Tollywood First One ShotFilm ‘Maro Prasthanam’ trailer launch

యువ కథానాయకుడు తనీష్‌ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మరో ప్రస్థానం. ఇందులో ముస్కాన్ సేథీ కథానాయిక. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందిన మొట్ట మొదటి తెలుగు సినిమా ‘మరో ప్రస్థానం’ కావడం విశేషం.  ఈ నెల 24న ” మరో ప్రస్థానం” చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ఉదయ్ కిరణ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా  చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ …ఈ మరో ప్రస్థానం సినిమా మహాప్రస్థానం కి మంచి ఉంటుంది.ప్రతి ఒక్కరు ఈ సినిమాకు మనసుపెట్టి కష్టపడి పని చేశారు. ఇలాంటి సినిమాలు రియల్ గా చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ నెల 24 న విడుదల చేస్తున్న  మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని అన్నారు.

చిత్ర దర్శకుడు జానీ మాట్లాడుతూ.. నేను మొదట అంతకు మించి సినిమా తీశాను.ఆ తర్వాత  నుంచి కథతో సింగిల్ షాట్లో  కమర్షియల్ సినిమా తీసి అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా చేయలనుకుని ఈ కథను రాసుకొన్నాను. అయితే చిత్ర నిర్మాతలు నా మీద నమ్మకంతో నాకు లైఫ్ ఇవ్వాలని  నా కథను ఏంటని కూడా అడగకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు పని ఇంత మంచి అవకాశం ఇచ్చిన మాట తప్పను నిర్మాతలకు నా పాదాభివందనం. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ బేస్డ్ సినిమా..స్ట్రింగ్ ఆపరేషన్ అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడమే మెయిన్ టార్గెట్ .ఈ సినిమా రెగ్యులర్ సినిమాల్లా షూటింగ్  జరగలేదు. ఫస్ట్ రిహర్సల్  చేసుకుని తర్వాతనే షూట్ చేయడం జరిగింది. తెలుగు రాకున్నా ముస్కాన్ సేథీ చాలా కష్టపడి చాలా డెడికేషన్ తో వర్క్ చేసింది. అందరూ ఈ సినిమాకి మనసు ప్రాణం పెట్టి కష్టపడి పని చేశారు అందుకే అవుట్ ఫుట్ బాగా వచ్చింది. కబీర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. హీరో గారికి మోకాలు ఆపరేషన్ అయినా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ సినిమా వైలెన్స్ స్టోన్ డెత్ స్మెల్ హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో ఈ సినిమా ఉంటుంది. డిఫరెంట్ కథతో ఈనెల 24న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

హీరో తనీష్ మాట్లాడుతూ …చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది . మేము చాలా కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది ఈ సినిమా చూస్తే మా కష్టం మీకే తెలుస్తుంది..ప్రతి యాక్టరు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ ప్రతి సినిమా డీఫ్రెంట్ కథలు సెలెక్ట్ చేరుకొని సినిమా చేస్తాడు. ఈ సినిమాలో ప్రస్తుతం సొసైటీ లో జరుగుతున్న  సిచువేషన్స్ ,బర్నింగ్ ఇష్యూస్,సోషల్ కాజ్ లను ఇందులో చూపించడం జరుగుతుంది..చిన్నప్పటి నుంచీ అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ అమ్మాయిని ఎవరో తెలియని వక్తి వచ్చి ఆ అమ్మాయి లైఫ్ ను డిసైడ్ చేస్తున్నాడు. ఇలాంటి  సెన్సిబుల్ ను క్రియేట్ చేసే ఎలిమెంట్ ఉన్న కథను ఈ సినిమాలో చూపిస్తున్నాం. టేక్నికల్ పరంగా కాకుండా సోషల్ గా ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిన విషయం ఇది.వన్ షాట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మరో ప్రస్థానం సినిమా టెక్నికల్ గా కథ పరంగా చాలా స్ట్రాంగ్ .చాలా మంది వన్ షార్ట్ ఫిలిం అంటే ఏంటి ఈ సినిమాకు అంత స్పెషల్ ఏంటి అంటారు.ఈ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా డెడికేషన్ గా పనిచేశారు. ఈ సినిమాలో ఉన్నటువంటి స్విచ్వేషన్స్ బయట ఉండకూడదు అని కోరుకుంటున్నాను. మనం సినిమాలు సెలబ్రేట్ చేసుకోవాలని మేము ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తున్నాము.

సంగీత దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చాయి.ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ ...సింగల్ షాట్  మూవీలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాలో నేను డ్యాన్స్ కూడా చేయడం జరిగింది

హీరోయిన్ ముస్కాన్ సేథీ మాట్లాడుతూ ..ఫస్ట్ టైం ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నాను. వన్ షార్ట్ ఫిలిం లో నటించే ఈ సినిమా నాకు వెరీ స్పెషల్ మూవీ. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చినందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు
రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు
తదితరులు

సాంకేతిక నిపుణులు
మాటలు – వసంత కిరణ్, యానాల శివ,
పాటలు – ప్రణవం..,
సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ – క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ – జి. పురుషోత్తమ్ రాజు,
కొరియోగ్రఫీ – కపిల్,
ఫైట్స్ – శివ,
సమర్పణ – ఉదయ్ కిరణ్, నిర్మాణం – మిర్త్ మీడియా,
రచన దర్శకత్వం – జాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here