*Vivaha Bhojanambu New restaurant branch inaugurated at AS Rao Nagar

భాగ్యనగర వాసులకు తెలుగింటి వంట రుచి ఏంటో చూపిస్తూ… ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను అందిస్తున్న ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ కొత్త బ్రాంచ్ ఆదివారం ఏఎస్‌రావు నగర్‌లో ప్రారంభమైంది. యువ కథానాయకుడు సందీప్ కిషన్, ఆయన స్నేహితులు రవిరాజు, అమిత్, షెఫ్ యాదగిరి కలిసి తొలుత జూబ్లీహిల్స్‌లో ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ ప్రారంభించారు. ఏడాదిలో ప్రజల ఆదరణ పొందింది. రెండో ఏడాది సికింద్రాబాద్‌లోని పార్క్‌లేన్‌లో రెండో బ్రాంచ్ ప్రారంభించారు. విజయవంతంగా మూడో ఏడాదిలో అడుగుపెట్టిన ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ కొత్త బ్రాంచ్ ఇప్పుడు ఏఎస్‌రావు నగర్‌లో ఓపెన్ అయింది. అలాగే, సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు చెందిన ఏఎంబి మాల్, మై హోమ్ అంబుజాలో ఫుడ్ కోర్ట్స్ ‘వివాహ భోజనంబు’కు ఉన్నాయి. 

గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు (ఎంపి), తెరాస నేత జె. సంతోష్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎంఎల్‌సిలు పి. శ్రీనివాసరెడ్డి, కె. నవీన్ రావు, సందీప్ కిషన్ దీపారాధనతో ఏఎస్‌రావు నగర్‌లో ‘వివాహ భోజనంబు’ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ తెరాస నేత లక్ష్మణారెడ్డి, కార్పొరేటర్లు పురుషోత్తం రెడ్డి, పావని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రవిరాజు మాట్లాడుతూ “రెండో సంవత్సరం సికింద్రాబాద్ లో స్టార్ట్ చేశాం. మూడో సంవత్సరం ఏఎస్ రావు నగర్ – సైనిక్ పురి క్రాస్ రోడ్స్ దగ్గర స్టార్ట్ చేశాం. ఇది చాలా పెద్దది కావాలని కోరుకుంటున్నాను. ఈ రెస్టారెంట్ లో మొత్తం మూడు ఫ్లోర్స్ ఉన్నాయి. రెండు ఫ్లోర్స్ లో బాంకెట్ హాల్స్ ఉన్నాయి. ఒక్కో హాల్ లో 300 మంది హ్యాపీగా పార్టీ, ఫంక్షన్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ లో వందమందికి పైగా కూర్చుని తినవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వంటకాలను, చాలామందికి తెలియని రుచులను ప్రజలకు అందించడం మాకు సంతోషంగా ఉంది. సందీప్ కిషన్ గారికి, అమిత్ గారికి థాంక్స్” అని అన్నారు.

‘వివాహ భోజనంబు’ పార్ట్‌నర్స్‌లో ఒకరు, హెడ్ షెఫ్ అయిన యాదగిరి మాట్లాడుతూ “సందీప్ కిషన్ గారు ‘వివాహ భోజనంబు’ పేరు ఎందుకు పెట్టారనేది తొలుత ఎవరికీ అర్థం కాలేదు. కానీ, ఈ రోజు అందరికీ అర్థం అయింది. అమ్మచేతి కమ్మదనం ఎక్కడ దొరుకుతుందంటే… వివాహ భోజనంబు అని నేను గట్టిగా చెబుతాను. రాబోయే తరానికి ఆరోగ్యమే ఒక ఔషధంగా మారాలన్నది మా సంకల్పం. ఆహారాన్ని ఒక ఔషధంగా ప్రజలకు మేం అందిస్తాం” అని అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ “ఈ రెస్టారెంట్ ప్రాంరంభోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్. ఇప్పటివరకూ మా రెస్టారెంట్లకు వచ్చి భోజనం చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. వాళ్లకు మా ఫుడ్ నచ్చడం వల్ల మేం అంచలు అంచలుగా ఎదుగుతూ వచ్చాం. ప్రతి డిసెంబర్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తూ వస్తున్నాం. ‘వివాహ భోజనంబు’ ఫ్యామిలీకి మూడో ఏడాది ఇది. ఇప్పుడు ఏఎస్‌రావు నగర్‌లో మూడో బ్రాంచ్ ఓపెన్ చేశాం. మా రెస్టారెంట్ విజయానికి కారణం షెఫ్ లే. మా రెస్టారెంట్లలో సుమారు 250 నుండి 300 మంది షెఫ్ లు యాదగిరి నేతృత్వంలో పని చేస్తున్నారు. ఇంచుమించు 900 మందికి పైగా పని చేస్తున్నారు. సుమారు 1000 మంది ఫ్యామిలీలు ఈ రెస్టారెంట్ల మీద ఆధారపడి ఉన్నారు. అందరికి పని కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఇతర నగరాల్లోనూ మా రెస్టారెంట్ బ్రాంచ్ లు ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాం” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here