V. Samudra’s TFDA Election Panel Meeting

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ 2024 ఎన్నికల సందర్భంగా వి. సముద్ర గారి ప్యానెల్ తమ మేనిఫెస్టోతో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ పానెల్ ఎన్నికైతే టి ఎఫ్ డి ఏ ద్వారా భవిష్యత్తుకు ఏం చేయాలి అనే ప్రణాళికతో ముందుకు వచ్చారు.ఈ సమావేశంలో దర్శకుడు వి. సముద్ర, మద్దినేని రమేష్, మధుసూదన్ రెడ్డి మరియు కస్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు వి. సముద్ర  మాట్లాడుతూ : దర్శకుడుగా నేను 18 సినిమాలు చేస్తే ఇందులో 12 సినిమాలు హిట్ అయ్యాయి. అలాగే ఎంతోమంది అసోసియేట్ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లను ఇండస్ట్రీ కి పరిచయం చేయడం జరిగింది..నేను అందరికీ సేవ చేయాలనే ఆలోచనతో టి ఎఫ్ డి ఏ 2024 ఎన్నికలలో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే మా మేనిఫెస్టోలో ప్రకారంగా చెప్పిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు.

మద్దినేని రమేష్ గారు మాట్లాడుతూ : గత ఆరు సంవత్సరాలనుండి ఏ సంఘం లో లేని నేను ప్రస్తుతం వి. సముద్ర ప్యానల్ తరుపున జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. అయితే అనూహ్యంగా ఈ సారి ఎప్పుడూ లేని విధంగా మూడు ప్యానల్స్ పోటీ చేయడం జరుగుతుంది. మా ప్యానల్ ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్ గా పోటీ చేస్తున్న మధుసూదన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న
కస్తూరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ మంచి చేయాలని కోరుకునే మా వి. సముద్ర గారి ప్యానెల్ ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.p

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here