The opportunity for megastar Chiranjeevi Song gave a great feeling: Sri Siddi Mahesh

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రముఖ సంగీత దర్శకులు , గేయ రచయిత చరణ్ అర్జున్ ” జై చిరంజీవ …… జై జై చిరంజీవా ”అనే ఓ పాటని అందించాడు. ఆ పాటకు శ్రీ సిద్ది మహేష్ దర్శకత్వం వహించగా బీవీఎమ్ శివ శంకర్ నిర్మించడం విశేషం. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో మెగా అభిమానుల అండదండలతో అదరగొడుతోంది. మెగా అభిమానులను ” జై చిరంజీవ ” పాట విశేషంగా అలరిస్తుండటంతో సంతోషంగా ఉన్నారు ఈ పాటని రూపొందించిన సభ్యులు. వెలకట్టలేని సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ ” జై చిరంజీవ ” పాట రూపొందించడం విశేషం. ఈ పాటని ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూనిట్ సభ్యులను అభినందించారు. అలాగే ప్రముఖ దర్శకుడు సంపత్ నందితో పాటుగా గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఈ పాటను రూపొందించిన యూనిట్ సబ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. ఇక మెగా అభిమానులైతే ఈ పాటతో పరవశించి పోతున్నారు. ఈపాటకు రూపకల్పన చేసిన చరణ్ అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మెగాస్టార్ పై ఇంతటి అభిమానాన్ని కురిపిస్తున్న చరణ్ అర్జున్ ని మెగాస్టార్ చిరంజీవి అభినందిస్తే చూడాలని ఆశ పడుతున్నారు. మెగాస్టార్ వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉన్న ఇంత గొప్ప పాటకు దర్శకత్వం వహించే అవకాశాన్ని నాకు అందించిన చరణ్ కు, నిర్మాత శివశంకర్ కు నా కృతఙ్ఞతలు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు దర్శకుడు శ్రీ సిద్ది మహేష్.

తెలుగుతెరపై తిరుగులేని స్టార్ గా వెలుగొందుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది ఆపద ఉన్న చోట ఆపద్భాంధవుడిగా మారుతున్నాడు. తన సేవా కార్యక్రమాలతో మెగా అభిమానుల మనసు దోచుకోవడమే కాకుండా తెలుగు ప్రజల గుండెల్లో రియల్ హీరోగా నిలిచారు. ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ లతో రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్నాడు. కంటి చూపు కోల్పోయిన వాళ్లకు చూపుని అందించాడు, అలాగే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకు లక్షలాది ప్రాణాలను నిలబెట్టాడు కూడా. ఇక ఇప్పుడేమో ఆక్సిజన్ బ్యాంక్ లను కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నాడు చిరు. కరోనా కష్టకాలంలో 14 వేల మంది సినీ కార్మికులకు పని లేకపోవడంతో ” కరోనా క్రైసిస్ చారిటీ ” అనే సంస్థని నెలకొల్పి సినిమా రంగంలోని పలువురు హీరోలను , హీరోయిన్ లను అందులో భాగస్వాములను చేసి సినీ కార్మికులకు నాలుగు నెలల పాటు నిత్యావసరాలు అందించాడు. అంతేకాదు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పలువురు నటీనటులను ఆర్ధికంగా ఆదుకున్నాడు చిరంజీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here