Versatile Hero Satyadev interview about ‘GODSE’

.వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు.ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇంతకు స‌త్య‌దేవ్ – గోపి గ‌ణేష్ కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న చిత్రమిది  ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌, ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల  17న గ్రాండ్ రిలీజ్ అవుతున్న  సంద‌ర్భంగా హీరో స‌త్య‌దేవ్ పాత్రికేయుల మిత్రులతో ముచ్చటిస్తూ

ఈ గాడ్సే సినిమాలో సమాజంలో జరిగే చాలా విష‌యాల‌ను చ‌ర్చించాం. ముఖ్యంగా మ‌న వ్య‌వ‌స్థ‌లో భాగ‌మైన ప్ర‌భుత్వం.. ఎలా ప‌ని చేస్తుంది. అందులో లోపాలేంటి? అనే విష‌యాల‌ను చూపించాం. మ‌న‌లో చాలా మందికి అనేక స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేసుంటాం. రియాక్ట్ కావాల‌ని కూడా అనుకుంటాం. కానీ రియాక్ట్ కాలేం. అలాంటి చాలా మందిలో నుంచి పుట్టిన ఓ వ్య‌క్తి ‘గాడ్సే’ ధైర్యంగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూప‌ట‌మే క‌థాంశం.

నేను ఈ కథ విన్నప్పుడు, వ్యక్తిగతంగా ఇలాంటి కీలక పాత్రను చేయగలానా లేదా ఈ కథను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని ఆలోచించాను. కానీ గోపి కథను చెప్పిన విధానం చూస్తే చేయగలను, ప్రేక్షకులు కూడా చూస్తారు అనే నమ్మకం కలిగింది.కానీ వ్యక్తిగతంగా ఈ సినిమా కోసం నేను ఎలాంటి హోంవర్క్ చేయలేదు. సమాజంలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి , అవి సామాన్యులను ఏ విధంగా అడ్డుకుంటున్నాయో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి వ్యవస్థపై తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుందనేది మొత్తం కథ.

 

దర్శకుడు గోపి బ్లఫ్ మాస్టర్‌ కోసం చాలా కష్టపడ్డాడు. అందుకే ఆయనపై నాకు చాలా నమ్మకం కలిగింది. సమాజంలోని సమస్యలను ఆయన ప్రశ్నించిన తీరు, ఈ సమస్యలకు పరిష్కారాలు చెప్పిన తీరు చాలా చక్కగా చెప్పారు.ఈ సినిమాలో చివరి నలభై నిమిషాలు సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో అత్యంత వినోదాత్మకంగా ఉండబోతుంది. స్క్రిప్టు టెన్షన్, సాలిడ్ ఎమోషన్స్‌తో నేరేట్ చేసిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

 

ఐశ్వర్య లక్ష్మి తో నాకు ముఖాముఖిగా సన్నివేశాలు లేవు. కానీ ఆమె డిజిటల్ మాధ్యమం ద్వారా నాతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండేది. తను కూడా కీలక పాత్రలో నటించి చాలా హార్డ్ వర్క్ చేసింది

 

సినిమా నచ్చి నాతో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు.సినిమాకి కావాల్సినవన్నీ చేశాడు మరియు అతని ప్రొడక్షన్ హౌస్‌తో నేను నటించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అక్షయ్ కుమార్ వంటి వారితో నటించినందుకు నా కల నిజమైంది. నా పాత్ర గురించి నేను మాట్లాడలేను కానీ షూటింగ్ పార్ట్‌ను మాత్రం పూర్తి చేసాము. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాము.

ఒక్కోక్క సినిమాతో మెల్లగా స్టెప్ బై స్టెప్ తో సినిమాలు చేసుకుంటున్నాను. చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
ఒక శుక్రవారం నా పరిస్థితిని మార్చేస్తుంది.అప్పుడు విమర్శకులు సైతం నా పనిని అభినందిస్తున్నారని నాకు తెలుసు, అయితే ఏ నటుడి లక్ష్యం అయినా కమర్షియల్‌గా విజయం సాధించడమేనని, ఏదో ఒక రోజు నేను తప్పకుండా మంచి విజయాన్ని పొందుతాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here