Viswak sen’s Das ka ‘Dhumki’ Movie launched by Producer Allu Aravind

కృష్ణదాస్ అనే  వెయిటర్ లైఫ్ లో జరిగే థ్రిల్లింగ్ కథే “దాస్ కా ధమ్కీ”. విశ్వక్ సేన్,నివేత పేతురాజ్ జంటగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులోని రామానాయుడు స్టుడియోలో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ హీరో,హీరోయిన్ లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా , దర్శకుడు నరేష్ కుప్పిలి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్బ్ ఆన్ చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నా కిస్టమైన యుంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు.విశ్వక్ వినిమా తీయకముందు నుండి నాకు టచ్ లో వున్నాడు.విశ్వక్ చాలా మంచి పర్సన్ అయితే సంతోషం వచ్చినా తట్టుకోలేడు కోపం వచ్చినా తట్టుకోలేడు.నివేతా పేతురాజ్ మంచి నటి ఇంతకుముందు మా సినిమాకు వర్క్ చేసింది.విశ్వక్ కు తన మొదటి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలి ఈ సినిమాకు పనిచేస్తున్న నటీనటులకు, టెక్నీషియన్లకు అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. విశ్వక్ మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఇప్పుడు తను చేస్తున్న “దాస్ కా ధమ్కీ” చిత్రం తన మొదటి చిత్రం “ఫలక్ నుమాదాస్” లాగా బిగ్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్క్రిప్ట్ రైటర్ ప్రసన్న వెరీ ప్యాసినెట్ ఉన్న రైటర్ రాజు గారు కాంపౌండ్ లో తరచూ కలుస్తుంటాము.పాగల్ తర్వాత మళ్ళీ విశ్వక్ తో పని చేస్తున్న నరేష్ కు ధన్యవాదాలు. నివేత కు అలాగే చిత్ర యూనిట్  అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. మా రాజన్న కొడుకు విశ్వక్ సేన్ మంచి సినిమాలు తీసి ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


చిత్ర నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ.. మా ప్రొడక్షన్స్ లో విశ్వక్ తో ఫలక్ నుమాదాస్ సినిమా చేసినప్పుడు అందరూ కొత్తవారమే. అప్పుడు తీసిన ఆ సినిమాకు హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలా అన్నీ తనే అయ్యి తీయడం జరిగింది.అప్పటి పరిస్థితుల్లో ఇండస్ట్రీలో అన్ని విధాలా వెంక్కులాగడం జరిగింది.అయినా ధైర్యం తో ఆ సినిమా తీసి ప్రేక్షకుల నుండి గొప్ప విజయాన్ని అందుకున్నాము. ఆ తర్వాత విశ్వక్ సినిమాలు చేసినా  మళ్లీ అదే బ్యానర్లో ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాము.అప్పటి సినిమా కంటే ఈ సినిమా నాలుగింతలు ప్లస్ ఉంటుంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులందరూ కూడా చాలా ఆనందిస్తారు. ఇకముందు ఈ బ్యానర్ లో ఒక విశ్వక్ సినిమాలే కాకుండా మంచి మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు

చిత్ర దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ.. పాగల్ తరువాత విశ్వక్ తో మళ్లీ సెకెండ్ ఫిల్మ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.ఈ స్క్రిప్ట్ ప్రసన్నగారిదే..న కెరియర్ బిగినింగ్  తనతోనే స్క్రిప్ట్ తీసుకొని పాగల్ సినిమా చేశాను. ఇప్పుడు ఇది కూడా అమేజింగ్ స్క్రిప్ట్.లియాన్ జేమ్స్  మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు రెండు పాటలు ఇచాడు.చాలా బాగున్నాయి.మంచి కంటెంట్ తో తీస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ..ఒక సినిమా తీసి హిట్ ఇచ్చి ఇండస్ట్రీలో నాకంటూ కొంత స్పేస్ ఇచ్చి మళ్లీ మళ్లీ సినిమాలు చేసే శక్తినిచ్చిన మీడియాకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా మొదటి సినిమాను ప్రొడ్యూస్ చేసి డాడీ నాకు సపోర్ట్ చేశారు.ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను తనే ప్రొడ్యూస్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. మాకేమి తెలియనప్పుడే మంచి సినిమా తీశాము.అన్నీ తెలిసిన తరువాత ఇప్పుడు తీస్తున్న సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రసన్న నాకు మూడు స్క్రిప్ట్ లు చెప్పాడు.అందులో ఈ కథ వెరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించ డంతో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము..ఫుల్ లెన్త్ రగ్డ్ ఫిల్మ్ అని ఎక్స్ పెక్ట్ చేయకండి.దాస్ అంటే కృష్ణదాస్ అనే  వెయిటర్ లైఫ్ లో జరిగే థ్రిల్లింగ్ కథే “దాస్ కా ధమ్కీ”.ఈ చిత్రాన్ని  మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తామని అన్నారు


హీరోయిన్ నివేతా పేతురాజ్ మాట్లాడుతూ.. విశ్వక్ చాలా హార్డ్ వర్కర్,తనతో మళ్లీ నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ స్టోరీ వెరీ వెరీ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

డి.ఓ.పి మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి అందరం చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాము.ఈ సినిమాబిగ్ సక్సెస్ కావాలని కోరుతున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు
విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్ కరాటే రాజు
డైరెక్టర్ నరేష్ కుప్పిలి
రైటర్ :;ప్రసన్న కుమార్ బెజవాడ
డి ఓ పి :;దినేష్ కె బాబు
మ్యూజిక్ : లియాన్ జేమ్స్
ఆర్ట్ డైరెక్టర్ : కె రామాంజనేయులు
పబ్లిసిటీ డిజైనర్ : పడా క్యాసెట్
పి ఆర్ వో : వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here