Telnagana Govt sponsored Short Film Contest Press Meet

మద్యం, ధూమపానం అవి సేవించేవారికి మాత్రమే హాని చేస్తాయి. కానీ ప్లాస్టిక్ మాత్రం యావత్ మానవాళి పాలిట పెను శాపంగా మారింది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేసీయార్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా..  కుంభమేళా తరువాత అంత భారీగా జరిగే ‘మేడారం జాతర’ను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు లఘు చిత్రాల పోటీని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రముఖ దర్శకులు వీరశంకర్ అధ్యక్షులుగా ఏర్పాటయిన కమిటీలో పలువురు చిత్ర ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వీరశంకర్, సభ్యులు, ప్రముఖ దర్శకులు శివ నాగేశ్వరావు, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డి.సత్యనారాయణలతోపాటు.. ఇన్నొవేటి యాడ్స్ సి.యి.ఓ నగేష్ కోడూర్ పాల్గొన్నారు. 3 నుంచి 5 నిమిషాల నిడివితో ప్లాస్టిక్ వల్ల ప్రపంచానికి జరుగుతున్న అనర్ధం తెలిపేలా లఘు చిత్రాలు ఉండాలని, ఇవి తెలుగులో మాత్రమే తీయాలని,  జనవరి 10 వరకు దీనికి గడువని వారు తెలిపారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 75, 50, 25 వేలు అందిస్తామని, కన్సోలేషన్ బహుమతులుగా ప్రశంసాపత్రంతోపాటు జ్ఞాపిక అందిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.innovativeads.co.in సంప్రదించాలని కోరారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here