పవన్ రీ ఎంట్రీ కంఫర్మ్!

pawankalyan

పవర్ స్టార్ మళ్లీ నటించబోతున్నారన్న దానిపై బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ప్రకటించారు.. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ న్యూస్ ని కన్ఫామ్ చేశారు.. పవన్ కళ్యాణ్ “పింక్” సినిమాని రీమేక్ చేయడం పక్కా అంటూ ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు. కాగా, బాలీవుడ్‌లో “పింక్” మూవీ సూపర్ హిట్ అందుకుంది. బిగ్‌బీ అమితాబ్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ మూవీని బోనీ కపూర్ నిర్మించారు. ఆ తర్వాత తమిళంలో అజిత్‌ను హీరోగా పెట్టి రీమేక్ చేసి మరోసారి హిట్ అందుకున్నారు. ఇక టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజుతో కలసి బోనీకపూర్ ఈ రీమేక్‌ను నిర్మించనున్నారు. వేణూ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. మరోవైపు 2018లో వచ్చిన “అజ్ఞాతవాసి” సినిమాయే పవన్ కల్యాణ్ నటించిన చివరి సినిమా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీకి మాటల మాంత్రికుడే మాటలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ పని పూర్తిచేశారని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన “సైరా నరసింహారెడ్డి” మూవీకి పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here