This is a panel born of insults’.. Prakash Raj

తెలుగు సిని పరిశ్రమలో ఎప్పుడూ లేని విదంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు  రసవత్తర పోటీ నెలకొంది. ఇప్పటికే అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్టు నటుడు ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు, నటిమణులు జీవిత రాజశేఖర్,హేమ ప్రకటించారు. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు చతుర్ముఖ పోటీ నెలకొంది.ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ పై  మీడియాలో వస్తున్న కథనాల గురించి ప్రజలందరికీ తెలియజేయాలని ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో శుక్రవారం యఫ్.యన్.సి.సి లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు

ఇది అవమానాలతో పుట్టిన ప్యానెల్’ |
MAA’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. మీడియా ని చూస్తే భయం వేస్తోంది.మీడియా చేసే హడావుడి వల్ల ఇక్కడి నేతలే కాదు బిడెన్ కూడా వస్తాడేమో అని భయం వేసింది.ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు.ఆరు నెలల గా ఈ కార్యక్రమం నడుస్తోంది..మన ప్యానెల్ లో ఎవరు ఉండాలి ఎలాంటి వారు ఉండాలి అని చూసాం.ఇవి ఎన్నికల్లాగా కాకుండా అందరి సంక్షేమం కొసం చేస్తుంది.మనం చిత్తశుద్ధి గా ఉంటామా లేదా అనేది ముఖ్యం.ఇది మా ఆవేదన.గొడవలు లేకుండా సూక్ష్మంగా సమస్య ను పరిష్కరించుకోవాలి.నా ప్యానెల్ లో నలుగురు MAA మాజీ అధ్యక్షులు ఉన్నారు.తరువాత నేను తప్పు చేసినా బయటికి పంపిస్తారు.అలాంటి వ్యక్తులు ఉన్నారు మా టీమ్ లో.. ఇందులో లోకల్ నాన్ లోకల్ సమస్య సృష్టిస్తున్నారు.గత ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.ఇప్పుడే ఎందుకు?తెలుగు అనేది గౌరవం అనేక మంది ఇతర భాషల్లో రాణిస్తున్నారు.త్వరలో జరగబోయే ఎన్నికలను పురస్కరించుకుని మా శ్రేయస్సు దృష్ట్యా ఆత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్ట కోసం మన నటీనటుల బాగోగుల కోసం దీంతో రాబోతున్న ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాము. పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం ఈ ఎన్నికల్లో బరిలో దిగుతుతున్నాం .మాది కోర్ ప్యానెల్ కాదు.. ఆవేదన తో పుట్టిన ప్యానెల్” అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.

బండ్ల గణేశ్ మాట్లాడుతూ…”నా స్థలంలో 10 ఎకరాలు ప్రకాష్ రాజ్ అన్నకు ఇచ్చాను.ఎంతో మందికి పని కల్పించారు.ప్రకాష్ రాజ్ కి అవకాశం ఇస్తే అసోసియేషన్ బాగుంటుంది.లోకల్ నాన్ లోకల్ అనే సమస్య ఇక్కడ లేదు.23 ఏళ్ళు ఆయన ఇక్కడ స్థిరపడి.మా ఊళ్ళో ఏందో మందికి పని ఇచ్చారు.ప్రకాష్ రాజ్ అంటే మా ఊళ్ళో తెలియని వారు ఉండరు” అని  చెప్పారు.

నటుడు నాగబాబు మాట్లాడుతూ…“ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మా అన్నయ్య చిరంజీవి మద్దతు తెలిపారు.రెండు నెలల కింద ప్రకాష్ మమ్మల్ని కలిసాడు..ఇందులో ఉన్న సమస్యలు చెప్పాడు.బిల్డింగ్ లేదు.MAA అంటే ఒక కుటుంబం అని చెప్పాడు.ప్రతి ఒక్కరితో మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి.మూడు నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి వారికి పని కల్పించాడు.ప్రకాష్ రాజ్ చాలా మంచి వ్యక్తి, గత నాలుగు సంవత్సరాలనుండి మసకబారిన మా అసోసియేషన్  ప్రతిష్ట  పెరగాలని, ప్రకాష్ రాజ్  ఎవరితోనైనా సరే వారి భాషలో మాట్లాడగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఎవరితో అయినా సరే ఏ పని అయినా సరే చేయించుకో గలిగిన వ్యక్తి అంతే కాదు చాలా మందికి ఇళ్లు కట్టించారు చాలా మందికి ఇటువంటి వ్యక్తి ఉంటే ప్రతి ఒక్కరూ ఆయనను సంప్రదించవచ్చు. మా అసోసియేషన్ మాది అనే భావన కలుగుతుంది. ఇలాంటి వ్యక్తి మా అసోసియేషన్ లో ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. లోకల్ నాన్ లోకల్ అంటూ వాదిస్తున్నారు అలా వాదించడం అర్ధరహితం ఎందుకంటే మా అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి అధ్యక్ష పదవి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా పోటీ చేసే అవకాశం ఉంటుంది. మనం తెలుగు యాక్టర్ కాదు.ఇండియన్ యాక్టర్స్.పెద్దోళ్లకే లేని లోకల్ సమస్య ఒక కుటుంబం లాగా ఉండే వారికి ఎందుకు. “ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి మా అసోసియేషన్ లో ఉంటే బాగుంటుంది మేము  మద్దతు తెలుపుతున్నాం” అని  అన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ తన 27 మంది ప్యానల్ సభ్యుల వివరాలు. 

1.ప్రకాష్ రాజ్,2.జయసుధ, 3.శ్రీకాంత్ ,4.బెనర్జీ, 5.సాయి కుమార్, 6.తనీష్, 7.ప్రగతి, 8.అనసూయ, 9.సన, 10.అనితా చౌదరి, 11.సుధా, 12.అజయ్, 13.నాగినీడు, 14.బ్రహ్మాజీ, 15.రవి ప్రకాష్, 16.సమీర్, 17.ఉత్తేజ్, 18.బండ్లగణేష్ ,19.ఏడిద శ్రీరామ్, 20.శివారెడ్డి, 21.భూపాల్, 22.రాజాం, 23.సురేష్ కొండేటి, 24.ఖయ్యుం, 25.సుడిగాలి సుదీర్, 26.గోవిందరావు, 27.శ్రీధర్ రావు, ఈ ప్యానెల్లో వున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here