Youth full Entertainer “Tempt Raja” Movie Review

Release date :-April 16,2021
Cinema rangam :Rating 3/5
Movie Name :- “’Tempt Raja ”
Banner: ARK Arts
Cast: Ranky (Veernala Ramakrishna), Divya Rao (Degree College Fame), Asma, Posani Krishna Murali, Anchor Shyamala, Tarzan, Jayavani, Jogi Brothers (Krishna, Naidu) Gautam Raju, Ashok Kumar, Meghna Chowdhury, Zabardast Bobby, Zabardast Dorababu, Maitri Rajita, Deepti etc.
Music: Satya Sairaj ,Hari Gowra
Editir : B.N.R.
DOP : K.Raju
R.R : Tamiri Shankar
Dialogues: Ranky, G. Ravi, Vijay
P.R.O: – Madhu VR
Excutive Producers : D.Guruvarav
Producers: ARK Arts
Story, Screenplay, Dialogues, Direction: Ranky (Ramakrishna)

అడల్ట్ సినిమాలకు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటారు. ఇలాంటి వారి కోసం తెరకెక్కిన సినిమా “టెంప్ట్ రాజా”. ఇవాళ (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా వుందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే
తన ఫ్రెండ్ బాబీ కు బాగా లేదని హాస్పిటల్ కు తీసుకెళ్తిన కృష్ణ (రాంకీ).. అక్కడ డాక్టర్ పల్లవి(ఆస్మ) ను చూసి ఇష్టపడతాడు. ప్రేమించానని లవ్ ప్రపోజ్ చేస్తాడు. కృష్ణ చెప్పిన కొన్ని లాజిక్ లు నమ్మిన పల్లవి అతని ప్రేమను అంగీకరిస్తుంది. అలా కృష్ణ.. డాక్టర్ పల్లవి తో, కృష్ణ ఫ్రెండ్ బాబీ డాక్టర్ పల్లవి అసిస్టెంట్ లతో గాఢమైన ప్రేమలో మునిగిపోతారు. కొన్ని రోజులకు కృష్ణ ఆటిట్యూడ్ నచ్చక డాక్టర్ పల్లవి అతనికి దూరమైపోతుంది. తరువాత కృష్ణ , దివ్య (దివ్యా రావు) లవ్ లో పడతాడు. తనను పెళ్లి చేసుకోమంటాడు. దివ్యా ఫ్రెండ్ అనూష చెప్పిన మాటలు విని, కృష్ణ తో ఏక్కడికైనా కొద్దీ రోజులు టెస్ట్ డ్రైవ్ కు వెళదాం. ఆ టెస్ట్ డ్రైవ్ లో నువ్వు పాస్ అయితే పెళ్లి చేసుకుందామనే కండిషన్ పెడుతుంది.

అలా కృష్ణ -దివ్య, కృష్ణ ఫ్రెండ్ బాబీ – అనూష లు కలసి టెస్ట్ డ్రైవ్ కోసం ఒక గెస్ట్ హౌస్ కు వెళతారు. ఆ గెస్ట్ హౌస్ లో తనకోరికలు తీరక చనిపోయిన (శిరీష) దెయ్యం రూపంలో వీరి పనికి అడ్డుపడుతూ ఇబ్బందులకు గురిచేస్తుంది. అలా అక్కడ కెళ్లిన తరువాత వీరికి ఎదురైన అనుభవాలు ఏమిటి ? అక్కడ దెయ్యం(శిరీష) చేసిన వీరంగం ఏమిటి, కృష్ణ, బాబీ వీరిద్దరికీ తమ గర్ల్ ఫ్రెండ్స్ పెట్టిన టెస్ట్ డ్రైవ్ లో పాస్ అయ్యారా..లేదా? ఆ దెయ్యం (శిరీష)తన కోరికను తీర్చమని వీరి వెంట ఎందుకు పడుతుంది. ఆ దెయ్యన్ని వీరు ఎలా వెల్లగొట్టారు అనేది తెలుసుకోవాలంటే “టెంప్ట్ రాజా” సినిమా చూడాల్సిందే ..

నటీ,నటుల ప్రతిభ
ఈ సినిమాకి దర్శక హీరో కృష్ణ (రాంకి) అన్నీ తానై.. సినిమాని నడిపించాడు. నేడు అబ్బాయిలు వయాగ్రా వేసుకుంటే ఎలా టెంప్ట్ అయ్యి తిరుగుతారో సహజంగా నటించాడు. అమ్మాయిలతో, ఆంటీలతో రొమాన్స్ చేస్తూ తన నటనతో యూత్ ను టెంప్ట్ చేసి మెప్పించాడు. డైలాగ్స్ కూడా బాగా చెప్పాడు. తను ప్రేమించేవాడికి ఎంతోమంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందని తెలిసినా…అతనే కావాలనుకునే పాత్రలో దివ్య బాగా చేసింది. కృష్ణ ఫ్రెండ్ గా నటించిన బాబీ, బాబీకు జోడీగా నటించిన అనూష లు చాలా చక్కగా నటించారు. పోసాని కృష్ణ మురళి తన పాత్రకు న్యాయం చేశాడు .మిగతా నటీనటులందరూ తమ పరిధిమేర చక్కగా నటించారు.

సాంకేతిక విభాగం పనితనం
కాన్సెప్ట్ పరంగా చూస్తే.. ఇది కరెంట్ ట్రెండ్‌కి బాగా కనెక్ట్ అయ్యేదే. టోటల్ యూత్ అడల్ట్ కంటెంట్  సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఒక మనిషి వయాగ్రా తీసుకొంటే టెంప్ట్ అయ్యి ఎలా ప్రవర్తిస్తాడో చూపిస్తూ అమ్మాయిలు, ఆంటీలతో పక్కపంచుకుంటూ యూత్ కు మత్తెక్కించే సన్నివేశాలతో తెరకెక్కించాడు. బడ్జెట్ పరిధిమేర సాంకేతిక నిపుణులు తమ పనితనాన్ని చూపించారు..సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మిగతా డిపార్ట్‌మెంట్‌ల వర్క్ కూడా అనుకున్న రేంజ్‌లో అయితే లేదు కానీ..పరవాలేదు అని చెప్పుకోవచ్చు. స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం, హీరో.. ఇలా బాధ్యతలన్నీ రాంకీ తీసుకున్నాడు. అన్ని డిపార్ట్‌మెంట్‌ల ను బాగానే హ్యాండిల్ చేశాడనే చెప్పుకోవచ్చు..యూత్ అడల్ట్ కంటెంట్  సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ కు మాత్రమే బాగా కనెక్ట్ అవుతుంది.

Cinemarangam.com 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here