Youthful love entertainer “Mr Kalyan” Movie Review

Cinemarangam.Com
సమర్పణ : శ్రీమతి ఉష శ్రీ
బ్యానర్ : శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్
సినిమా : “Mr కళ్యాణ్”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 10.03.2023
డైరెక్టర్: పండు
నిర్మాత: సుబ్బారెడ్డి
సంగీతం: సుక్కు
నటీనటులు: మాన్యం కృష్ణ, అర్చన, రాజ్ వర, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి
ఎడిటర్: వినోద్ అద్వయ్
డాన్స్: అనీష్
ఫైట్స్: మల్లేష్
పీఆర్ఒ: శ్రీధర్

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు కొత్త కంటెంట్ ఉన్న సినిమాలనే నే ఆదరిస్తున్నారు. దర్శకులు కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు ఇప్పటి వరకు రానటువంటి కొత్త కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆలా వచ్చిన కొత్త కథే “Mr.కళ్యాణ్”. శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబ్బారెడ్డి నిర్మించిన చిత్రం “Mr.కళ్యాణ్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ

హీరో కళ్యాణ్ (కృష్ణ మాన్యం)మేల్ ప్రాసిట్యూట్ ( కాల్ బాయ్ & ప్లే బాయ్ )గా సిటీలో లైఫ్ లీడ్ చేస్తుంటాడు.ఏ అమ్మాయి కాల్ చేసినా వారింటికెళ్లి సర్వీస్ చేస్తుంటాడు.
కళ్యాణ్ చిన్నప్పటి ఫ్రెండ్ సారిక (అర్చన) తో పరిచయంతో వారి మధ్య చక్కని రిలేషన్ ఏర్పడడంతో వారిద్దరూ లవర్స్ అవుతారు.అయితే కళ్యాణ్ చిన్న తనంలోనే అమ్మ చనిపోవడంతో తండ్రి వేరే ఆమెను పెళ్లి చేసుకుంటాడు.. దాంతో హీరోకు పేరెంట్స్ ఉన్నా వారితో పెద్దగా అటాచ్ మెంట్ ఉండదు. అలా కాల్ బాయ్ గా వెళ్తున్న కళ్యాణ్ కు కొంతమంది అమ్మాయిల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకొంటాడు..అదే సిటీలో చాపెల్ ( సప్తగిరి ) ఒక కార్పొరేట్ వ్యవస్థ పెట్టి కాల్ బాయ్ కంపెని రన్ చేస్తూ ఉంటాడు, అయితే కాల్ బాయ్ గా వెళ్తున్న కళ్యాణ్ గురించి తెలుసుకొని ఈ సిటీ లో నాకు పోటీ ఉండకూడదు అని తను రన్ చేస్తున్న తన కంపెనీలో జాన్ అవ్వమని కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేస్తాడు చాపల్ కళ్యాణ్ అతని మాట వినడు.దాంతో కళ్యాణ్ అడ్డు తొలగించు కోవాలనే కారణంతో కొన్ని ఇబ్బందులు పెట్టినా తన దారికి రాకపోవడంతో చివరకు కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ సారిక కు తను చేస్తున్న పని గురించి చెప్తాడు. దాంతో నమ్మని సారిక కళ్యాణ్ కు ఫోన్ చేసి కాల్ బాయ్ సర్వీస్ కావాలని ఎక్కడికి రావాలో అడ్రెస్స్ చెపుతుంది. కళ్యాణ్ అక్కడకు వచ్చి సారిక కు దొరికిపోతాడు. దాంతో సారిక కళ్యాణ్ ను చీ కొట్టి వెళ్ళిపోతుంది. ఆ తరువాత సారిక కళ్యాణ్ ను ఎలా ట్రీట్ చేసింది ? కళ్యాణ్ మరియు చాపెల్ చివరికి ఏమయ్యారు ? అసలు కళ్యాణ్ కాల్ బాయ్ గా ఎందుకు మారాడు? మారాడానికి గల బలమైన కారణాలు ఏంటి? డీప్ లవ్ లో ఉన్న కళ్యాణ్,సారికలు ఒక్కటయ్యారా లేదా? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే “Mr కళ్యాణ్” సినిమా తప్పక చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు

జెట్టి సినిమా తర్వాత చేసిన హీరో హీరో కృష్ణ మాన్యం కళ్యాణ్ పాత్రలో వన్ మ్యాన్ షో లా స్టూడెంట్ గా, అమాయకుడిగా, కాల్ బాయ్ గా మూడు డిఫరెంట్ షేడ్స్ లలో కూడా తన హావ భావాలతో పాటు పాటలు, ఫైట్స్, ఏమోషన్స్ ఇలా అన్ని షేడ్స్ లో చాలా చక్కగా నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. సారిక పాత్రలో నటించిన హీరోయిన్ అర్చన తన హావ భావాలతో చాలా బాగా నటించిడమే కాకుండా తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది.సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. సప్తగిరి కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పాత్రల్లో నటించిన ధనరాజ్, బాబీ వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు.ఇంకా కళ్యాణ్ కు ఆశ్రయం ఇచ్చిన రాజ్ వర ఫ్రెండ్ గా , అలాగే తాగుబోతు రమేష్, తదితరులు అంతా కూడా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు

దర్శకుడు పండు “Mr.కళ్యాణ్” వంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొని అమ్మాయిలు మరియు మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలనే విధంగా ఇందులో లవ్, కామెడీ, యాక్షన్, చక్కటి ఏమోషన్స్ వంటి అన్ని అంశాలతో తీసిన ఈ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకులకు కలిగేలా చాలా చక్కగా తెరాకెక్కించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, సెకండాఫ్ లో హ్యూమన్ ఎమోషన్స్, బంధాలు వాటి విలువల గురించి అద్భుతంగా చూపించాడు .దర్శకుడికిది మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిలా తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి.ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రధాన పాత్ర పోషించాయి. మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు ఈ సినిమాకు ప్రేక్షకులను ఆకట్టుకొనే విధమైన పాటలే కాకుండా చక్కటి నేపధ్య సంగీతంతో పాటు మంచి సాహిత్యం అందించాడు. నానాజి మరియు ఎమ్.వి.గోపిల ఈ సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో ఒక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చెయ్యడం జరిగింది.వీరంతా కొత్త వారే అయినప్పటికీ ఎంతో అనుభవం కలిగిన టెక్నిషన్స్ లా ఈ సినిమాకు పని చేసి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసికెళ్లారు అని చెప్పవచ్చు. వినోద్ అద్వయ్ ఎడిటింగ్ పని తీరు బాగుంది. సినిమాకు తగ్గట్టు షావాలింన్ మల్లేష్ మాస్టర్ కంపోజ్ చేసిన నాలుగు ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. కొరియోగ్రఫర్ అనిష్ మాస్టర్ చేసిన పాటలు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో బాగా తీశారు. శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ లో వచ్చిన “Mr కళ్యాణ్” మొదటి సినిమా అయినా ఈ సినిమా చూసిన తరువాత నిర్మాత ఎన్. వి. సుబ్బారెడ్డి మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి అని స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో కథతో పాటు వినోదం, ఎమోషన్స్, వాల్యూస్ ,లతో పాటు ప్రేక్షకులకు చక్కటి మెసేజ్ ఇవ్వడమే కాకుండా నిర్మాత ఎన్. వి.సుబ్బారెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో ఈ సినిమా చాలా బాగా నిర్మించారు. డిఫరెంట్ మూవీస్ కావాలని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం “Mr కళ్యాణ్” సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here