Erracheera Director Another mass action family entertainer..CSSB2 starts from June 19th

ఎర్రచీర చిత్రంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు, ఇప్పుడు మరో యాక్షన్ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న CSSB2 చిత్రం జూన్ 19వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది.

పూర్తి స్థాయి మాస్ యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ముఖ్యంగా తండ్రి-కొడుకు అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించే ఈ చిత్రం ప్రతి కుటుంబానికి దగ్గరయ్యేలా ఉంటుందని సుమన్ బాబు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఎర్రచీర చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ చిత్రం 294 స్క్రీన్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది. త్వరలోనే ఎర్రచీర ఓటీటీ విడుదలకు సంబంధించిన ప్రకటన కూడా చేయనున్నాం. ప్రస్తుతం ప్రారంభించబోతున్న CSSB2 కూడా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకేలా ఉంటుంది. ప్రతి తండ్రి తన కుమారుడిని ఎలా తీర్చిదిద్దాలనే సందేశాన్ని బలమైన యాక్షన్, భావోద్వేగాలతో చూపించబోతున్నాం” అని అన్నారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సి హెచ్ సుమన్ బాబు కాగా, కథ, మాటలు కె. బాలకిషోర్, ఛాయాగ్రహణం కమిలి శివ, సంగీతం రాప్‌రాక్ షకీల్, ఎడిటింగ్ డి. వెంకట ప్రభు అందిస్తున్నారు. చిత్రంలోని నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here