Pawan Kalyan ‘Vakeel Saab’ Movie review

Release date :-April 9,2021
Cinema rangam :- Rating 3.5/5
Movie Name :- “’Vakeel Saab’ ”
Banner: Sri Venkateswara Creations, Bay View Projects
Cast: Pawan Kalyan, Shruthi Hasan (Guest Role), Niveda Thomas, Anjali, Ananya, Prakash Raj, Mukeshrishi, Adarsh, Meer etc.
Music: SS Thaman
Photography: PS Vinod
Presents: Bonikapur
Producer: Dil Raju
Directer: Venu Sriram

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం ఎట్టకేలకు నేడు థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు మూడేళ్ల తరువాత పవర్ స్టార్ వెండితెరపై కనిపించడంతో ఆయన అభిమానుల సంతోషానికి అవదుల లేకుండా పోయాయి. చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతోన్న “వకీల్ సాబ్”గా తన వాదన వినిపించడానికి అభిమాన ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఇక ఇప్పటికే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు (ఏప్రిల్ 9 ) ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం

కథ ..
జాబ్స్ చేసుకుంటూ ఒకే ఫ్లాట్ లో కలిసుండే పల్లవి (నివేద థామస్), జరీనా (అంజలి), దివ్య (అనన్య) అనే ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఒకానొక సందర్భంలో కొందరు అబ్బాయిలని కలిస్తే, ఆ కుర్రాళ్ళు ఈ అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పల్లవి ఏం చేసింది,చేయని నేరానికి అన్యాయంగా జైలుపాలైన తన స్నేహితురాలును కాపాడి బెయిల్ పై బయటికి తీసుకు రావాలని ఎంతో మంది లాయర్లను కలుస్తారు.కానీ  ఎవరు కూడా ఈ కేసును టేకప్ చేయడానికి ముందుకురారు.చివరకు తమ ఇంటిపక్కనే ఉన్న సత్యదేవ్(పవన్ కళ్యాణ్) ఒకప్పుడు పెద్ద లాయర్ అని తెలుసుకొని సత్యదేవ్ దగ్గరకు వస్తారు. సత్యదేవ్  కొన్ని కారణాల వల్ల తన లాయర్ వృత్తిని వదిలిపెట్టానని ‘లా’ లో కొన్ని సలహాలు ఇస్తాడు.ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు ఆ అమ్మాయిలకు సపోర్ట్ గా వున్నాడని సత్యదేవ్‌ను భయపెట్టాలని చూస్తారు. దీంతో వేముల పల్లవి కేసును టేకప్ చేస్తాడు సత్యదేవ్, ఆమెను ఏ విధంగా బయటకు తీసుకొస్తాడు? అసలు సత్యదేవ్ లాయర్ వృత్తిని ఎందుకు మధ్యలో ఆపేశాడు? అతడి ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి?వారిని ఆ కేసునుంచి బయటకు తేవడానికి – వనితల హక్కుని తెలియచెప్పడానికి డిఫెన్స్ లాయర్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) ఎలా పోరాడాడు అన్నదే వకీల్ సాబ్ సినిమా కథ.

నటీనటులు
పవన్ కళ్యాణ్ నటనలో ఎంతో పరిణితి చెందిన నటనను మనకు పరిచయం చేస్తుంది లాయర్ సత్యదేవ్ పాత్ర. క్యాంపస్ స్టూడెంటుగా, ప్రేమికుడిగా, భర్తగా, తాగుబోతుగా, అడ్వకేటుగా, ప్రతి యాంగిల్ లోనూ తనదైన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంటూ వింటేజ్ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనిపించారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ లో పవన్ పెరఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. తన ఆర్గ్యుమెంట్ గట్టిగా వినిపిస్తూనే అసలు ఎంటర్టైన్మెంట్ కే స్కోప్ లేని ఆ స్పేస్ లో తన మార్క్ చమక్కులతో అలరించారు.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మెచ్యూర్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడని చెప్పాలి.గతకొన్నేళ్లలో పవన్ కళ్యాణ్‌ను ఈ రేంజ్‌లో యాక్ట్ చేయడం మనం చూడలేదు. సినిమాలోని యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో పవన్ పర్ఫార్మెన్స్ పీక్స్ .ఇక ఈ సినిమాలో మరో బెస్ట్ పర్ఫార్మెన్స్ లాయర్ నందగా ప్రకాష్ రాజ్ ఇచ్చాడు. పవన్‌తో సమానంగా ఆయన ఈ సినిమాలో నటించాడు. ప్రకాష్ రాజ్ ఆ లాయర్ క్యారెక్టర్ కి అదనపు బలం అయ్యారు. ఇప్పటికే బెస్ట్ పెరఫార్మెర్స్ గా ప్రూవ్ చేసుకున్న ఆయన మరోసారి అలవోకగా ది బెస్ట్ ఇచ్చారు.హీరోయిన్ విషయానికి వస్తే నివేదా థామస్, అంజలి ఎవరికీ వారే పాత్రల్లో ఒదిగిపోయారు. అనన్య, ఆదర్శ్, ముకేశ్ ఋషి, మీర్ తదితరులు అందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక విభాగం
ఓ మై ఫ్రెండ్ ,ఎమ్.సి.ఏ సినిమాలు తీసిన వేణు శ్రీరామ్ ఈసారి బాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘పింక్’ సినిమా కథను ఏమాత్రం మార్చకుండా, పవన్ కళ్యాణ్ కోసం కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేసి శ్రీరామ్ తనదైన మార్క్ వేసుకున్నాడు. ఇక టెక్నికల్ పరంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అంటూ ఓపెన్ గానే చెప్పుకున్న థమన్ తన అభిమానాన్ని వీలైనంత ప్రదర్శించే ప్రయత్నం చేసాడు. పాటలవరకూ ఆ కథకి తగ్గ అవుట్ పుట్టే ఇచ్చినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మాత్రం థియేటర్స్ దద్దరిల్లాయి.ముఖ్యంగా బీజీఎం సూపర్బ్.పి.ఎస్. వినోద్ ఫోటోగ్రఫీ కోర్ట్ రూమ్ డ్రామాని కరెక్ట్ వేలో ప్రోజెక్టు చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, మతాల రచయిత తిరు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు వకీల్ కేస్ గెలవాలని తమ తోడ్పాటు అందించారు.ఈ సినిమా కోసం దిల్ రాజు పెట్టిన ఖర్చు మనకు సినిమా చూస్తే ఇట్టే అర్థమవుతోంది.మొత్తానికి చాలా కాలం తరువాత పవన్ తన అభిమానులకు “వకీల్ సాబ్” చిత్రంతో ఫుల్ ట్రీట్ ఇచ్చాడని చెప్పాలి.

Cinemarangam.com 3.5 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here