‘Pushpaka Vimanam’ team interacts with family audience after a special show

ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ హిట్ మూవీ పుష్పక విమానం. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బాక్సాఫీస్ విజయాన్ని అందుకుంది. రిలీజైన ప్రతి థియేటర్ లో సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆడియెన్స్ తో స్పెషల్ గా ఇంటరాక్ట్ అయ్యింది. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు గీత్ సైని, శాన్వి మేఘన, దర్శకుడు దామోదర,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని,నటుడు కిరీటి ప్రేక్షకులతో సరదాగా సినిమా గురించి ముచ్చటించారు.

ఈ సందర్భంగా పుష్పక విమానం సినిమా తమకు ఎంతగా నచ్చిందో ఆడియెన్స్ టీమ్ సభ్యులకు చెప్పారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా ఫ్యామిలీతో కలిసి పుష్పక విమానం సినిమా చూసి ఎంజాయ్ చేశామని ఇంటరాక్షన్ లో పాల్గొన్న ప్రేక్షకులు చెప్పారు. లాక్ డౌన్ తర్వాత ఆడియెన్స్ కు ఒక మంచి నవ్వించే సినిమా అందించాలనే పుష్పక విమానం సినిమా చేసినట్లు ఆనంద్ దేవరకొండ అన్నారు. తాము
అనుకున్న పర్పస్ నెరవేరిందని, సినిమా హిట్ చేసినందుకు ఆడియెన్స్ కు థాంక్స్ చెప్పారు. హీరోయిన్ లు శాన్వీ మేఘన, గీత్ సైని, దర్శకుడు దామోదర పుష్పక విమానం చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గురించి అక్కడి ప్రేక్షకులతో పంచుకున్నారు. పుష్పక విమానం సినిమా థియేటర్ లలో ఆడియెన్స్ ఎంతగా నవ్వుకున్నారో వీడియో ద్వారా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here