కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్ లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి నటీనటులుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పెళ్లి సందD’. ఈ చిత్రాన్ని ఆయన శిష్యురాలు గౌరి రోణంకి దర్శకత్వం వహించగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లు సంయుక్తంగా కలసి నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని ఏరియాల నుండి హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ అభిమానులు మరియు శ్రీకాంత్ కు ఎంతో ప్రీతి పాత్రుడైన సంగీత దర్శకుడు ర్యాప్ ర్యాప్ షకీల్ తదితరులు పాల్గొని హీరోతో కేక్ కట్ చేసి అభిమానుల మధ్యలో ‘పెళ్లి సందD’ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా*
హీరో రోషన్ మాట్లాడుతూ..* నాకింత మంచి సినిమాలో పెద్ద నటీనటులతో నటించే అవకాశం కల్పించిన పెద్దలు, పూజ్యులు రాఘవేంద్ర రావుగారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించడానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..* అప్పట్లో గురువుగారు రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో నేను హీరోగా నటించిన “పెళ్లి సందడి” సినిమా ఏంతో ప్రజాధారణ పొంది గొప్ప విజయం సాధించి మా కందరికీ ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. యాదృచ్చికంగా మళ్ళీ ఇప్పుడు గురువు గారి పర్యవేక్షణలో అదే “పెళ్లి సందD” టైటిల్ తో మా అబ్బాయి రోషన్ ను హీరో గా పెట్టి తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు వచ్చిన నా పెళ్లిసందడి సినిమాను ప్రేక్షకులు ఎలా సక్సెస్ చేశారో.. ఇప్పుడు వచ్చిన మా అబ్బాయి “పెళ్లి సందడD’ సినిమాను కూడా అదే విధంగా ఆదరిస్తూ ప్రేక్షకుల సపోర్ట్ తో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.
సంగీత దర్శకుడు ర్యాప్ ర్యాప్ షకీల్ మాట్లాడుతూ..* మాది గుంటూరు జిల్లా చిన్నప్పటి నుండి నాకు శ్రీకాంత్ గారంటే ఏంతో ఇష్టం. ఆయన ఇన్స్పిరేషన్ తో నేను ముంబైలో మల్హోత్రా గారి దగ్గర శిష్యరికం చేసి, 2014 లో “రణం 2” కు సంగీతం అందించడం జరిగింది. అదే సంవత్సరంలో నా అభిమాన నటుడు శ్రీకాంత్ అన్నయ్య నటించిన కామెడీ ,హార్రర్ “రారా” మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాను. ఆ తరువాత ఆపరేషన్ 2019, మిషన్ 2020 వంటి సినిమాలకు సంగీత దర్శకుడు గా పనిచేశాను.ఈ రోజు మా శ్రీకాంత్ అన్న గారి అబ్బాయి రోషన్ హీరో గా నటించిన “పెళ్లి సందD’ సినిమా ఇంత గొప్ప విజయం సాదించినందుకు చాలా ఆనందతో అందరం సంబురాలు జరుపు కుంటున్నాము. ఇంత మంచి విజయాన్ని అందించిన రాఘవేంద్ర రావు గారికి మా ధన్యవాదాలు. ఇలాగే ఎన్నో మంచి చిత్రాల్లో హీరోగా నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించు కోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుతున్నాము అన్నారు.









