కూడా ఆకట్టుకుంది. సుజయ్ మరో ఏడు ఎనిమిది టైటిల్స్ కూడా రిజిస్టర్ చేశాడు అని తెలిసింది. అతడు మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించాలని ఆశిస్తున్నాను. అలాగే సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను ” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here