Telugu Film Producers Council a press note

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిలు ఒక ప్రెస్ నోటును 05.12.2020 న విడుదల చేసింది. VPF చార్జీలు, థియేటర్లు నిర్వహణ చార్జీలు, చిన్న మరియు మంచి సినిమాలకు షోలు, టిక్కెట్ల అమ్మకాల మీద వచ్చే ఆదాయం మీద నిర్మాతలకు పర్ సెంటెజ్, వంటి సమస్యలపై నిర్మాతలు రెండు తెలుగు రాష్టాల్లో ఎదుర్కొంటున్న ఇతర సమస్యల విషయమై తక్షణ చర్య కోసం కౌన్సిలు ఈ ప్రెస్ నోట్ కాపీని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు పంపింది. అలాగే, VPF (వర్చువల్ ప్రింట్ ఫీజు) ఛార్జీలు నిర్మాతల నుండి ఎగ్జిబిటర్లు వసూలు చేస్తున్నారు. ఈ విషమై తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు 17.10.2020న కౌన్సిలు లేఖను పంపింది.

5.12.2020న ప్రెస్ నోట్ యొక్క అనుసరణగా మరియు మేము ఇచ్చిన లేఖను అనుసరించి, నిన్న (14.12.2020) ఫిలిం నగరులోని ఛాంబర్ హాల్‌లో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ తో జరిపిన మీటింగులో, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు, పంపిణీదారులు మరియు ప్రదర్శనకారులు హాజరు అయ్యారు.

మల్టీప్లెక్స్‌లు మరియు ఇతర థియేటర్లను పునఃప్రారంభించే అంశంతో ఈ మీటింగులో, ఈ క్రింది విషయాలు చర్చించబడినది. :-
1. నిర్మాతలు వీపీఎఫ్ ఛార్జీలు చెల్లించరు.
2. కంటెంట్ ట్రాన్స్‌పోర్ట్ కోసం నిర్మాతలు నామమాత్రపు ఛార్జీలు చెల్లిస్తారు.
3. డిజిటల్ ప్రొవైడర్లు తమ రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల ప్రొజెక్టర్లను థియేటర్‌ ఓనర్స్ కొనుగోలు చేయడానికి డిజిటల్ ప్రొవైడర్లు ఒక ఆప్షన్ ఇస్తారు. దీని మూలంగా ప్రకటనల ఆదాయాన్ని స్వీకరించడానికి థియేటర్‌ ఓనర్స్ కు వీలు కల్గుతుంది.
4. థియేటర్ యజమానులు ప్రొజెక్టర్లను కొనుగోలు చేయలేకపోతే, నిర్మాతలు కొంతవరకు కల్పించుకొని వారి ప్రొజెక్టర్లను కొనుగోలు చేయడానికి సహాయం చేస్తారు.
5. పైన ఉదహరించిన 1, 2 మరియు 3 విషయాలు డిజిటల్ ప్రొవైడర్లు అంగీకరించకపోతే, థియేటర్ యజమానులు వారి సొంత ప్రొజెక్టర్లుతో నడిపిస్తారు.
మరియు, పై సమస్యలపై 2020 డిసెంబర్ 17 న సాయంత్రం 4.00 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

గౌరవ కార్యదర్శులు శ్రీ టి. ప్రసన్న కుమార్ మరియు శ్రీ మోహన్ వడ్లపట్ల….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here