Youthful family entertainer “Nede Vidudala” Movie review

Cinemarangam.Com
బ్యానర్ : ఐకా ఫిల్మ్ ఫాక్టరీ
సినిమా : “నేడే విడుదల “
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 10.03.2023
డైరెక్టర్: రామ్ రెడ్డి పన్నాల
నిర్మాత: నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్
సంగీతం: అజయ్ అరసాడ
నటీనటులు: అసిఫ్ ఖాన్, మౌర్యాని తదితరులు.
సినిమాటోగ్రఫీ: .సి హిచ్ మోహన్
పీఆర్ఒ: అప్పాజీ


యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటాయి. వాటికి కాస్త మెసేజ్ ఇచ్చే కంటెంట్ జోడిస్తే… బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయి. స్టోరీ పాయింట్ కొంచెం కొత్తగా ఉండి… దానికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని… ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా తెరకెక్కిస్తే ఆ సినిమా విజయం సాధిస్తుంది. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో విడుదల అయిన చిత్రమే ‘నేడే విడుదల’.ఐకా ఫిల్మ్ ఫాక్టరీ పతాకంపై అసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు రామ్ రెడ్డి పన్నాలను పరిచయం చేస్తూ
నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “నేడే విడుదల” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి


కథ:

సినిమాలను ప్రమోషన్ చేసే ఓ కంపెనీలో సిద్ధూ(అసిఫ్ ఖాన్) కొత్తగా జాయిన్ అవుతాడు.అదే ఆఫీస్ లో తన చిన్న నాటి ఫ్రెండ్ హారిక(మౌర్యాని)ని సీనియర్ న్యూస్ రీడర్ గా పని చేస్తుంటుంది. అయితే తన ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన సిద్దును ఆఫీస్ హెచ్ ఓ డి వచ్చి హారికను పరిచయం చేస్తాడు .అయితే చినప్పుడు ఇష్టపడినన వ్యక్తే సిద్దు అని తెలుసుకున్న హారిక రాత్రి సిద్దు కు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామని అంటుంది. ఈ రోజే జాయిన్ అయిన నీ గురించి ఏమి తెలియదు టైం కావాలి అంటాడు. మరో వైపు తను పని చేస్తున్న ఛానెల్ కు మంచి పేరు వచ్చేలా లైవ్ లో నిర్మాత సత్యానంద్ (డైరెక్టర్ కాశీ విశ్వనాథ్) తో ఇంటర్వ్యూ చేద్దాం అని మేనేజ్మెంట్ ఐడియా ఇస్తాడు. ఆ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడంతో నిర్మాత సత్యానంద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీకి ప్రమోట్ చేయాల్సిందిగా సిద్ధూని కోరుతాడు. సినిమాని ప్రమోట్ చేసి… ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చేంతగా మూవీకి హైప్ తీసుకొస్తాడు సిద్ధూ. అంత బాగా ఓపెనింగ్స్ వచ్చిన సినిమా… అనుకోకుండా డౌన్ ఫాల్ కావడంతో నిర్మాత సత్యానంద్ చనిపోతారు. అంత పెద్ద నిర్మాత మరణించడం సిద్ధూ జీర్ణించు కోలేకపోతాడు. అసలు నిర్మాత చనిపోవడానికి కారణాలు ఏంటి? అతని మరణం వెనుక ఎవరి హస్తం ఉంది ? అంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకి ఉన్నట్టుండి కలెక్షన్లు పడిపోవడానికి గల కారణాలను సిద్ధూ పరిస్కరించాడా లేదా ?అనేది తెలుసుకోవాలి అంటే “నేడే విడుదల” సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు

హీరో ఆసిఫ్ ఖాన్ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఓ బాధ్యతగల యువకుని పాత్రలో చక్కగా నటించారు. యాక్షన్, రొమాంటిక్ సీన్స్ లో అలరించాడు. అతనికి జోడీగా నటించిన మౌర్యాని అటు గ్లామర్… ఇటు పర్ ఫార్మెన్స్ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నిర్మాత పాత్రలో దర్శకుడు విశ్వనాథ్ కాసేపు కనిపించినా… మెప్పించారు. హీరో స్నేహితులగా నటించిన ఇద్దరూ సెకెండాఫ్ లో హీరోయిన్ ఇంట్లో వచ్చే ‘శాకాహారం’ సీన్స్ లలో నటించి చాలా చక్కగా నవ్వించారు.ముఖ్యంగా సినిమా తారలను అనుకరించే పాత్రలో నటించిన నటుడు బాగా నవ్వించారు. హీరో తండ్రి పాత్రలో అప్పాజీ అంబరీషా తన పాత్ర పరిధి మేరకు నటించారు. మిగతా పాత్రల్లో నటించిన మాధవి, టి.ఎన్.ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


సాంకేతిక నిపుణుల పనితీరు

దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల “నేడే విడుదల” వంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నాడని చెప్పవచ్చు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసిన సినిమా… రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ కావడం వల్ల నిర్మాతలు, సినీ పరిశ్రమ ఆర్థికంగా ఎలా నష్టపోతారు.అనే అంశాన్ని ఆ అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని… దాని చుట్టూ ఆసక్తికరమైన కథ… కథనంతో పాటు…ఇందులో లవ్, కామెడీ, యాక్షన్, చక్కటి ఏమోషన్స్ వంటి అన్ని అంశాలతో తీసిన ఈ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకులకు కలిగేలా చాలా చక్కగా తెరాకెక్కించాడు.దర్శకుడికిది మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిలా తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.సంగీత దర్శకుడు అజయ్ అరసాడ అందించిన సంగీతం బాగుంది .సి హిచ్ మోహన్ చారి అందిచింన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఆహ్లదపరిచే సంభాషణల ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ పనితీరు బాగుంది.ఇందులో కథతో పాటు వినోదం, ఎమోషన్స్, వాల్యూస్, లతో నిర్మాతలు నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ ఖర్చుకు వెనుకాడకుండా అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో ఈ సినిమా చాలా బాగా నిర్మించారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ “నేడే విడుదల” సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here