Telugu Actor Venkata Sai Gunda Gears Up For Hollywood Debut!

In an unprecedented move, Telugu actor Venkat Sai Gunda takes a triumphant leap into HOLLYWOOD with the highly anticipated feature film, “The Deserving”. This monumental project, a riveting psychological thriller, stands as a beacon of global collaboration and artistic fusion, setting a new benchmark in the film industry.

Venkat Sai Gunda, not just an actor but also as a producer brings an electrifying performance to the silver screen, embodying a historic representation of Telugu talent in Hollywood. This groundbreaking initiative also marks the first Hollywood venture predominantly produced by Telugu individuals, creating ripples of excitement and anticipation across the globe.

Cast and crew from various parts of the world have joined hands to Amplify the film’s international allure. Under the meticulous direction of S.S Arora, a CANNES FILM FESTIVAL recognized filmmaker, the movie unfolds with a gripping narrative and visually stunning cinematography by Koshi Kiyokawa, a maestro with accolades from renowned platforms including SXSW Film Festival.

The musical landscape of “The Deserving” is sculpted by an award-winning composer, who has carved a niche in the industry with commendable achievements including collaborations with the famed Hollywood composer, Steve Jablonsky, known for his work in the Hollywood Movie Series *TRANSFORMERS*

Cast: Venkat Sai Gunda, Simone Stadler, Kelsey Startler and others
Written & Directed by: S.S Arora
Production House: KATHA Productions
Producer: Venkat Sai Gunda, Vismay Kumar, Thirumalesh Gundrath
Music: Nga Weng Chio
Cinematography: Koshi Kiyokawa
PRO – Harish Dinesh

టాలీవుడ్ ప్రతిభతో తొలి హాలివుడ్ మూవీ “ది డిజర్వింగ్”


ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆధ్యాంతం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే సంచలనాత్మకమైన “ది డిజర్వింగ్” అనే చిత్రాన్ని తెలుగు హీరో వెంకట్ సాయి గుండ హాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నా ఈ సంచలనాత్మకమైన ప్రాజెక్ట్, సినిమా చరిత్రలో ఒక బెంచ్ మార్కును సెట్ చేయడానికి సిద్ధమౌతుంది. నటుడు వెంకట్ సాయి గుండ కేవలం ఈ సినిమాలో హీరోగానే కాదు నిర్మాతగా వ్యవహరిస్తూ హాలీవుడ్ లో తెలుగు ప్రతిభకు పట్టం కడుతున్న దార్శనీకుడు. ప్రపంచ మేధావుల కలయికతో వెండి తెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడానికి వెంకట్ సాయి గుండ శ్రీకారం చుట్టారు. ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసేలా ఈ చిత్రాన్ని తీర్చబోతున్న ఘనత వెంకట్ సాయి గుండకు చెందుతుంది. హాలీవుడ్ లో ప్రధానపాత్రదారుడిగా ఒక తెలుగు వాడు నటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

పాన్ వరల్డ్ చిత్రంగా తిరకెక్కుతున్న “ది డిజర్వింగ్” చిత్రంలో ప్రపంచ నలుమూలల నుండి ప్రఖ్యాతగాంచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయడం గమనార్హం. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా ప్రతిభవంతుడిగా గుర్తింపుని పొందిన ఎస్ ఎస్ అరోరా ఈ చిత్రానికి రచన దర్శకత్వం వహించారు. అలాగే ఎస్ ఎక్స్ ఎస్ డబ్ల్యూ ఫిలిం ఫెస్టివల్ తో సహా ప్రఖ్యాత అనేక ప్లాట్ ఫామ్స్ ల నుండి ప్రశంసలు పొందిన కోషి కియోకావా ఈ చిత్రానికి గ్రిప్పింగ్ కథనంతో పాటు సినిమాటోగ్రఫీ అందించారు. హాలివుడ్ లో ప్రఖ్యాత సిరీస్ ట్రాన్స్ఫార్మర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ స్టీవ్ జబ్లోన్స్కీ దగ్గర పని చేసి ఎన్నో అంతార్జాతీయ అవార్డులను కైవస్ చేసుకున్న ప్రసిద్ధ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ Nga Weng Chio(Nga వెంగ్ చియో)
“ది డిజర్వింగ్” చిత్రానికి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు.

చిత్ర పరిశ్రమ పైన ప్యాషన్ తో హీరో వెంకట్ సాయి గుండ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మించడం ఒక చరిత్రాత్మకమైన పరిణామం. దీంతో టాలీవుడ్ హాలీవుడ్ కి మధ్య గొప్ప వారధిగా “ది డిజర్వింగ్” చిత్రం నిలవబోతుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్ర దర్శక నిర్మాతలు “ది డిజర్వింగ్” తీర్చిదిద్దారు. ఎప్పుడు కొత్తదనాన్ని ప్రత్సహించే వెంకట్ సాయి గుండ ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని అత్యంత గొప్ప నిర్మాణ విలువలు అందించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది అని నిర్మాత నమ్మకంగా ఉన్నారు.

నటీనటులు: వెంకట్ సాయి గుండ, సిమోన్ స్టాడ్లర్, కెల్సీ స్టార్ట్లర్, తదితరులు
రచన & దర్శకత్వం: S.S అరోరా
ప్రొడక్షన్ హౌస్: కథా ప్రొడక్షన్స్
నిర్మాతలు: వెంకట్ సాయి గుండ, విస్మయ్ కుమార్, తిరుమలేష్ గుండ్రాత్
సంగీతం: Nga వెంగ్ చియో(Nga Weng Chio)
సినిమాటోగ్రఫీ: కోషి కియోకావా
పీఆర్ఓ: హరిష్, దినేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here