‘The Deal’ Movie Poster launched by Retired IAS Dr KV Ramanachari

డాక్టర్ అనితారవు సమర్పణలో  డిజిక్వెస్ట్, సిటిడెల్ క్రియేషన్స్ బ్యానర్ పై  పద్మారమాకాంతరావు, కొల్వి రామకృష్ణ లు నిర్మించిన చిత్రం ”ది డీల్”. *రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా సినిమా రంగానికి పరిచయమైన హను కోట్ల ఆ తర్వాత ఆర్ జే గా, నటునిగా, నాటక రచయితగా, ఆధునిక నాటక దర్శకుడిగా ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఆయన తాజాగా ”ది డీల్” సినిమాతో హీరోగా, దర్శకునిగా మన ముందుకు వస్తున్నారు.ఈ సినిమా పోస్టర్ ను హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో ఆవిష్కరించారు.ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల ది డీల్ సినిమాతో మన ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ రంగంలో అడుగు పెడుతున్న దర్శకుడు హను కోట్లకు అభినందనలు తెలిపారు.

సినిమా కథానాయకుడు, దర్శకుడు హను కోట్ల మాట్లాడుతూ.. రంగస్థలం నుండి సినిమా వైపు అడుగులు వేస్తున్నాను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. ఒక డిఫరంట్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నానన్నారు.

డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ MD కె.బాసి రెడ్డి మాట్లాడుతూ.. డీల్ సినిమా చూశాను చాలా బాగా వచ్చిందని, పెద్ద స్టార్స్ లేని సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

TFPC అధ్యక్షుడు K.L.దామోదర్ ప్రసాద్ మాట్లాడతూ.. కంటెంట్ ఏ కింగ్ లాంటిదని అన్నారు.

ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ.. క్రియేటివిటీ తో వచ్చిన సినిమాలు నిలబడతాయని అన్నారు. డీల్ సినిమా జనాదరణ పొందాలని కోరుతున్నానన్నారు

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్, నిర్మాత రామకృష్ణ కొల్వి లతో పాటు సినిమా యూనిట్ పాల్గొన్నారు.

డి. ఓ. పి సురేంద్ర రెడ్డి
సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్:
ఎడిటింగ్; శ్రవణ్ కటికనేని,
వి. ఎఫ్. ఎక్స్:నవీన్
డి. ఐ: వినోద్ సాయి కుమార్
కొరియోగ్రఫీ: అనితారావు,
అసిస్టెంట్ డైరెక్టర్
వినయ్ కుమార్ కాటం అదితి నాగ్.
అసోసియేట్ డైరెక్టర్: అరుణ్ కిరంజీవి
కో డైరెక్టర్ శ్రీధర్ దీక్షిత్
పీఆర్వో ; కృష్ణప్రసాద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here