‘Utter flop’ ‘Romantic’ Movies Title Poster launched by Producer Shakeela

కె.ఆర్ ప్రొడక్షన్ పతాకంపై నూతన నటీనటులతో రమేష్ కావలి దర్శకత్వంలో షకీల నిర్మిస్తున్న అట్టర్ ప్లాప్, రొమాంటిక్ చిత్రాల టైటిల్ పోస్టర్ ను హైదరాబాద్ లో ప్రముఖ నటి షకీల విడుదల చేశారు. అలాగే కె.ఆర్ ప్రొడక్షన్ ద్వారా షకీలా, రమేష్ కావలి కలసి ఒక గ్రూప్ గా అసోసియేట్ అయ్యి సెలబ్రిటీ గ్రూప్ తరుపున ప్రముఖ నటి షకీలా ,మిలియనీర్ గ్రూప్ తరుపున రమేష్ కావలి సంయుక్తంగా కలసి కొత్త ఓటిటి ఫ్లాట్ ఫామ్ లోకి ఎంటర్ అవ్వాలని “కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్” ఓటిటి ను ప్రారంభించడం జరిగింది..ఈ సందర్భంగా

సెలబ్రిటీ గ్రూప్ షకీల మాట్లాడుతూ...తమ్ముడు రమేష్ చెప్పిన అట్టర్ ప్లాప్, రొమాంటిక్ చిత్రాల రెండు సినిమాలు నాకెంతో నచ్చాయి..అందరూ కొత్త వారితో ఈ సినిమాలు చేస్తున్నాము. ఈ రెండు సినిమాల్లో కూడా నా కూతురు మిలా హీరోయిన్ గా నటిస్తుంది.. గోవాలో అద్భుతమైన లోకేషన్స్ లలో షూటింగ్ చేస్తున్నాము. పూరి జగన్నాథ్ గారి పూరి మ్యూజిక్ వీడియోను చుసిన తరువాత ఆయన సినిమాల గురించి చెప్పిన మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను, నా తమ్ముడు రమేష్ లు కలసి ఈ ఓటిటి ని ప్రారంభించడం జరిగింది. పూరి చెప్పినట్లు 100 సినిమాలు చేస్తే 10 మాత్రమే హిట్ అయ్యి 90 సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ప్లాప్ అయిన 90 సినిమాల వలన ఎంతోమందికి ఉపాధి దొరికింది. లేడీస్ నాట్ అలౌడ్” సినిమాకు సెన్సార్ విషయంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎంతో మందిని రిక్వెస్ట్ చేసుకున్నాము. అందుకే ఇక మేము ఎవరినీ రిక్వెస్ట్ చేసుకోకూడదని మేము ఈ ఓటిటి ని స్టార్ట్ చేశాము. అందుకే కొత్తగా ఇండస్ట్రీ కు వచ్చే వారికి వెల్ కమ్ పలుకుతూ అందరికీ మా ఓటిటి ప్లాట్ ఫాం ఒక వేదిక కావాలని స్టార్ట్ చేశామని అన్నారు.

మిలియనీర్ గ్రూప్ రమేష్ కావలి మాట్లాడుతూ…ప్రెజెంట్ మేము అట్టర్ ప్లాప్, రొమాంటిక్ రెండు సినిమాలు తీస్తూ నేనే దర్సకత్వం వహిస్తున్నాను. అలాగే ఈ రెండు మూవీస్ లలో కూడా షకీల కూతురు మిలా హీరోయిన్ గా చేస్తుంది. మేడం షకీల గారితో కలసి “కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్” ఓటిటి ను ప్రారంభించడం జరిగింది. మేము ప్రారంభించిన ఈ ఓటిటి కమర్శిల్ ఇంటెన్షన్ తో ప్రారంభించలేదు. మేము గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము. ముక్యంగా మేము చేసిన షకీల, సాయిరాం దాసరి, నేను కలసి చేసిన “లేడీస్ నాట్ అలౌడ్” సినిమాకు సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. పది సినిమాలు చేసిన మాకే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే కొత్తవారి పరిస్థితి దారుణంగా వుంటుంది అని గ్రహించి కొత్తవారు అలాంటి ఇబ్బందులు ఎదుర్కోరాదని మేము ఈ ఓటిటి ను లాంచ్ చేయడం జరిగింది. ఇందులో వారు తీసిన షార్ట్ ఫిల్మ్, సినిమా ఏదైనా కూడా ఫ్రీగా సపోర్ట్ చేస్తాము. అంతే కాకుండా కొత్తవారు ఇచ్చిన కంటెంట్ కు ముందే డబ్బులు ఇస్తాము.అలాగే ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ ను కండక్ట్ చేసి అందులో బెస్ట్ వచ్చిన ఫిలిమ్స్ కు 1,2,3 కేటగిరీలలో లక్ష, యాబై వేలు, ఇరవై ఐదు వేలు ఇస్తాము. అలాగే కొత్తవారిని ప్రోత్సాహకించాలని వీరికి మా ప్రొడక్షన్ లో మూవీ తీసే అవకాశం కూడా కల్పించడమే కాక ప్రతి సంవత్సరం రెండు సినిమాలు తీస్తాము. ప్రెజెంట్ మేము అట్టర్ ప్లాప్, రొమాంటిక్ రెండు సినిమాలు తీస్తూ నేనే దర్సకత్వం వహిస్తున్నాను. అలాగే ఈ రెండు మూవీస్ లలో కూడా షకీల కూతురు మిలా హీరోయిన్ గా చేస్తుంది.ఇది బిగినింగ్ మాత్రమే ముందు ముందు ఈ ఓటిటి ద్వారా అనేక సినిమాలు చేస్తాము అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here