Vishwa Karthikeya’s Journey from Child Artist to Hero

చిన్న వయసు లోనే భిన్న మైన పాత్రలు పోషించి బాల నటుడిగా ప్రేక్షకుల ఈలలు, గోలల నడుమ వెండి తెరపై తలుక్కు మన్నాడు విశ్వ కార్తికేయ..ఆరేళ్ల వయసులో తెరంగేట్రం చేసి జానకి వెడ్స్ శ్రీరాంతో పరిణతి చెందిన నటుడుగా ప్రశంశలు అందుకున్నాడు.‘ఆ నలుగురు’తో శభాష్ అనిపించుకొని నట కిరీటి కి అప్పడాలు ఎలా అమ్మాలో నేర్పి సక్సెస్ అయ్యాడు.మంచు విష్ణు మొదటి సినిమాలో మెరిశాడు.గోరింటాకులో రాజశేఖర్ చిన్నపటి పాత్రను అద్భుతం గా పండించి,లేత మనసులులో కళ్యాణి కొడుకుగా పెద్ద మనసుతో మెప్పించాడు.శివ శంకర్ లో బాల మోహన్ బాబుగా,బాపు గారి దర్శకత్వం లో బాల కృషుడిగా మై మరపించి బాపు గారి మనసులో స్థానం సంపాదించు కున్నాడు. అధినాయకుడులో చిన్నప్పటి బాలయ్యబాబు గా వెండి తెరపై నటించి బాలయ్య బాబుతో ప్రశంసలు అందుకున్నాడు ..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఈ నిజం అబద్ధం ఐతే అనే టెలి ఫిల్మ్ లో ప్రేక్షకులనే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం మెప్పించి ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు, అలాగే అవార్డు ఫర్ మెరిటోరియస్ అచివ్మెంట్ అవార్డు ని పొందాడు.ఇటు చదువులోనూ, అటు సినిమాల్లోనూ రాణిస్తూ 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా తన మార్క్ ని చూపించాడు మన విశ్వ కార్తికేయ. Wonderful physic తో డాన్స్ లోనూ, ఫైట్స్ లోనూ ఈజ్ ను కనబరుస్తూ వావ్ అనిపిస్తున్నాడు.

ఎనర్జిటిక్ హీరోగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకం పై ఎం సుధాకర్ రెడ్డి గారు నిర్మాతగా, చలపతి పువ్వల దర్శకత్వం లో కళాపోషకులు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు..
హీరోగా తన నటనకు గాను విమర్శకుల నుండి ప్రశంశలు అందుకున్నాడు.

దర్శకులు వి. సముద్ర గారి జైసేన చిత్రం లోనూ మెయిన్ లీడ్ గా నటించి తెలుగు, కన్నడ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. జైసేన, కళాపోషకులు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం తో ప్రేక్షకుల కు మరింత దగ్గర అయ్యాడు. సినీ పెద్దల ప్రశంసలను సైతం అందుకుని ప్రేక్షకులను మెప్పించాడు.

ప్రస్తుతం సరికొత్త ప్రేమ కథాంశంతో RR క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై ఎన్. చంద్రమోహన్ రెడ్డి నిర్మాతగా, చలపతి పువ్వల దర్శకత్వం లో, రథన్ మ్యూజిక్ director గా తెలుగు, తమిళ్ భాషల్లో సీనియర్ తారాగణంతో భారీ బడ్జెట్ తో Production No 1 చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో కథా నాయకుడుగా నటించిన విశ్వ కార్తికేయ ఈ చిత్రం విడుదల తర్వాత పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
నేడు (జూలై 3) జన్మదినోత్సవం జరుపుకుంటున్న హీరో విశ్వ కార్తికేయ మరిన్ని విజయాలు సాధించాలని , నిండు నూరేళ్ళు ఇలాంటి వేడుకలు జరుపు కోవాలని కోరుకుంటూ….
All the best our hero viswa karthikeya..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here