Thank you to the audience for making ‘Akhanda’ a huge success..` Producer Miryala Ravinder Reddy

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్‌ జంటగా స్టార్‌డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్‌ మూవీ ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్‌రెడ్డి నిర్మించారు. డిసెంబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అటు బాలయ్య కెరీర్‌లోను, ఇటు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి కెరీర్స్‌లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అద్భుతమైన కలెక్షన్స్‌ సాధిస్తూ దూసుకుపోతోంది.* ‘ *అఖండ’మైన విజయాన్ని స్వంతం చేసుకుని, కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తున్న సందర్భంగా నిర్మాత రవీందర్‌రెడ్డి పాత్రికేయులతో ముచ్చటించారు.

‘‘ముందుగా ‘అఖండ’మైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 2018లో బోయపాటి గారు కథ చెప్పినప్పుడే ఎంత బిజినెస్‌ చేస్తుందో నేను చెప్పాను. ఈ కథ విన్నప్పుడే ఫస్ట్‌ 4 రోజుల్లో మా బయ్యర్సు అందరూ రికవర్‌ అయిపోతారు అని డిసైడ్‌ అయ్యాను. సినిమాకు అంత హైప్‌ ఉంది సబ్జెక్ట్‌లో. నా అంచనాలు మించి దూసుకుపోతోంది. ఆల్రెడీ బాలయ్య, బోయపాటి రెండు సూపర్‌ డూపర్‌ హిట్‌లు ఇచ్చి ఉండటం వల్ల మా మీద ప్రెజర్‌ బాగా ఉంటుందని నాకు తెలుసు. సినిమా మొత్తం నేను ఎక్స్‌పెక్ట్‌ చేశాను. ఏ సీన్‌లో ప్రజలు కనెక్ట్‌ అవుతారు అనే విషయం కూడా గెస్‌ చేశాం. అఘోరా క్యారెక్టర్‌ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకు వెళ్లింది. ఈ ట్రెండ్‌ సెట్టర్‌ రేంజ్‌ ముందే ఊహించాం. ఓవర్‌ సీస్‌లో కూడా ఇంత రెస్పాన్స్‌ రావటానికి సినిమాను అందరూ ఓన్‌ చేసుకోవటమే కారణం. మా బ్యానర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ ఇది.

సినిమా పట్ల ముందు నుంచే నాకు కాన్ఫిడెన్స్‌ వచ్చింది. సినిమాలో అన్ని ఎమోషన్స్‌ ఉండటం బాగా ప్లస్‌ అయింది. లాస్ట్‌డే షూటింగ్‌ రోజున మంచి ఎఫర్ట్స్‌ పెట్టారు అని బాలయ్య నన్ను మెచ్చుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. బోయపాటి ఏదైతే చెప్పారో దానికి 100 శాతం ఎక్కువ అవుట్‌పుట్‌ ఇచ్చారు. ‘అఖండ’కు సీక్వెల్‌ ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. ఉంటే బాగుంటుందని నేను కూడా భావిస్తున్నా. హిందీలో రీమేక్‌ రైట్స్‌ కోసం అడుగు తున్నారు. ఇంకా ఫైనల్‌ కాలేదు. పరిశ్రమలోని అందరు హీరోలతోనూ, టెక్నీషియన్స్‌తోనూ చేయాలని నాకూ ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బెనిఫిట్‌షోలు లేకపోవటం, టిక్కెట్‌ రేట్లు తక్కువగా ఉండటం కలెక్షన్‌ల మీద కొంత ఎఫెక్ట్‌ చూపించిన మాట వాస్తవమే. కానీ ప్రభుత్వ నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు కదా. ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా కావచ్చు. కానీ కరోనాతో చితికి పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున టిక్కెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం కొద్ది రోజులు ఆగితే బాగుండేది అని నా వ్యక్తిగత అభిప్రాయం. మార్చిలో మా బ్యానర్‌లో కొత్త సినిమా స్టార్ట్‌ అవుతుంది. ఏది ఏమైనా మా ‘అఖండ’కు ఆకాశమంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here