‘Vade Veedu’ Movie Poster launch in Vizag !!!

రవి, వెన్నెల హీరో హీరోయిన్ గా అవంతి ఎంటర్టైనర్ మరియు తారా క్రియేషన్స్ సంయుక్త బ్యానర్ల పై శ్రీపతి శివ కుమార్ నిర్మాణ సారథ్యంలో యువ దర్శకుడు డా, గోపికృష్ణ కోరుకుండ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బైలంపూడి బ్రహ్మానంద రెడ్డి నిర్మిస్తున్న వాడేవీడు చిత్రం పోస్టర్ రిలీజ్ విశాఖపట్నంలో జరిగింది.

వైజాగ్ డాబా గార్డెన్స్ లోని ప్రెస్ క్లబ్ లో విజెఏ ఫ్లో సిఐ స్వర్ణలత ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర పోస్టర్ ను విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ…. స్థానిక కళాకారులకు అవకాశాన్ని కల్పిస్తూ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కార్యక్రమాలు అన్నీ ఇక్కడే నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ చిత్రం అందరి మన్ననలు పొందాలని పేర్కొన్నారు.

నూతన యువ దర్శకుడు డా, గోపికృష్ణ కోరుకొండ మాట్లాడుతూ…యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించబడిన ఈ ప్రేమ కథ చిత్రం షూటింగ్ తో పాటు శ్యామ్ గారి ఎమ్ఎస్ స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశాం. విశాఖలో సినీ పరిశ్రమ ఎదుగుదలకు నవ్యఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ కల్పిస్తామన్న ప్రోత్సాహం మాకు స్ఫూర్తిదాయకం అన్నారు.

నిర్మాణ సారధి శ్రీపతి శివకుమార్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎల్.రాజ సంగీతం సమకూర్చిన ఆడియో ఆదిత్య ద్వారా ఆడియో విడుదల కానుంది. మేలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు. ఈ చిత్ర విజయం ద్వారా మాకు, పరిశ్రమ ఇక్కడ స్థిరపడడానికి దోహదపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

నటీనటులు:
రవి, వెన్నెల, అనిల్ కుమార్, దార్ల బైలంపూడి బ్రహ్మానంద రెడ్డి, సన్నీ బాబు, హరి కిరణ్, హేమంత్, కళ్యాణ్ తదితరులు.

సాంకేతికవర్గం:
కథ: ఎమ్.సత్య రవికుమార్
కెమెరా: పి.హేమ వర్ధన్ రెడ్డి
ఎడిటింగ్: నరేష్ కుమార్ మడికి
నృత్యాలు: బెన్ని మాస్టర్, ఆర్.పవన్
కో.డైరెక్టర్: బి.రమేష్ బాబు
సంగీతం: ఎమ్ఎల్.రాజ
పిఆర్ఓ: బాలాజీ శర్మ
నిర్మాత: బైలంపూడి బ్రహ్మానంద రెడ్డి
రచన- దర్శకత్వం: డా, గోపికృష్ణ కోరుకొండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here