Youth full Message Oriented “Brandy Diaries” Movie Review

Release date :- August 13, 2021
Cinema rangam :- Rating 3.25/5
Movie Name :- “Brandy Diaries”
Banner :-  Collective Dreamers,
Cast : – Sunita Sadguru, Naveen Verma, KV Srinivas, Ravindra Babu, Dinesh Madne etc.
Music :-  Prakash Rex
Editor :- Yoga Srinivas ,
Cinematography :- Eshwaran Tangavel
Producer :- Lella Srikanth,
Writer & Director : – Shivudu

కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం “బ్రాందీ డైరీస్”. ఈ చిత్రం ఆగస్టు 13 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
“బ్రాండీ డైరీస్” ఐదుగురు మధ్య సాగే కథ..హీరో పాత్రలో నటించిన శ్రీను కలెక్టర్ కావాలనే తపనతో ఐ.ఏ.ఎస్ ప్రిపరేషన్ కోసం గుంటూరు నుండి హైదరాబాద్ కు వచ్చి భవ్య ప్రేమలో పడి తన ఐ.ఏ.యస్ లక్ష్యాన్ని మరచి తాగుడుకు బానిస అవుతాడు. శేఖర్ అనే వ్యక్తి  డిప్యూటీ ఎమ్మారో గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి, కానీ పై అధికారులు అవినీతి పనులు చేయడం అతనికి నచ్చదు. గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి కూడా  ఏమీ సంపాదించలేక తాగుడుకు బానిసగా మారడంతో భార్య రోజు గొడవ పడుతుంటుంది. జాన్సన్ పనీ పాట లేని వ్యక్తి, వర్మ ఓ జీనియస్. కోటి ఒక చెప్పుల కంపెనీలో పని చేస్తుంటాడు. ఇలా వివిధ రంగాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను మందు స్నేహితులను చేస్తుంది. తాగి వారి బాధలను కష్టాలను ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. వర్మ తన భార్య తనను మోసం చేసిందని కిచేన్ లో సిలిండర్ పేలేలా చేసి  పెళ్లి మీద నమ్మకం లేక తాగుడుకు అలవాటు పడిన వ్యక్తి. ఇలా ఐదు పాత్రల ద్వారా దర్శకుడు చెప్పిన  లైఫ్ జర్నీనే “బ్రాండీ డైరీస్”. మరి ఈ సినిమాకు బ్రాండీ డైరీస్ అనే పేరు ఎందుకు పెట్టారు. మరి ఈ ఐదుగురు జీవితాలు మద్యం ప్రభావంతో ఎలాంటి మలుపులు తిరిగాయి, శ్రీను తన ప్రేమను దక్కించుకుని ఐ.ఏ.యస్ అయ్యాడా? లేదా అనేదే మిగిలిన కథ.

నటీనటుల పనితీరు
ముఖ్య పాత్రలుగా నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీను, భవ్య మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కు థియేటర్ లో యూత్ ఆడియెన్స్ రెస్పాన్స్ బాగుంది. భవ్య పాత్రలో సునీత ఆకట్టుకుంది. అలాగే ఇళ్లు, పిల్లలు, కుటంబాన్ని పట్టించుకుకోని జాన్సన్ లాంటి పాత్రలను మనం ఎందరినో చూసి ఉంటాం. తన ఉద్యోగ ధర్మంగా పేదలకు సాయం చేయాలని చూసే డిప్యూటీ ఎమ్మార్వో శేఖర్ పాత్ర కూడా బాగుంది. శ్రీను హైదరాబాద్ నుండి తన పల్లెటూరికి వెళ్లి  వ్యవసాయం చేసుకుంటూ అక్కడ జరిగిన  సంఘటనలు చూసి రియలైజ్  అయ్యే పాత్రలో శ్రీను రియలిస్టిక్ చాలా చక్కగా  నటించాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ప్రేమ, పెళ్లి, స్నేహం, కెరీర్ ఇలా చాలా అంశాలను మద్యం నేపథ్యంతో ఐదు విభిన్న పాత్రల ద్వారా జీవితాన్ని వివరించాలని చూశాడు దర్శకుడు శివుడు. ప్రస్తుత పరిస్థితుల్లో నేటి యూత్ మద్యానికి అలవాటు పడితే  తమ కోసం ప్రాణంగా  ప్రేమించే, అమ్మ, భార్య, పిల్లల  ప్రేమకు దూరమై  జీవితంలో ఎం కొల్పోతారు అనే విషయాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్లు సినిమాను అద్భుతంగా  తెరకెక్కించారు. తన జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఇందులో పొందుపరిచాడు దర్శకుడు. ప్రకాష్ రెక్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కథ ,నటీనటుల ఎంపికలో దర్శకుడి టేస్ట్ బాగుంది.నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు. వర్మ పాత్ర చాలా రియలిస్టిక్ గా ఉంది. తను చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తాయి.  మందుకు బానిస అయిన వారు మరియు అసలు మందు తాగనివారూ కూడా అందరూ ఖచ్చితంగా చూడవలసిన సినిమా. “బ్రాండీ డైరీస్” సినిమా.ఫ్యామిలీతో  పాటు కలసి చూడవలసిన సినిమా ఇది అందరికీ తప్పక నచ్చుతుంది.

        Cinenarangam.com..Rating 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here