సినిమారంగం.కామ్
సినిమా : ఏకమ్
రివ్యూ రేటింగ్..3/5
సమర్పణ :బోయపాటి రఘు
బ్యానర్ : ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, సంస్క్తృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్
తారాగణం :అభిరామ్ వర్మ, తనికెళ్ళ భరణి,శ్వేతా వర్మ ,అదితి మైకేల్, కల్పిక గణేష్,దయానంద్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ :జోస్ ఫ్రాంక్లిన్
స్టోరీ అండ్ డైరెక్షన్ :వరుణ్ వంశీ
నిర్మాతలు : ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, సంస్క్తృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్
బోయపాటి రఘు సమర్పణ లో అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, శ్వేతావర్మ, కల్పిక గణేష్, అదితి మ్యాకల్ ప్రదాన పాత్రదారులుగా వరుణ్ వంశీ బి. దర్శకత్వంలో ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, సంస్క్తృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తం గా నిర్మించిన ఫిలాసిఫికల్ ఫిక్షన్ జోనర్లో మొట్ట మొదటిసారిగా తెలుగులో రూపొందుతున్న చిత్రం “ఏకమ్” . కాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్ లో ఈ చిత్రానికి 4 నాలుగు ఫిల్మ్ ఫేర్ ఆవార్డ్స్ రావడం గొప్ప విశేషం.. అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ విమర్శకుల ప్రశంశలు పొందిన “ఏకమ్” చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అలాగే ఈ చిత్రంలోని పాటలకి, టీజర్స్ కి పబ్లిక్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం 29 న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఏకమ్ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఏంటర్ టైన్ చేసిందో రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*కథ*
అభిరామ్ వర్మ (ఆనంద్ ),తనికెళ్ళ భరణి (అప్పయ్య పంతులు ) అదితి మైకేల్ (దివ్య ),కల్పిక గణేష్ (నిత్య) )దయానంద్ రెడ్డి (డేవిడ్ ) బిగ్ బాస్ 5 ఫ్రేమ్ శ్వేతా వర్మ (నిర్వాణ) ఈ అయిదు క్యారెక్టర్లు చుట్టూనే కధ తిరుగుతుంది. ఆనంద్ కుటుంబాన్ని చిన్న వయసులోనే పోగొట్టుకొని ప్రేమించిన అమ్మాయి దూరమయ్యి జాబ్ వచ్చినా చెయ్యకుండా ఈ ప్రపంచం లో ఎదో అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు,అప్పయ్య దేవుడు దగ్గర పూజలు చేస్తూవున్న తనని అదే దేవుడు తనకి పనిలేకుండా చేసాడు అని దేవుడి మీద కోపం తో అదే దేవుడిని (శివుడు ) స్మశానంలోకి తీసుకోని పోయి అక్కడే ఉంటాడు,దివ్య తండ్రిని కోల్పోయి తన డ్రీం ఎప్పటికి అయినా కాఫీ షాప్ పెట్టి పైకి రావాలి అని,డేవిడ్ ఒక విలన్ కానీ అదే దివ్య దగ్గర కాఫీ షాప్ లో నాకు తినటానికి కూడా తిండి లేదు జాబ్ కావాలి అని వచ్చి జాబ్ చేస్తాడు,నిత్య ఆనంద్ ని ఎలాగైనా మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలి అను కుంటుంది, నిర్వాణ (శ్వేతా వర్మ) తన ప్రెమించిన అబ్బాయి అనుకోకుండా జరిగిన సంఘటన వాళ్ళ నిర్వాణ ని రిజెక్ట్ చేస్తాడు, అప్పుడు నిర్వాణ, ఆనంద్ ఎందుకు కలుసు కున్నారు,ఆనంద్ స్మశానం లో వున్నా అప్పయ్య ని ఎందుకు కలుసుకున్నాడు,డేవిడ్ దివ్య కాఫీ షాప్ లో పని చేయటానికి కారణం ఏమిటీ,నిత్య ఆనంద్ చివరకి కలుసుకున్నారా లేదా తెలియాలి అంటె సినిమా చూడ వలసిందే.
నటీనటుల పనితీరు
ఆభిరాం వర్మ,,శ్వేతా వర్మ లు చాలా చక్కటి పెర్ఫార్మన్స్ తో సినిమాను తమ భుజాలు మీద నడిపించారు, తనికెళ్ళ భరణి శివ భక్తుడి పాత్రలో ఒదిగి పోయారు, కల్పిక పాత్ర నిడివి చాలా తక్కువ వున్నా కథ కి కనెక్షన్ వుండే రోల్ ప్లే చేసింది,ఇకపోతే దయానంద్ రెడ్డి నంది అవార్డు గ్రహీత తనకు ఎన్నో సినిమాల నుండి అవార్డ్స్ వచ్చాయి.తను నటించిన ఎన్నో క్యారెక్టర్స్ హైలైట్స్ అయ్యాయి, మిగిలిన నటీనటులు తమ పరిధిమేర బాగా నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు వరుణ్ వంశీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించేలా.. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న మా “ఏకమ్” చిత్రం రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగిన స్టోరీ అని ఫీలవుతారు ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే దర్శకుడు అయిదు క్యారెక్టర్ల సమాహారమే “ఏకమ్” అని ఒక క్లారిటీ ఇచ్చేసాడు, టైటిల్స్ దగ్గర నుంచి తన దర్శకత్వ మార్క్ కనిపించింది. ఫస్ట్ హాఫ్ అంత క్యారెక్టర్లు పరిచయం చేసి ఎక్కడ బోరింగ్ గా లేకుండా చాలా ఫాస్ట్ గా కధ కి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విదంగా దర్శకుడు వరుణ్ వంశీ చాలా జాగత్తగా నడిపించాడు, అదితి మైకేల్ కాఫీ షాప్ ఎపిసోడ్ కి ప్రాణం పోసారు, ఇకపోతే ఈ సినిమా కి ప్రాణం మ్యూజిక్ పాటలు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్ఛే శివుడి మీద వచ్ఛే సాంగ్ అలాగే సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జోస్ ఫ్రాంక్లిన్ ప్రాణం పెట్టాడు అని చెప్పాలి, ఇకపోతే డైరెక్టర్ వరుణ్ వంశీ తను చెప్పే ప్రతి డైలాగ్ కి చాలా డెప్త్ ఉంటుంది,సినిమా లో ప్రతి మాట ప్రతి పదానికి ఒక అర్ధం ఉంటుంది,సినిమా శుభం కార్ద్ లో జీవితాన్ని అన్వేషించు కొని పోయే వాళ్ళకి మా ఈ చిత్రం అంకితం అని చెప్పాడు అది తన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం, ఫిలాసిఫికల్ ఫిక్షన్ బాక్డ్రాప్ లో ఇంతవరకూ తెలుగులో ఎలాంటి సినిమా రాలేదు. ఫస్ట్ టైమ్ “ఏకమ్” చిత్రాన్ని డిఫరెంట్ గా రూపొందించారు .ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని నమ్మి ప్రొడ్యూస్ చేసిన నిర్మాతల గట్స్ కు మెచ్చుకోవాలి , ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, సంస్క్తృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించారు
Cinemarangam.com Rating 3/5









