Youthful triangle love story ‘Baby’ Movie review

Cinemarangam. Com
బ్యానర్ : మాస్ మూవీ మేకర్స్
సినిమా : “బేబీ”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 14.07.2023
నిర్మాతః ఎస్.కే.ఎన్, రచన,
దర్శకత్వంః సాయి రాజేశ్.
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష తదితరులు
సంగీతం : విజయ్ బుల్గానిన్,
ఎడిటింగ్ : విప్లవ్ నైషధం,
సినిమాటోగ్రఫీ : ఎమ్ఎన్ బాల్ రెడ్డి,
కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని
పి.ఆర్.ఓ : జిఎస్.కే మీడియా, ఏలూరు శీను,


ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 14 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “బేబీ”.. సినిమా ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి


కథ

“బేబీ` ఒక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఒకే బస్తీలో ఎదురెరు ఇండ్లలో నివసించే ఆనంద్‌ (ఆనంద్‌ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవి చైతన్య)లు ఒకే స్కూల్ లో చదువుకుంటుంటారు. అయితే వైష్ణవి ఆనంద్ ని ప్రేమిస్తుంటుంది. ఈ విషయం తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న ఆనంద్ కూడా వైష్ణవి ప్రేమలో పడతాడు.ఇలా వీరిద్దరూ స్కూల్‌ డేస్‌ నుంచి ప్రేమించుకుంటారు.అయితే ఆనంద్ సరిగా చదువుకోక పోవడంతో 10 వ తరగతి ఫెయిల్ అయితే వైష్ణవి పాసయ్యి కాలేజీకి వెళుతుంది. దాంతో ఆనంద్ ఆటో నడుపుకుంటూ వైష్ణవిని కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు.అయితే ఆనంద్ వైష్ణవి ని ఒక కిస్, ఒక హగ్ ఇవ్వమని ఎన్ని సార్లు అడిగినా పెళ్లి తర్వాతే అన్నీ అంటుంది. వైష్ణవి ఇంటర్ తర్వాత బి.టెక్ లో జాయిన్ అవ్వడంతో తన ఆటో పేపర్స్ పెట్టి ఫైనాన్స్ తీసుకొని మొబైల్ కొని ఇస్తాడు. కాలేజీకి వెళ్లిన వైష్ణవిని అందంగా లేదని బస్తీల అమ్మాయిలా ఉందని చిన్న చూపు చూస్తుంటారు.ఇదే సమయంలో విరాజ్ (విరాజ్ అశ్విన్) తో వైష్ణవి పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా ఆమెని ఇష్టపడతాడు.విరాజ్ ఫ్రెండ్స్ ద్వారా ఆమెని అందంగా పాష్ గా తయారు చేస్తారు.ఆ తరువాత తన ఫ్రెండ్స్ ద్వారా పబ్ కు వెళ్లి తాగడం అలవాటు చేసుకుంటుంది. అయితే విరాజ్ ఇచ్చే గిఫ్ట్ లను ఫ్రెండ్ ఇచ్చిందని ఇంట్లోను, ఆనంద్ కు అబద్దం చెపుతుంది. వైష్ణవి కి ఆనంద్ అంటే చచ్చేంత ప్రేమున్నా విరాజ్ ఇచ్చే గిఫ్ట్స్ ట్రాప్ లో పడి విరాజ్ కు దగ్గరవుతూ ఆనంద్ కు దూరం పెడుతుంది ఆ తరువాత పబ్ లో జరిగిన ఒక సంఘటనతో ఒక నైట్ విరాజ్ తో పడుకొనే పరిస్థితి వస్తుంది వైష్ణవికి.చిన్నప్పటి నుండి ప్రేమించిన ఆనంద్ ఎన్ని సార్లు అడిగినా ఒక్క ముద్దు, ఒక్క హగ్ కూడా ఇవ్వని వైష్ణవి విరాజ్ తో పెట్టుకున్న డీల్ కు ఒప్పుకుందా లేదా? చివరికి వైష్ణవి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? వారిద్దరి ప్రేమ మధ్య నలిగిపోతున్న వైష్ణవి చివరికి ఎవరికి దగ్గరైంది అనేది తెలుసుకోవాలి అంటే “బేబీ” సినిమా తప్పక చూడాల్సిందే…


నటీనటుల పనితీరు

ఆనంద్‌ పాత్రలో నటించిన ఆనంద్ దేవరకొండ తన పాత్రలో జీవించాడు. పాత్రని రక్తికట్టించాడు. అద్భుతమైన నటన ప్రదర్శించాడు. చాలా సహజంగా అతని నటన సాగుతుంది. అంతే బాగా ఆకట్టుకుంటుంది. అంతే కన్నీళ్లు పెట్టిస్తుంది. నటుడిగా పది మెట్లు ఎక్కినట్టుగా ఆనంద్‌ నటన ఉండటం విశేషం. మరోవైపు వైష్ణవి పాత్రలో నటించిన వైష్ణవి చైతన్య తన పాత్రకి ప్రాణం పోసింది హీరోయిన్‌గా తనకిది తొలి సినిమానే అయినా సినిమాని తన భుజాలపై నడిపించింది. డీగ్లామర్ గా .. పాష్ గా కనిపించినా రెండు లవ్ స్టోరీలలో కూడా తన సహజమైన నటనతో అత్యద్భుతంగా నటించింది వైష్ణవి. రిచ్ అబ్బాయి గా నటించిన విరాజ్‌.. ఆకట్టుకొనే నటనతో చాలా బాగా చేశారు. నాగబాబు, వైవా హర్ష, ఇలా మిగిలిన నటీనటులు అందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా నేటి యూత్‌ ఫాస్ట్ కల్చర్‌ అనే ముసుగులో ఎలాంటి తప్పులు చేస్తున్నారు. దాని ద్వారా వారిలో జరిగే పరిణామాలు ఏంటి అనే ఒక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీని సెలెక్ట్ చేసుకొని యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు సాయి రాజేష్‌. నిర్మాత ఎస్.కె.ఎన్.అయితే ఇప్పటివరకు ఎన్నో ట్రాయాంగిల్‌ లవ్ స్టోరీస్‌ వచ్చినా…ఈ సినిమా మాత్రం కచ్చితంగా ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది.

 

ఈ సినిమాకి మ్యూజిక్‌ ప్రధాన బలం. మ్యూజిక్‌ డైరెక్టర్‌ విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం ఆద్యంతం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఎదురుగా ఇంతదంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వూ..ఎదసడే హద్దులు దాటే చూడూ చూడూ…కుదురుగా ఉందామన్నా ఉంచట్లేదే నన్నే నువ్వు అనే పాటలు అన్నీ వినసొంపుగా ఉన్నాయి .బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మరో హైలైట్‌. విజయ్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మరో పిల్లర్‌గా నిలుస్తుంది.అలాగే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి ప్రధాన బలం. ఎంఎన్‌ బాల్‌ రెడ్డి కెమెరా వర్క్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజువల్‌ ట్రీట్‌లా ఉంది. డైలాగులు సినిమాకి ఇంకో బలం. `గుండెలపై కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వరూ కొట్టలేరు` అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌లు, ఆనంద్‌ దేవరకొండ డైలాగులు ఆకట్టుకుంటాయి. మనసుని హత్తుకుంటాయి. ఆలోచింప చేస్తాయి. గుండెల్ని పిండేస్తాయి.విప్లవ్ నైషధం ఎడిటింగ్‌ పనితీరు బాగుంది. మాస్‌ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత ఎస్‌కేఎన్‌ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన విలువలు బాగున్నాయి. యూత్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్న యూత్‌ఫుల్‌ ట్రాయాంగిల్‌ లవ్‌ స్టోరీ బేబీ సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here