కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని మొదటి సారి హీరోగా కేటుగాడు సినిమా కి పరిచయం చేసిన నిర్మాత శ్రీ వల్లూరిపల్లి వెంకట్రావు గారి వారసురాలు చిరంజీవి సితార వల్లూరిపల్లి ప్రజెంట్స్ లో శ్రీ వేంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ(నూతన పరిచయం) ,నిరుషా (ప్రముఖ మోడల్ బెంగళూరు) హీరో హీరోయిన్లుగా గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “ఆధారం”.ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు.ఈ సందర్భంగా
నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ ...ట్రైలర్ చాలా బాగుంది.కొత్త సినిమాలకు మేము 100% సపోర్ట్ చేస్తున్నాము.మాకు చిన్న సినిమా నిర్మాతలు అంటేనే ఎక్కువ ఇష్టంఈ ఆధారం చిత్ర ట్రైలర్ ను నా చేతులు మీదుగా విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆధారం సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర దర్శక నిర్మాత గోపి పోలవరపు మాట్లాడుతూ .. ఇంతకు ముందు మా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బెక్కం వేణుగోపాల్ గారు విడుదల చేశారు.ఇప్పుడు మా చిత్ర ట్రైలర్ చాలా బాగుందని మెచ్చుకొంటూ ఈ సినిమా ట్రైలర్ ను సి.కళ్యాణ్ గారు విడుదల చేశారు వారికి మా ధన్యవాదాలు. మరుగున పడిన మంచి టాలెంట్ ని బయటికి తీసుకు రావాలనే తపనతో కొత్త నటీ నటులతో ఈ సినిమా చేస్తున్నాము.ఈ సినిమాలో హీరో సూర్య భరత్ చంద్ర ,నిరూషా పాటు మిగిలిన ఆర్టిస్టులు అందరూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ నజీర్ గారు అందించిన రెండు పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
నటీనటులు
సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ, నితీష్,నిరుషా చరణ్, వాసు, యోగి కత్రి, వీరభద్రం, వెంకటేశ్వర రావు, వైజాగ్ సత్యనారాయణ తదితరులు
సాంకేతిక నిపుణులు
ప్రజెంట్స్ : సితార వల్లూరిపల్లి
బ్యానర్ : శ్రీ వేంకట లక్ష్మి క్రియేషన్స్
స్టోరీ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ : గోపి పోలవరపు
డిఒపీ : వెంకట్
మ్యూజిక్ : యస్.యన్.నజీర్
ఎడిటర్ : మేనగ శ్రీను
లిరిక్స్ : అంబట్ల రవి
ఫైట్స్ : యాక్షన్ రవి
కొరియోగ్రాఫర్ : రజని
పి.ఆర్.ఓ : గోపి పెరబోయిన









