Youthful Entertainer ‘OC’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : కౌండిన్య ప్రొడక్షన్స్
సినిమా : ‘ఓసి’.
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 07.06.2024:
నిర్మాత: బీవీఎస్
దర్శకత్వం: విష్ణు బొంపెల్లి
నటీనటులు: హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి, రోయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: సాయిరాం తుమ్మలపల్లి
సంగీత దర్శకుడు: భోలే శివాలి
కొరియోగ్రాఫర్: సత్య మాస్టర్
పీఆర్ఓ: హరీష్, దినేష్


టాలీవుడ్‌లో యంగ్ మేకర్లు వండర్లు క్రియేట్ చేస్తున్నారు. కొత్త దర్శకులు భిన్న కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను తీస్తూ విజయాలు అందుకుంటున్నారు. కొత్త తరహా చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్ళు సినిమాలో ఎలా రాణించారనే కథాంశంపై తెరకెక్కిన సినిమా “ఓసి”. కౌండిన్య ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి ప్రధాన నటీ నటులుగా విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో బీవీఎస్ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “ఓసి”. ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
ఓ బస్తీలో అనాథలైన రాక్ (హరీష్ బొంపెల్లి), మాగ్నైట్ (రాయల్ శ్రీ), కమల్ హాసన్ (లక్ష్మీ కిరణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీరికి నర్సింగ్ అనే వ్యక్తి అండగా ఉంటాడు. బస్తీలో చిన్న చితక పనులు చేసుకునే వీరు ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని తపత్రయ పడుతుంటారు. రాక్ కు బాలరాణి(మాన్య సలాడి)తో మంచి స్నేహం ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు సినిమా ఆడిషన్స్ ఇస్తుంటారు. సందీప్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అవుతాడు, మందు ఇప్పిస్తే అవకాశం ఇప్పిస్తా అంటాడు. ఇలా కొన్ని సార్లు జరిగిన తరువాత ఈ ముగ్గురి దగ్గర డబ్బులు ఉండవు. దాంతో బాబు రావు అనే గల్లీ రౌడీని బురిడి కొట్టిస్తారు. దీంతో వీరికి కష్టాలు మొదలౌతాయి. వీరికి అండగా ఉన్న నర్సింగ్‌ను చంపేస్తారు. దీంతో వీరు ప్రాణ భయంతో పారిపోతారు. అలా పారిపోయిన వీరు తమ లక్ష్యం కోసం ఏం చేశారు. బాబురావు నుంచి ఎలా తప్పించుకున్నారు. ఇంతకీ సినిమా అవకాశం వచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే “ఓసీ” సినిమా చూడాల్సిందే.

నటీనటుల  పనితీరు
హీరోగా పాత్రలో నటించిన హరీష్ బొంబెల్లి వెండితెరకు నూతనంగా పరిచయం అయినా యాక్టింగ్ పరంగా మెప్పించారు. చాలా మెచ్యూర్‌డ్ గా నటించారు. యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టాడు. అలాగే కొన్ని సీన్స్‌ లో అద్భుతంగా చేశాడు. ఆడిషన్స్ ఇచ్చే సీన్స్ చాలా బాగా చేశాడు. కచ్చితంగా వెండితెరపై మంచి క్యారెక్టర్లు పడితే నిలుచుండిపోయే ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ అద్భుతంగా నటించారు. వీరిద్దరిది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు. తెరపై కనిపించిన ప్రతీసారి మెప్పించారు. అలాగే హీరోయిన్ మాన్య సలాడిది కూడా మంచి పాత్రే ఉన్నంత లో చాలా బాగా చేసింది. అలాగే బాబు రావు పాత్ర చేసిన జీవన్ నవ్వించాడు, కోపం తెప్పించాడు, భయపెట్టాడు. మిగితా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని రాసుకున్న ఈ కథ ఇది. సినిమానే ప్రపంచం అని బతికే కుర్రాళ్లు ఎలాంటి కష్టాలు పడ్డారు తమ లక్ష్యం, మధ్యలో రివేంజ్, స్నేహం ఈ ముడింటిని బ్యాలెన్స్‌డ్‌గా చేస్తూ మంచి హాస్యం మరియు భావోద్వేగాలతో సినిమాను రెండు భాగాలుగా తీసుకువెళ్లి ప్రేక్షకులను కట్టిపడేయడంలో దర్శకుడు విష్ణు బొంబెల్లి సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సంగీత దర్శకుడు భోలే శివాలి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని చెప్పచ్చు. సినిమాటోగ్రాఫర్ సాయిరాం తుమ్మలపల్లి కెమెరా పనితనం బాగుంది.చిత్ర పరిశ్రమలో స్టార్ల కొడుకులే హీరోలవుతారు అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. ఎడిటింగ్ పనితీరు బాగుంది. కౌండిన్య ప్రొడక్షన్స్ పతాకంపై ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాత బీవీఎస్ నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్లైమాక్స్ చాలా భావోధ్వేగానికి గురిచేస్తుంది. చూసే ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిళ్లుతాయి.
గుడ్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓసి’ సినిమాను నమ్మి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి  ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.

Cinemarangam.Com Review Rating .. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here