Telugu Cine Workers Co-operative Housing Society Announcement

తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పైన సెక్షన్ 51 ఎంక్వైరీ వేయడం జరిగింది.

సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వయిరీ రిపోర్ట్ తేది 03.08.2021న సొసైటీ కమిటీకి అందజేయడం జరిగింది. సెక్షన్ 51 ఎంక్వయిరీ ప్రకారం రిపోర్ట్ 30 రోజులలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యులకు తెలియజేయాలి. కావున ఈ నెల 29.08.2021న జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం.

సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన ఫైండింగ్స్ పై సెక్షన్ 60 ఎంక్వయిరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చినది ప్రాథమిక నివేదిక మాత్రమే. ఈ విషయమై చర్చించడానికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టడమైనది.

సెక్షన్ 60 ప్రకారం పూర్తి స్థాయి నివేదిక అందిన తరువాత నిజమైన అన్ని విషయాలు తెలుస్తాయి. దయచేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి తెలియజేయునది ఏమనగా పూర్తి ఎంక్వయిరీ రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూడమని కోరుతున్నాం.

జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత మేము అన్ని విషయాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తాము. దీంతో ఆయా విషయాలపై స్పష్టత వస్తుంది. కాబట్టి 1600 కుటుంబాల ఆవేదన అర్థం చేసుకుని ప్రాజెక్ట్ కు ఇబ్బంది కలగకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకరించగలరని మనవి

ధన్యవాదములతో
అనిల్ కుమార్ వల్లభనేని
అధ్యక్షులు, చిత్రపురి*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here