“90 ml” Pre Release event

కార్తికేయ క్రియేటివ్ వ‌ర్స్  బ్యాన‌ర్‌లో ‌ యంగ్ హీరో  Rx100 మూవీ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా,నేహా సోలంకి హీరోయిన్లుగా నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాత‌గా లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న “90 ml”చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో అజయ్ భూపతి, సందీప్ కిషన్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా

డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ….

కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నాకొసమే పుట్టింది.కార్తికేయ పవర్ ఏంటో నాకు మాత్రమే తెలుసు,rx100 ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీ హీరో నా సినిమాకి బాగా సెట్ అవుతాడని శేఖర్ రెడ్డి నాకు కాల్ చేసాడు,వెంటనే కార్తికేయ తో కలిపించి కథ వినిపించగానే ఈ కథ చేద్దాం అని ఫిక్స్ అయ్యారు,అప్పటినుండి ఇప్పటివరకు అదే మాట మీద ఉన్నారు,అలా చాలా తక్కువ మంది ఉంటారు,శేఖర్ రెడ్డి కీ ఈ చిత్రం మంచి పేరు తీసుకు రావాలి. క్వాటర్ థియేటర్ కి తీసుకెళ్లకండి సినిమా చూసి ఇంటికొచ్చి తాగండి.డిసెంబర్ 5 రిలీజ్ అయ్యే సినిమా తప్పకుండా చూడండి అని అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ…..

ముందుగా ఈ విషయం మాట్లాడుతున్నందుకు ఏమి అనుకోకండి నిన్న జరిగిన ప్రియాంక రెడ్డి సంఘటన నాకు నిజంగా భయం వేసింది,
ట్విట్టర్ లో ట్విట్ చేయడం తప్ప ఏమీ చేయలేమా అని బాధ పడ్డాను,ఈ రోజు టీవీ లో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్లి పోరాడిన వారిని చూసిన వెంటనే గర్వంగా అనిపించింది వాళ్లకు అభినందనలు తెలిపారు.కార్తికేయ నిజంగా ఒక తమ్ముడు లాంటి వాడు,నేను ఒకవేళ డైరెక్టర్ అయితే కార్తికేయ లాంటి హీరో తో సినిమా చేస్తాను,ఒక హీరో జనాల్లోకి వెళ్లడం కష్టం కానీ కార్తికేయ జనాల్లోకి వెళ్ళాడు. ప్రస్థానం తర్వాత నాకు ఫస్ట్ టైం కథ చెప్పిన వ్యక్తి డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఆయనకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ….

ఆడియో ఫంక్షన్ లో సింగర్ కి ఇంత వాల్యూ దొరకడం హ్యాపీగా ఉంది,అనూప్ సార్ మంచి మ్యూజిక్ ఇచ్చారు,ఒక సింగర్ ఇలా స్టేజ్ పై మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు,
ఈ సినిమా పెద్ద హిట్ అయి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ….

నేను ఇక్కడ నిలబడటానికి ముఖ్య కారణం అజయ్ భూపతి, కార్తికేయ ను దగ్గర ఉండి కథను వినిపించేలా చేసాడు,అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు,5 రోజుల్లోనే సాంగ్స్ అన్ని ఇచ్చేసాడు అనూప్.చంద్రబోస్ గారు ఈ సినిమాకి రంగస్థలం తర్వాత సింగిల్ కార్డ్ లిరిక్స్ రాసారు.డైరెక్షన్ టీమ్ మంచి హెల్ప్  చేసింది.పాటలు హిట్ అయినట్లే సినిమా కూడా మంచి హిట్ అవుతుంది.ఈ కథను కార్తికేయ విన్నప్పటినుండి నేను ఉన్నాను అని మంచి ధైర్యం ఇచ్చారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ…..

ఆడియో ఫంక్షన్ కి వచ్చినట్లు లేదు ఒక ఫామిలీ ఫంక్షన్ కి వచ్చినట్లు ఉంది.డైరెక్టర్ ఈ కథ కంటే ముందు వేరే ఫ్యామిలీ కథ చెప్పడానికి వచ్చారు,ఇంకొక కథ ఉందని ఉదయం,మధ్యాహ్నం,రాత్రి ఇలా మూడు సార్లు 90 వేస్తేనే బతికే డీసీజ్ ఉన్న  వ్యక్తి కథ అని చిన్న లైన్ చెప్పాడు,హీరోయిన్ ఫాదర్ ఇంట్లో మొక్కలు నాటి పక్కింటి లో నుండి మందు వాసన కూడా రాకుండా ఇంటిని చూసుకుంటూ ఉండే క్యారెక్టర్ ఆయన కూతురితో సాగె లవ్ స్టోరీ చెప్పేసరికి నాకు బాగా నచ్చి చెప్పమన్నాను ఆయన ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పారు బాగా కొన్ని రోజులు తర్వాత కంప్లీట్ కథను విన్న తరువాత నవ్వి నవ్వి కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి.ఇది పెద్ద హీరోలు చేయాల్సిన స్టోరీని నేను చెయ్యడం చాలా హ్యాపీ గా ఉంది.మా ఫామిలీ నేను బాగుపడాలనే నాకోసం Rx100 సినిమా తీశారు,దాని తరువాత ఈ కథ నచ్చి చేస్తున్నారు.శేఖర్ రెడ్డి గారికి 12 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయనకు ఛాన్స్ వచ్చి పోయాయి ఇప్పుడు కూడా స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు ఫైనల్ గా సెట్అయింది.నాతోపాటు శేఖర్ రెడ్డి గారికి మంచి హిట్ రావాలి.అందరూ మనస్ఫూర్తిగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు,వాళ్లందరూ కష్టపడుతూ ఫైనల్ గా సినిమా హిట్ అయితే కార్తికేయ హిట్ కొట్టాడు అంటారు.నేను ఏ కేరెక్టర్ చేసిన ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు థాంక్యూ,మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి.ఈ సినిమా ఆల్కహాల్ సపోర్ట్ చేస్తుందా అని అందరికి డౌట్ ఉంది,అలా ఏమీ ఉండదు అండి, ఈ సినిమా వలన ఆల్కహాల్ తీసుకునే వారు తగ్గుతారు.హీరోయిన్ నేహా కొన్ని సీన్స్ లో భూమిక లా కనిపిస్తోంది, కొన్ని ఫ్రేమ్స్ లో ఒక్కడు,ఖుషి లో భూమిక లా ఉంటుంది,ఆమె లానే పెద్ద హీరోహిన్ అవ్వాలని కోరుకుంటున్నా మా సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here