Ullalla Ullalla Movie Hero Nataraj interview

సరికొత్త కథ, కథనాలతో సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్ సుఖీభవ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ ని హీరోగా, నూరిన్, అంకితలను హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న ఈ చిత్రం జనవరి 1 న విడుదలకి సిద్ధంగా ఉండగా, హీరో నటరాజ్ విలేకర్లతో మాట్లాడుతూ…

ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?

దర్శకుడు, నిర్మాత వాళ్ళ కథకి ఒక కొత్త వ్యక్తి హీరో అయితే బాగుండని అనుకున్నారు, అలా నాన్నగారి ద్వారా నా గురించి తెలిసి ఆడిషన్ తీసుకున్నారు. మొదట్లో యూనిట్ సభ్యులకి కొత్త హీరో ఇంత మంది అనుభవమున్న నటుల మధ్య చేయగలరా అనుకున్నారు. సెట్ లో కొన్ని రోజులు నా నటన చూసాక అందరికి నమ్మకం వచ్చింది.

మీరు నటన నేర్చుకున్నారా?

నేను 15 ఏళ్ళ నుండి యూట్యూబ్ లోను మరియు థియేటర్స్ చేస్తూ ఉన్నాను. మొదటి సినిమా మరాఠి సూపర్ హిట్ సైరత్ కన్నడ రీమేక్ అయిన “మనసు మల్లిగె” రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చేసాను. 800 మందిని ఆడిషన్ చేసాక 801 వ వాడిగా వెళ్లిన నన్ను ఎంచుకున్నారు అనుకున్నట్టుగా ఆ చిత్రం అక్కడ అద్భుతమైన విజయం సాధించింది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?దర్శకుడు అవ్వాలి అన్న పిచ్చి ఆశ, డబ్బులున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలతో పాటు ప్రేమ కథ, సైకాలజికల్ కథనాల మధ్య తిరిగే ఒక గందరగోళ క్యారెక్టర్ నాది.

‘ఊల్లాల ఊల్లాల’ టైటిల్ ఎలా డిసైడ్ చేశారు ?
దర్శకుడు, నిర్మాత చిత్ర కథనాల గురించి మాట్లాడుకుంటూ టైటిల్ ఏం పెడుదాం అని చర్చింకుంటుండగా, నిర్మాత ఎ.గురురాజ్ గారికి చాలా ఇష్టమైన పాట ‘ఊల్లాల ఊల్లాల’ గుర్తొచ్చి అదే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

తెలుగులో ఇది మీ మొదటి సినిమా ఎలా అనిపిస్తుంది?

చాలా సంతోషంగానూ అదే సమయంలో భయంగాను ఉంది. నాన్నగారి పేరు నిలబెట్టగలనా, అందరూ నన్ను హీరోగా రిసీవ్ చేస్కుంటారా అన్న ఆలోచనలతో భయంగాను ఉంది. జనవరి 1 సినిమా విడుదల కోసం వేచి చూస్తున్న.

మీ నాన్నగారి దర్శకత్వంలో పని చేయటం మీకెలా అనిపించింది, సెట్ లో నాన్నగారితో మీ రిలేషన్ ఎలా ఉండేది?

సెట్ లోకి వచ్చాక నాన్నగారు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, అదే నాకు నేర్పించారు. కావాల్సిన చోటల్లా ఒక దర్శకుడిగా, ఒక తండ్రిగా చాలా సలహాలిచ్చారు. ఆయనకీ నాకు ఈ చిత్రం ఒక కొత్త అనుభవం, దర్శకుడిగా నాన్నకి, నటుడిగా నాకు ఇది మొదటి చిత్రమవ్వడంto ఈ చిత్రంపై మాకు చాలా అంచనాలు, ఆశలు ఉన్నాయి.

మీ నాన్నగారి డైలాగ్ డెలివేరిలో ఒక స్టైల్ ఉంటుంది, మీరు కూడా అలా ఏమైనా ఫాలో అయ్యారా?

కచ్చితంగా నా స్టైల్ సెపరేట్ ఉంటుంది అది మీకు జనవరి 1 న తెరపై కనిపిస్తుంది.

మీ తరువాతి ప్రాజెక్ట్స్ ?
అమ్మ దీవెన అనే సినిమా చేస్తున్న షూటింగ్ చాలా మేరకు ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కేవలం హీరోగానేనా, కొత్త రోల్ అయినా చేస్తారా?

నేను నటుడిగానే నిలబడాలనుకుంటున్న, కొత్త కథ రోల్ ఏది వచ్చినా, నచ్చితే కచ్చితంగా చేస్తా.

కన్నడలో ఇంకో చిత్రం ఏమైనా చేస్తున్నారా?

ప్రస్తుతానికి కన్నడలో ఏ చిత్రానికి ఒప్పుకోలేదు.

మీ నాన్నగారి సినిమాల్లో మీకు నచ్చిన క్యారెక్టర్?
ఆయన చిత్రాలు అన్ని నాకు నచ్చినవే, ముఖ్యంగా అంటే మాత్రం పోలీస్ స్టోరీ లో సత్య, సీతారామ రోజులో విలన్ క్యారెక్టర్ నా ఫెవరెట్.

హీరో అవ్వడానికి మీరు తీసుకున్న ట్రైనింగ్ ఏంటి?
చాలా బరువు తగ్గాను, నటనలో, ఫైట్స్ లో, డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాను, నన్ను నేను రెడీ చేసుకున్నాకే సినిమాల్లోకి వచ్చాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here