Young Hero Panja Vaishnavi Tej interview about “Ranga Ranga Vaibhavanga” movie

ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యంగ్ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్, కొండ పొలం సినిమా తర్వాత చేస్తున్న తాజా సినిమా ‘రంగ రంగ వైభ‌వంగా” ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో..  తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు . కేతికా శ‌ర్మ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా యంగ్ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ

ఉప్పెన తరువాత చాలా కథలు విన్నాను. వాటిలో సరదాగా సాగిపోయే “రంగ రంగ వైభవంగా” కథ బాగా నచ్చింది.ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.ఇందులో నేను మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తాను.బాయ్స్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లా ఉండే ఈ కథ పై, దర్శకుడు గిరీషాయ పై నాకు నమ్మకం ఏర్పడడంతో ఈ సినిమా చేశాను.ఇగోస్ లేని ఏ రిలేష‌న్ షిప్ అయినా రంగ రంగ వైభ‌వంగా ఉంటుంద‌ని చెప్ప‌ట‌మే మా సినిమా. మా సినిమాలో రాధా.. రిషిల‌కు ఇగోలు చాలా ఎక్కువ‌. ఇలా ఇగోల మధ్య నడిచే జెన్యూన్ లవ్ స్టోరీ.అయితే సినిమాకు టైటిల్ కు ఎలాంటి సంబంధం ఉండదు.

మొదటి రెండు సినిమాలతో పోలిస్తే ఇందులో చాలా స్టైలిష్ గా ఉంటాను. ఇలాంటి కథలు ఇప్పటికే వచ్చినా ఇది చాలా ఫ్రెష్ ఫీల్ నిస్తుంది. ఫ్యామిలీ డ్రామా తో పాటు లవ్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటాయి. సినిమా మొత్తం సరదాగా సాగిపోతుంది. నరేష్, ప్రభు, ప్రగతి, తులసి లాంటి సీనియర్స్ తో నటించడం హ్యాపీ. నవీన్ చంద్ర ఇంటెన్స్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేస్తాడు. వీళ్ళందర్ నుంచి చాలా నేర్చుకున్నాను.ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటాను. కేతికతో వర్క్ చేయడం లవ్లీ ఎక్స్పీరియన్స్. ఆఫ్ స్క్రీన్ లో మేము చాలా జోవియల్ గా ఉండడం వలన ఆన్ స్క్రీన్ కు బాగా హెల్ప్ అయ్యింది.

దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ట్రైలర్ చూశాక కొన్ని సీన్స్ లలో పవన్ కళ్యాణ్ గారిని ఇమిటెట్ చేశావు అంటున్నారు. అదేమీ కావాలని చేయలేదు. ఆలా జరిగింది. ఖుషి ఎవర్ గ్రీన్ ఫిల్మ్ ఆ సినిమాను మ్యాచ్ చేయాలని ఎప్పుడు అనుకోను. అయన బర్త్ డే కు రిలీజ్ కావడం కూడా యాదృచ్చికమే. నాలుగు ఐదు డేట్స్ మర్చి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము.

పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వందల సార్లు చూసేవాడిని. అయన సినిమాలు రిమేక్ చేయాల్సి వస్తే బద్రి సినిమాను సెలెక్ట్ చేసుకొంటాను. నా సినిమాల సెలక్షన్ నాదే. ఎవరూ ఇన్వాల్వ్ అవ్వరు. నాకు నచ్చితేనే చేస్తాను. ఓసారి వచ్చి చేశాక సక్సెస్ ఫెయిల్యూర్ గురించి పట్టించుకోను. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండను. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీనే నాకు ఫీడ్ బ్యాక్ ఇస్తారు. ఇక నెక్స్ట్ మూవీ శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ తో చేయబోతున్నాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది అని ముగించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here