UG Productions “Sammathame” (Love is unconditional) Movie Opening

రాజా వారు – రాణి గారు”,చిత్రం తో నటుడుగా మంచిపేరు తెచ్చుకుని “యస్.ర్.కల్యాణ మండపం”, “సెబాస్టియన్” చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం హీరోగా, “కలర్ ఫోటో” సినిమాతో విమర్శకుల ప్రశంశలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి హీరోయిన్ గా యు.జి ప్రొడక్షన్స్ పతాకంపై గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కె.ప్రవీణ నిర్మిస్తున్న చిత్రం “సమ్మతమే”లవ్ ఈజ్ అన్ కండిషనల్ అనేది ఉపశీర్షిక.!!ఈ చిత్రం జనవరి 8న హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది..పూజ కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన భువనగిరి ఎం.ఎల్.ఏ. పైలా శేఖర్ రెడ్డి హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి  క్లాప్ నివ్వగా, మాజీ శాసనసభ్యుడు కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఈ సన్నివేశానికి ప్రముఖ వ్యాపారవేత్త రవీందర్ గౌరవ దర్శకత్వం వహించారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ …ఈ చిత్రం 9 వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తున్నాము.విలేజ్ బ్యాక్డ్రాప్ మరియు సిటీలో జరిగే లవ్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నాం.మార్చి మొదటి వారంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాము.నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా మాకిచ్చిన ఫ్రీడంతో అనుకున్న టైం లొనే షూటింగ్ కంప్లీట్ చేస్తాము అని అన్నారు.

నిర్మాత కె. ప్రవీణ మాట్లాడుతూ …యు. జి.ప్రొడక్షన్ లో మేము తీస్తున్న మొదటి చిత్రం “సమ్మతమే”.ఈ టైటిల్ తగ్గట్టే ఈ మూవీ ఉంటుంది.జనం ముందుకి మంచి సినీమా తీసుకెళ్లాలనే తాపత్రయం తో ముందుకు వచ్చాము.ప్రజలందరూ ఆదరించే విదంగా మేము తీసే ఈ సినిమాను ప్రేక్షకులు అందరించి ఆశీర్వదించాలని అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. ఈ సినిమాకోసం మూడు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాము.నేను ఇండస్ట్రీ కు వచ్చి షాట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసిన తరువాత నాకు ఫస్ట్ పరిచయమయ్యింది గోపినే .మా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ను రాత్రి,పగలు కష్టపడి తయారుచేసుకొన్నాము.నేను నటించిన “రాజా వారు – రాణి గారు” సినిమా తర్వాత,”యస్.ర్.కల్యాణ మండపం” సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. నిన్నటితో “సెబాస్టియన్” మూవీ షూటింగ్ కూడా అయ్యిపోయింది.రేపటి నుండి ఈ సమ్మతమే షూటింగ్ మొదలవుతుంది. ఇలా డే అండ్ నైట్ వర్క్ దొరకడం చాలా హ్యాపీగా ఉంది.అలాగే చాందిని తో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.ఎందుకంటే ఇద్దరం షాట్ ఫిల్మ్ నుండే వచ్చాము.శేఖర్ చంద్ర పాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి.మేమంతా ఈ సినిమాను మీకెప్పుడు చూపిస్తామా అని చాలా ఎక్సయిటెడ్ గా ఎదురు చూస్తున్నాము.ఈ “సమ్మతమే” పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం అని అన్నారు.

హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ …కలర్ ఫోటో తరువాత లుక్ అండ్ క్యారెక్టర్ పరంగా డిఫ్రెంట్ గా ఉండే పాత్ర కావాలని ఎదురు చూసాను.అలాంటి మంచి స్క్రిప్ట్,మంచి డైలాగ్ లున్న బ్రిలియంట్ స్క్రిప్ట్ చెప్పడంతో ఈ మూవీ చేయడానికి ఒప్పుకున్నాను.కిరణ్ తో యాక్ట్ చేస్తునందుకు చాలా హ్యాపీగా ఉంది.సినిమా పై ఇంత డెడికేషన్,ప్యాసినెట్ ఉన్న దర్శక,నిర్మాతతో ఈ మూవీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి.కథకు తగ్గట్టు ఉండే ఈ పాటలను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అన్నారు.

నటీ,నటులు

కిరణ్ అబ్బవరం,చాందిని చౌదరి

సాంకేతిక నిపుణులు

ప్రొడక్షన్…యు.జి.ప్రొడక్షన్స్
కథ,కథనం,మాటలు,దర్శకత్వం.. గోపీనాథ్ రెడ్డి
నిర్మాత..కె.ప్రవీణ
సంగీతం..శేఖర్ చంద్ర
ఎడిటర్..విప్లవ్ నైశాడం
డి. ఓ. పి…సతీష్ రెడ్డి మాసం
ఆర్ట్...సుధీర్ మాచర్ల
పి.ఆర్.ఓ...వంశీ – శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here