‘Panchanama’ Title First look launched by Producer Dil Raju Garu

గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్ పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో  నిర్మించిన చిత్రం పంచనామ.ఈ పంచనామ టైటిల్  తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి చేతుల మీదగా విడుదల చేశారు.ఈ సందర్భంగా

దర్శకుడు సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ..  ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటు ఈ కథ విని నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.  మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక వర్గానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

నిర్మాతలు మాట్లాడుతూ : ఈ చిత్రాన్ని కథ లోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అర్థమైంది. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అని తెలియ జేస్తున్నాము. మా ఈ ఫస్ట్ లుక్ కి ఇంతటి ఆదరణ తీసుకొచ్చిన పి ఆర్ ఓ మధు గారికి మరియు ఆయన టీం కి ధన్యవాదాలు .

 నటీనటులు
త్రిపుర నిమ్మగడ్డ,  వెంప కాశీ, సంజీవ్ జాధవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్మి, ఆంజనేయులు ( జూనియర్ రాజశేఖర్ )తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : హార్దిక్ క్రియేషన్స్
నిర్మాతలు : గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము
రచన-దర్శకత్వం స్క్రీన్ ప్లే డైలాగ్స్ సిగటాపు రమేష్ నాయుడు
ఎడిటర్ బసవ రెడ్డి,
సినిమాటోగ్రఫీ పవన్ గుంటుకు, సంగీతం ప్రదీప్ చంద్ర,
పి.ఆర్.ఓ : మధు వి.ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here